Tuesday, August 01, 2006

గతం


స్నేహితులతో సరదాలతో
విరబూసిన నవ్వులతో
చిలిపి తగాదాలతో
మది నిండే భావాలతో
కలసి నడచే సాయంత్రాలతో
కలలు కనే నడి రాత్రులతో
కలుసుకునే ఉదయాల కోసం ఎదురు చూపులతో.....
స్నేహం తోడుగా
కాలం సాక్షిగా
కరిగిపోయిన గతాన్ని
అప్పుడప్పుడు గుండె గుప్పిళ్ళ నుండి
జారవిడిచి అపురూపం గా తరచి చూసుకుంటూ
నిన్నని నేడుగా భావిస్తున్నాను
నేడు నిన్నలో జీవిస్తున్నాను
అయినా ఎందుకో .....ఇప్పుడిలా మరణించి
అప్పటి నాలా...మళ్ళా జన్మించాలనివుంది
......................................................................
......................................................................
గతం తలుపులు తెరుచుకుని
జ్ఞాపకాల వీధుల్లో
ఒంటరి పక్షి లా తిరుగుతున్నాను

అప్పటి స్నేహపూరిత హస్తాలను మళ్ళీ స్పృశిద్దామని
రేపటి లోకి ఆశ గా ఎదరు చూస్తున్నా...
ఒకప్పటి పసిదనం ఛాయలు మఛ్చుకైనా
రాకపోతాయా అని..
నిజానికి..
రేపటి పై ఆశ లేదు
నిన్నటి ని చేరాలని ఆరాటం తప్ప
నేటి గురించి ఆలోచన లేదు
అప్పటి అనుభూతుల నెమరివేత తప్ప

2 comments:

HariHemantham said...

excellent, naa engineering ayipoyaka chala kalam naalo medilina aavedana meeru kavitha roopamlo chupara annattu undhi naaku

suresh said...

పాత నేస్తాల అత్మీయ కౌగిలి కోసం
పాత జ్నాపకలను నెమరు వెసుకుంటూ..
బరువెక్కిన మనసుతో
అలుపెరగని ప్రయత్నంలో ఉన్న నాకు ..
మీ కవిత యొక్క కమ్మనైన భావంతో
మనసు తెలికైంది....

Thank you,