Saturday, August 19, 2006

జీవితం


ఈ రంగుల లోకంలో
నావన్నీ నల్లని అనుభవాలు
కనుల కాగితం పై
కలల కావ్యాలకి బదులు కన్నీటి చిత్రాలు...

వదిలి పోయిన సున్నిత త్వం
కౌగిలించుకున్న కర్కశత్వం
నేను కాదనుకున్న కలివిడితనం
నన్ను కాదనుకున్న ఆనందం

నాలొని నన్ను చంపుకుంటూ
నన్ను నేను మార్చుకుంటూ....వెళ్ళాల్సిన
తీరం కనిపించని దూరం లో గమ్యం
కన్నవాళ్ళను వదిలి
స్నేహాలను మరచి
డాలర్ల లో వెతుక్కొవాల్సిన సంతోషం

నేనంటూ మిగిలి లేని
నాదంటూ ఏమిలేని
నాకంటూ ఎవరూ వుండకూడని జీవితం

పెళ్ళి కి అర్ధం ఇప్పుడు తెలిసింది
"నువ్వు కాని నువ్వు
నీది కాని జీవితం"

11 comments:

radhika said...
This comment has been removed by a blog administrator.
swathi said...

hmmm.
good expression.

spandana said...

అయ్యో! అందమైన ఈ కవితాక్షరాలలో ఈ సున్నాల ("0") రాయిపలుకులేంటి?

-- ప్రసాద్
http://charasala.wordpress.com

రానారె said...

మేడం!!!!! "అయ్యో" అనిపించారు.
ఒంటరితనం చాలా నేర్పిస్తుందటారు అనుభవజ్ఞులు.
మీకు సదా సంతోషమయమైన జీవితం కలగాలని దీవిస్తున్నాను, ఈ కవిత చదివిన భావావేశంలో.

radhika said...

ఈ కవిత నేను ఈనాడు లో వచ్చిన ఒక కధకు స్పందించి రాసానండి.ఇది నేను బాగా వ్యక్తీకరించానని ఫీల్ అవుతూవుండేదానిని.కానీ అప్పట్లో ఈ కవితకు ఒక్క స్వాతి గారి కామెంట్ తప్పించి ఏమీ రాలేదు.కొద్దిగా బాధ అనిపించింది..ఎలా చూసినా నేను ఊహల్లో తేలిపోతూ రాసిన కవితలకి వచ్చినంత రెస్పోన్స్ ఇలా నిజాన్ని వ్యక్తీకరిస్తే రావట్లేదు.ఇలాంటి భావాన్ని నేను సరిగా రూపం ఇవ్వలేకపోతున్నానేమో?ఈ కవితకి కామెంట్లు రాసిన అందరికీ చాలా చాలా థాంక్స్.

lalitha said...

రాధిక గారూ,

అదే మరి. చాలా బాగా రాసారు.
ఆ వ్యధ మీదే అయినట్టు రాసారు.

మీ కవితను అభినందించడంకన్నా
మీ "బాధ"ను తెలుసుకున్నట్లనిపించి
మౌనం వహించాను నా మటుకు నేను.

మీ కవితలు చాలా బాగుంటాయి.
వాటిని అభినందిచడంకన్నా
ఆస్వాదించడమే బాగా చేతనవుతుంది నాకు.
ఏమనుకోకండి :-)

లలిత.

Suresh said...

నాలొని నన్ను చంపుకుంటూ
నన్ను నేను మార్చుకుంటూ....వెళ్ళాల్సిన
తీరం కనిపించని దూరం లో గమ్యం
కన్నవాళ్ళను వదిలి
స్నేహాలను మరచి
డాలర్ల లో వెతుక్కొవాల్సిన సంతోషం
...excellent words to describe what one will be missing by staying away from home

నవీన్ గార్ల said...

రాధిక గారు, ఇంతకు ముందొక సారి చెప్పాను...ఈ కవిత చదివాక ఇంకొక సారి చెప్పాలనిపించి చెబుతున్నాను...నేను చూసిన ఉత్తమ బ్లాగులలో మీది ముందు వరుసలో ఉంటుంది. వేల మాటలు చెప్పగలిగే భావాన్ని కవిత రూపంలో సంక్షిప్తంగా వ్రాసి మెప్పించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒక రకంగా చెప్పాలంటే..మీరు వేలల్లో ఒక్కరు. రచయితలు (త్రులు) అంటే అంత అపూరూపం మరి. ఇంజనీరింగ్ / డాక్టర్ కోర్సులను కష్టపడితే ఎవ్వరైన చేయగలుగుతారు. కానీ కళలు అలా కాదు...దేవుడు వరిమిచ్చిన వాళ్ళకే అది సాధ్యం. కాబట్టి ఎప్పుడూ నిరాశ చెందక...మీ రచనలను ఉత్సాహంగా కొనసాగించండి

vijay said...

excellent...

superb

శ్రీవిద్య said...

హ్మ్.............. మీరు బాధపడుతుంటే నాకేంటింత బాధగా అనిపిస్తుంది.

HariHemantham said...

chala baga rasarandi.chadive variki mee jeevitham loni vyadhanu theliparaa annattuga undhi.kaani verokari anubhavala nundi veluvadda ee kavitha ekkado andharini manassulanu thappakuda thaki untundi. kaani naalage badhakam tho comment icchi undaru.pls do write more from real facts also u r too good