Tuesday, August 01, 2006

పతనం


మధుర గాయాల వేణువునై
కోటిరాగాల జననినై
జీవిస్తున్నానని వెదురు....
వేయితలలను సైతం వినయంగా వంచి
వేలాదిజీవుల ఆకలితీరుస్తున్నానని వరిపైరు
తృప్తిగా తనువుచాలిస్తున్నాయి.
కానీ నేను...
గమ్యం వుండీ గమనం లేక
విజ్ఞానంవుండీ జ్ఞానంలేక
మనిషినైవుండీ మానవత్వంలేక
పతనమైపోతున్నాను

1 comment:

Anonymous said...

మీ బ్లాగ్లో ప్రతీ పోస్ట్ ఒక ఆణిముత్యమండీ..
ఇలానే మరిన్ని ఆణిముత్యాలను అందించగలరు.