Wednesday, October 25, 2006

ఈ రోజు


కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారి
గుండె లోని ఎంత భారాన్ని దించింది...
ఈ రోజే కన్నీటి బరువు తెలుసుకున్నాను

ఇందరి ప్రియ నేస్తాల సమక్షం కూడా
ఇవ్వని ఓదార్పు ఒక్కరి స్పర్శ అందించింది...
ఈ రోజే ఒక ఆత్మీయుడిని తెలుసుకున్నాను

ఇన్ని తెలిపిన ఈ కష్టం ఇపుడు నాకిష్టమైంది
ఈ రోజు నాకెంతో విలువైనది

5 comments:

valli said...

mii migilina kavitala range lo ledandi.

spandana said...

చాలా బాగుంది.
--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

చాలా బాగారాసారండి..

Anonymous said...

mee kavitha ippatiki 20 times chadivaanu andi. chaala bavundi.

Anonymous said...

oh excellent