సమస్తం నీకు అర్పించి
మోడునై నిలుచున్నాను
అనుభూతుల మంచుపూలు
కొమ్మకొమ్మన పూచి
అవికూడా
నీ ఒడి చేరాలని వేచిచూస్తున్నాయి
నువ్వు తెచ్చే చైత్రం లో
చిగురించాలని ఆశగా ఎదురుచూస్తున్నాను నేస్తం
పౌర్నమి నాటి వెన్నెల కెరటం లా వుంది
ఈ రోజు నా అంతరంగంనీటి నురుగులా నా ఆలోచనలుతీరం చేరినట్టే చేరి పట్టుకొనే లోపే మాయమైపోతున్నాయిఅలల ఆటకు అలుపు లేదు
నా కలల బాటకు గమ్యం లేదు
మనసులో కలుగుతున్న భావాలెన్నో ఏ రూపం లేకుండా అలానే గతిస్తున్నాయినా అక్షరాలు కొంత కాలం గా అజ్ఞాతం చేస్తున్నాయి మరిభావానికి రూపాన్నిచ్చే భాషఆమె మాయలో పడి లిపిని మరచిపోయిందిప్రేమ మత్తు అటువంటిది మరిభావాలకి రూపాన్నిచ్చి గుండెబరువు దించుకునే క్షణం ఎప్పుడొస్తుందో మరి?