స్నేహమా....
Thursday, August 23, 2007
జాజిపూల జ్ఞాపకాలు
ఆ పెరటి గుమ్మానికి సన్నజాజుల తోరణాలు
జాజులతోపాటూ
జ్ఞాపకాలు కోసుకుంటూ
రాలిపడిన పూలతో పాటూ
గత కాలపు క్షణాలను ఏరుకుంటూ
స్నేహితురాళ్ళతో పంచుకున్న
పూలదండల బహుమతులను
అపురూపం గా మననం చేసుకుంటూ
ఆహ్లాదకర సంధ్యను
జాజిపూల సాక్షిగా
మనసారా ఆఘ్రాణిస్తున్నాను
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)