Sunday, July 29, 2007

లేఖ


నీ లేఖలో ని ప్రతీ వాక్యం
ఎన్ని కబుర్లు చెబుతుందో
నిశ్శబ్ధం గా
ఎన్ని జ్ఞాపకాలను తడుతుందో

ఇరికించి మరీ రాసే అక్షరాలు
ఎంత ఆప్యాయతను చూపిస్తాయో
చదివిన ప్రతీ సారీ మదిలో
ఎన్ని రంగులను నింపుతున్నాయో

అల్మారాలో,బట్టల మడతల్లో
పరుపు క్రింద,ఫొటోల వెనుక
ఎక్కడ చూసినా నీ అక్షరాలే
వాటి తాలూకూ పరిమళాలే

ఎప్పుడూ నీ ఉత్తరాలతో పాటూ
నా దగ్గరగా నువ్వు

-స్నేహం తో
నీ చిరు నవ్వు