Monday, April 14, 2008

రేపటి కానుక



నిజాన్ని అద్దంలోంచి చూస్తూ
అబద్దంలో
హాయిగా తిరిగేస్తున్నాం

ఆకలి కేకలు వింటూ
అయ్యోపాపమంటూ
నిట్టూర్చి వదిలేస్తున్నాం

సుఖాన్ని పెంచుకుని
సంతోషాన్ని కుదించుకుని
మరమనుషుల్లా మిగిలిపోతున్నాం

విలువమారే కాగితాన్ని చూపిస్తూ
మాకేం తక్కువంటూ
ఎదురు ప్రశ్నలు వేస్తున్నాం

ఎంతో విజ్ఞానం సంపాదించి
అంతటి విశ్వాన్ని చేధించి
పచ్చటి దారిలో ముళ్ళ తివాచీలేస్తున్నాం
రేపటి తరానికి ఎడారుల్ని కానుకిస్తున్నాం

Wednesday, April 02, 2008

???


నీ-నా పరిచయం చిరునవ్వుల వరకేనా ?
నీ చూపుల్లో నా స్థానం రెప్పపాటేనా?

నీ గతం లో నా చిరునామా మచ్చుకైనా దొరికేనా
ఏ నిమిషానైనా నీ స్నేహం నన్ను పోల్చేనా?

పై చిత్రాన్ని వాడుకునేందుకు అనుమతించిన "పృధ్వీ వర్మ" గారికి ధన్యవాదాలు.