నేస్తం నీ కన్నీటి ని చూసి నా గుండె నిండి పోయింది నువ్వు చిందించిన కన్నీరు నాకు భరోసానిచ్చింది నేస్తం... నీకు గుర్తుందా... ఆ రోజు నువ్వు నానిగాడి తో పంపిన ఆ ఉత్తరం... అందులో కన్నీటి చుక్కలతో అలుక్కుపోయిన అక్షరాలు చెప్పేసాయి మన స్నేహం గాఢతని ఆక్షణం నీ కన్నీరు నాకెంత ధైర్యాన్నిచ్చిందని? నాకోసం బాధపడే హ్రుదయం ఒకటంటూ ఉందని నా మనసెంత గర్వపడిందని?
ఇంతకీ ..
నా కనుల కాగితం పైన
కన్నిటి చిత్రాలు
నీకు కనిపిస్తున్నాయా మరి?
చాలా మంది అంటారుఒక్కసారి కనులు మూసుకుని జ్ఞాపకాల తలుపులు తెరుచుకో అని!కానీ నేను...నిను తలచినప్పుడల్లానువు పంపిన ఉత్తరాలు తెరుస్తానుకనులు మూస్తే నీ రూపం మాత్రమే కనిపిస్తుందిఅదే ఉత్తరాలు తెరిస్తే నీ మనసుని చూపిస్తాయి మరి!అక్షరాల్లో దాగిన అనుభూతులనికళ్ళతో ఏరుకుంటూ..పాత అనుభవాలనుకొత్తగా పరిచయం చేసుకుంటూ..మడిచిన ఉత్తరాల్లో దాగినఎన్నో తీయని స్మృతులనివెచ్చగా అనుభవిస్తూవుంటానుప్రసాద్ గారి "ఉత్తరాలు" స్పూర్తి తో
ఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయాయో నా కన్నీళ్ళల్లో ఎన్ని కలలు జారిపోయాయో
మనసు మెదడు తో యుద్దం చేస్తుందిఫలితమే ఈ నిదురలేని రాత్రిఅయితేనేమిలే...పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నానుఅందుకే ఇప్పుడునా పుస్తకాన్ని సరికొత్తగా ప్రారంభిస్తున్నానుఓ నిరాశా...ఈ రాత్రి మాత్రమే నీదిరేపటి ఉదయం...నాది....