
చిరునవ్వు విలువెంతో
అందుకొన్న అతిధినడుగు
సూటి మాట పదునెంతో
గాయపడిన మనసునడుగు
జారిన కన్నీటి బరువెంతో
తేలికపడిన గుండెనడుగు
చివరికి మిగిలేదేమిటో
కాలు నిలవని కాలాన్నడుగు

వేకువ ఝాములో గుడిలో మేల్కొలుపు గీతాలు
దోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులు
ఆవిష్కరించే అందమైన చిత్రాలు
మరోపక్క మాయచేసే మంచు తెరల మధ్య
చలిమంటల వెచ్చదనాలు
ముచ్చటగా ముగ్గులతో నవ్వే ముంగిళ్ళు
మనసునిండుగా హరిదాసు దీవెనలు
సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో
చలిగిలికి ఇంకా

నావని గర్వం గా చెప్పుకున్నవి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......
తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...
గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను
ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి