Friday, January 11, 2008

మా స్నేహం


పంటపొలాలమధ్య పాటలా మా స్నేహం
ఎగుడు దిగుడు రహదారుల్లో
అలుపు లేకుండా సాగిన పయనం

పిల్లకాలువలో ప్రతిబింబాలు చూస్తూ
గట్టు మీది గడ్డి పూలు కోస్తూ
మైమరచిన క్షణాలు
అపార్ధాలు,అలుకలతో
మూతి ముడుచుకున్న వైనాలు

బుజ్జగింపులు,లేఖలు,రాయబారాలు
వెనువెంటనే నవ్వులు,పువ్వులు...గంటలతరబడి కబుర్లు

ఒక మనసు బాధపడితే
చెమ్మగిల్లే కన్నులెన్నో మరుక్షణంలో
ఒక పాదం తడబడితే
ఊతమిచ్చే చేతులెన్నో మా స్నేహంలో


.