Wednesday, March 18, 2020

నువ్వు రాలేదని

ఓయ్ ..
నీకోసమని చేసిన టీ... మరిగీ మరిగీ
పాపం 
మొహం మాడ్చుకుంది
నీ కబుర్లేవో విందామనుకున్న త్రో బ్లాంకెట్
ఎదురుచూసీ చూసి   
అదిగో సోఫాలో ముడుచుకు కూర్చుంది  
నువ్వు పక్కనలేకుండానే ఇంకోరోజు  గడిచిపోయింది .... 
నీ నవ్వుల జ్ఞాపకాలు మిగల్చకుండానే 
ఈసాయంత్రం కూడా వెళ్ళిపోయింది  !

4 comments:

Jyothirmayi said...

రాధిక గారూ, అఫ్సర్ గారి కవిత చూసి "మా ఊరు" కవిత మళ్ళీ చదువుదామని మీ బ్లాగ్ కి వచ్చాను. మీరు మళ్ళీ రాస్తున్నారని తెలిసి చాలా సంతోషం వేసింది. కవిత బావుందండి.

రాధిక said...

జ్యోతిర్మయి గారూ .... బ్లాగులు ఎవరూ చదవట్లేదనుకుని... రాసినవన్నీ ఒక చోట వుంటాయి అన్నట్టు ఇక్కడ పోస్ట్ చేసానండి . మీ కామెంటు చూడగానే భలే సంతోషం అనిపించింది . థాంక్స్ అండి .

రాధిక said...

Thank you Raghu garu .

Rukmesh said...

స్నేహమ్మగారు, బ్లాగర్ని ఇప్పట్లో చాలామంది చూడకపోయినా కూడా మీ ఆలోచనలు, మాటలు మాలాంటి కొందరితో పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు