ప్రయాణంలో ఎక్కడ జారవిడుచుకున్నానో నీ జ్ఞాపకాన్ని
నాతో నువ్వు లేవన్నమాటే తెలియనంతగా
ఎలా…ఎలా?
నిన్నే మర్చిపోయేంతగా
ఏం జరిగిపోయిందీ జీవితంలో ?
నిన్ను అట్టడుగు పొరల్లోకి నెట్టేసేటన్ని
అనుభవాలు సంపాదించానా?
నీ జతలేని క్షణమే లేదుగా నా గతంలో!
సర్ధి చెప్పుకుంటున్నానులే మనసుకి
నా తప్పేం లేదు…
కాలం అన్నిటినీ మాయం చేస్తుంది
గాయాన్నైనా….జ్ఞాపకాన్నైనా!
( first publish in vakili web magazine May 2017 )
2 comments:
ఈ న్ దిరావానం కుచుల్ల లో లో మహాత్మా
కాలం గాయాన్నైనా, జ్ఞాపకాన్నైనా మాయం చేస్తుంది అన్నారు... నాకెందుకో, మాయం కంటే మరుగున పడేస్తుంది అనడం సబబేమో అనిపిస్తుంది. ఎప్పుడో, ఏకాంతం కుదిరినప్పుడు, ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకొస్తాయి. మన మస్తిష్కంలో దాగి ఉన్న ఆ న్యూరాన్లు మనం పలకరిస్తే ఇట్టే బయటికొస్తాయి. ఏమంటారు?
Post a Comment