ఆ సాయకాలం ...
ఎన్ని పూలు నిన్ను చూసి చిన్నబుచ్చుకున్నాయో!
ఎన్ని కళ్ళు నిన్ను మెచ్చుతూనే
మూతి ముడుచుకున్నాయో!
తుమ్మెదలూ , సీతాకోకలూ సరేసరి !
పిల్లగాలికీ మనసైనట్టే వుంది ...
నీ చుట్టే తిరిగిందిగా మరి!
అమ్మో ...
ఎంత దిష్టితగిలిందో ఏంటో
నా బంగారానికి!
Post a Comment
No comments:
Post a Comment