నీ జ్ఞాపకాలు
సన్నటి కన్నీటి పొర
అడ్డుపడుతూ వుంది
వదిలి వెళుతున్న నిను చూద్దామంటే
నువు దూరం అయ్యేకొలదీ
ఆవేదన జలపాతంలా
కన్నీరై చెంపలపై జారింది
ఇక ఏ అడ్డూ లేదు నిను చూడడానికి
నిజమే..ఏ అడ్డూ లేదు..
చివరికి నీ నీడ సైతం
ఇక అక్కడ వున్నవి
విలపిస్తున్న నా హృదయం
చెరిగిపోని నీ జ్ఞాపకాలు
4 comments:
deep from heart. keep it up.
Radhika GaRu
so noce mi kavitha
thanks
Prasad.
Bangalore
naa gatam malli gurtochindi
చాలా బాగుందండి.
నేను చదువుతున్న మీ కవితల సంఖ్య పెరుగుతున్నకొద్దీ మీ మీద గౌరవం, అభిమానం కూడా పెరుగుతుందండి.
వాటిని మాటల్లో చెప్పాలంటే నాకు తెలిసిన అక్షరాలూ, పదాలు సరిపోవట్లేదు. మదిలో మొలకెత్తిన భావాలని అందమైన అక్షరవనంగా చేసేంత పదజాలం నాకు తెలియదు.
అందుకే, నాకు వచ్చిన సాధారణ పదాల్లోనే వ్రాస్తున్నాను.
మీరు ఇలాగే మనసుకు హత్తుకుపోయే కవితలు ఇంకెన్నో రాయాలని మరోసారి కోరుకుంటూ...
- ప్రణవ్
Post a Comment