Tuesday, August 01, 2006

దాచేసుకోవద్దు


మేఘ సంగీతానికి
నెమలి పరవశంలో మునిగి
పదం కలపడం మానట్లేదు గా
వసంతపు వర్ణానికి మురిసి
కోయిల గొంతు కలపడం మరచి
మూగబోవట్లేదుగా
ప్రకృతి లో అన్నీ..మనసు నిండగానే
మైమరచి భావాలన్ని వ్యక్తం చేస్తున్నాయి తప్పి0చి
మనలా...గుండెల్లో..కన్నుల్లో దాచేసుకోవట్లేదుగా
మరి మనిషెందుకు మనసు నిండగానే మూగబోతాడు?

3 comments:

Anonymous said...

good!!

Ur pictures werew simply superb!! By the way where do u get them?

రాధిక said...

google serch lo dorikayi.chala varaku ekkadanna chuste save chestu vuntanu.ave ekkuva use chesanu.

Paddu said...

మనసు నిండగానే మౌనాన్ని ఆశ్రయిస్తుంది...దాచేసుకోవద్దు అనుకుంటూనే ఆ మౌనం.. గుండెలో చిరునామా లేని బాధగా...కళ్ళలో కన్నీళ్ళుగా బయటకు వస్తుంది... కాకపోతే మౌనంగా !! మనసు ఎప్పుడూ ఒంటరిదే అని ఋజువు చేయటానికి !!

లేకపోతే ప్రక్రుతికి మనిషికి ఈ భేదం ఉండేది కాదేమో !!

రాధిక గారు... ఈ కవిత చాలా ఆలస్యంగా చదివినందుకు మన్నించండి..

మీ కవితలు చాలా అద్భుతంగా.. మనసుని హత్తుకుంటున్నాయి... మౌనంగా !!