![](http://photos1.blogger.com/blogger/5949/3492/200/Child-002.jpg)
ఓ చినుకునై ఈ నేల చేరి
పొత్తిళ్ళలో పైరు పిల్లలనెత్తాలని
ఆ గాలినై ప్రతి పూవు తాకి
నిత్య సుగంధాలు వెదజల్లాలని
ఓ భావనై ప్రతి మది ని దాగి
యద తలుపులు తడుతూ ఉండాలని
ఒక భావమై కలములో దూరి
కమ్మని కవితామృతం చల్లాలని
చిన్నారి పెదవినై ప్రతి బుగ్గపై
ముద్దు తాలూకు తడి జ్ఞాపకంలా మిగలాలని....
ఎన్నెన్ని ఆశలు.......ఎన్నెన్నో ఆశలు....
6 comments:
రాధిక గారు,
మీ ఆశలు కవిత చూసాను
నాకు ఓ చినుకునై ఈ నేల చేరి
పొత్తిళ్ళలో పైరు పిల్లలనెత్తాలని
ఈ మాటలు చాలా నచ్చాయండి.
వుంతను మరి
మీ శ్రీలు
ఎప్పటిలాగానే,బాగుంది. "కలములో దూరి" కన్నా "కలంలో దూరి" అంటే చదవడంలో మరింత సౌలభ్యం కలుగుతుందేమో అనిపించింది.ఎందుకంటే ‘కలం’‘కవితామృతం’రెండూ కలిపిన శబ్దం బాగుంటుంది.
జ్వరంలో ఉన్నా బ్లాగులు చూడాలనే వ్యసనం వల్ల కూడలి తెరవగానే కనపడింది మీ కవిత!
"పొత్తిళ్ళలో పైరు పిల్లలనెత్తాలని" ..మనోహరంగా ఉందామాట.
పిల్లలనెత్తడం అనే అచ్చతెలుగు మాటలు వినడానికి నా మనసు ఎపుడూ కుతూహలపడుతూ ఉంటుంది.
"ముద్దు తాలూకు తడి జ్ఞాపకం" కూడా చాలా "తడి"గా తాకింది.
ఇంకా రాయాలనిఉంది కానీ ఇంతకంటే ఓపిక లేదు మరి! వారం తర్వాత రాస్తా!
:)
అందరికీ థాంక్స్.ఇది ఎప్పుడో 7 ఏళ్ళ క్రితం రాసాను.3 ఏళ్ళ క్రితం పోస్టు చేసాను.ఇప్పుడు దీనికి స్పందన వస్తుంటే చాలా సంతోషం గా వుంది.
Post a Comment