Friday, December 01, 2006

రేపటి ఉదయం



ఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయాయో
నా కన్నీళ్ళల్లో ఎన్ని కలలు జారిపోయాయో

మనసు మెదడు తో యుద్దం చేస్తుంది

ఫలితమే ఈ నిదురలేని రాత్రి

అయితేనేమిలే...
పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నాను

అందుకే ఇప్పుడు
నా పుస్తకాన్ని సరికొత్తగా ప్రారంభిస్తున్నాను

ఓ నిరాశా...
ఈ రాత్రి మాత్రమే నీది
రేపటి ఉదయం...నాది....

11 comments:

Anonymous said...

నాకు కవితలు అంతగా అర్ధం కావు. అందుకే వ్యాసాలు వ్రాసుకొంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాను. ఈవేళ వరసగా మీ కవితలు చదివి నా అభిప్రాయం వ్రాయకుండా ఉండలేకపోతున్నా. మీ కవితలు బాగున్నాయి. కొన్నిటిలో అనుభూతులు, కొన్నిటిలో సులువైన పదాల్లో సందేశాలు, కొన్నిటిలో ఏదో వెల్తి భావం - వెరసి చదివించి ఆనందపరచే గుణం ఉంది. అభినందనలు.

Anonymous said...

చాన్నాళ్ళకి మంచి కవిత్వం చదివినట్టుందండీ..
భావకవిత్వం గుర్తొచ్చింది..


"గాడిద మీద మూటలు మోయించినట్లు
కవితలో మాటలు మోయించకు.
బాలపల్లవ కోమల వాగ్దేవితో
బస్కీలు తీయించకు,కుస్తీలు చేయించకు!"-అన్న ఓ మహానుభావుని
మాటలు సరిగ్గా పాటించారెమొ అన్నట్టున్నాయండీ మీ కవితలు....

చాలా తేలిగ్గా,మనసుకు ఆహ్లాదంగా

Anonymous said...

mee kavithalu baagunnayi. chalaa mamoolu padaltho manchi kavitvaanni srushtincharu. meeru pettina pictures kooda chalaa apt ga unnayi.

Anonymous said...

హుమ్మ్.. మీ కవితలు చదువుదాం అనుకుంటా సమయం ఉన్నప్పుడు. చదువుతా.. కానీ ఎంతో డెప్త్ ఉంటుంది అందులో.. వెంటనే సరిగా అర్ధంకాదు నా బుర్రకి. కాబట్టి అన్ని ఒక ప్రింట్ తీసుకెళ్ళైనా అర్ధమయ్యేలా చదవాలి అప్పుడు చెబుతా ఎలా ఉన్నాయో.

ఇలానే ఇంకా కొన్ని వ్రాయలని కోరుకుంటూ.

శ్రీ

Satish said...

అద్బుతంగా ఉన్నది!!!

Anonymous said...

"ఈ రాత్రి మాత్రమే నీది రేపటి ఉదయం...నాది...."
ఇది మంచి ఆశావహ దృక్పదం
ఈ భావన నాకు నచ్చింది.

Naga said...

చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో నేను చదివిన కవితలలో, నాకు ఎంతో నచ్చిన కవిత.

Anonymous said...

this poem is amazing

Anonymous said...

abba.. mee daggara chaala vishayam undi..
i liked ur way..

Anonymous said...

మీ కవితలు అన్నీ చదివాను.చాలా చాలా బాగున్నాయి.
గణతంత్ర్య దినోత్సవ శ్షుభాకాంక్షలు.

సుదర్షన్ రెడ్డి.యం

Ajju's said...

exelent your lirics
Sakshi Brundam HYD.