Monday, January 29, 2007

అప్పుడప్పుడూ...



మది నిండిన ఎన్నో మధురానుభూతులను
అప్పుడప్పుడూ ఒలక బోసుకుని
ఎంతో ఇష్టం గా తిరిగి గుండె అరల్లో
సర్దుకుంటూ వుంటాను

పాత పుస్తకాల పుటల్లోని నెమలీకలని..
దాచుకున్న ఉత్తరాల మడతల్లోని
మనసుల రూపాలని..
అపురూపంగా పరామర్శిస్తూవుంటాను

పట్టలేని భావోద్వేగాలు
యదను కుదిపేస్తూవుంటే
వాటిని కన్నీరుగాను,కవితలుగాను
మలచుకుంటూ..
తిరిగిరాని బాల్యాన్ని
కన్నుల ముందు ఆవిష్కరించుకుంటూ వుంటాను

ఈ కవిత తొలి ప్రచురణ
http://poddu.net/

8 comments:

Anonymous said...

అవును నిజమే కదా. నెమలి ఈకలు, తామర పూవులు గుర్తుకు వచ్చేది బాల్యం లోనే.

బాగుంది మీ కవిత

విహారి
http://vihaari.blogspot.com

Vissu said...

Chaala bavundi mee kavitha..

Anonymous said...

mee kavithalanni chalaaa bagunnayi..:)

u got an awesome blog!

రాధిక said...

పొద్దు లో నా ఈ కవితకి వచ్చిన స్పందనలను ఇక్కడ ఇస్తున్నాను.

Sudheer, K. Kothuri ఇలా అన్నారు:
చాలా బాగుంది! మీ కవితలు సరళంగా అద్భుతంగా ఉంటాయి! ఈ కవిత నాకు బాగా నచ్చింది.

Tulasi ఇలా అన్నారు:
"మది నిండిన ఎన్నో మధురానుభూతులను
అప్పుడప్పుడూ ఒలక బోసుకుని
ఎంతో ఇష్టం గా తిరిగి గుండె అరల్లో
సర్దుకుంటూ వుంటాను"
“Jnapakalaku manchi” ardham chepparu. chala bagundi

రాధిక said...

పొద్దులోని మరికొన్ని స్పందనలు :[http://poddu.net]

రానారె ఇలా అన్నారు:
ఇలాంటి ఆలోచనలు నాకూ ఇక్కడికొచ్చాక ఎక్కువయ్యాయి. సెంటిమెంట్లు, ఆప్యాయతలు గట్రాలాంటివి నాకు తక్కువ, నన్ను పెద్దగా కదల్చలేవు అనుకునేవాణ్ణి.


kbs sarma ఇలా అన్నారు:
రాధిక గారి కవిత నేరుగా మనసును తాకింది. బాల్యపు చేష్ఠ ద్వారా పుస్తకాల పొరల్లో దాచుకునే నెమలి పింఛపు ఖండికల్లోని అమాయకతను అధ్బుతంగా పేర్చారు. నా అభినందనలు.

ప్రసాద్ ఇలా అన్నారు:
చాలా హృద్యంగా వుంది.

Sriram said...

chaalaa baagundandi ee kavita...

Rama Deepthi Muddu said...

dachukunna uttaralla madathalloni manasula roopalani... ee line chala bavundi... mee kavitalu, sangatulu nijamga kallaku katti nattu unnayi... maa chinnappudu oka telugu teacher, "kalibata" ane poem exlain chestunte... eevida cheppinattu pattham evaru cheppaleru anukune danni... anta goppaga cheppevaru...mee kavitalu chaduvutunte..malli aa rojulu gurthostunanyi... manchi imagination ni kaligistunnayi... inta manchi telugu chaduvutunte malli sandhulu,samasalu..pratipadhardhalu ivanni chadivithey ela untunda ani anipistondi.. manchi pustakam chadivina anubhuti vachindi.. meeku krutaghyatalu...

Anonymous said...

Dear Friend,

Mi kavithalu chala chala bagunnayi, miru elage rastu umdali. bye.
bhadri1177
bhadri1177.blogspot.com