Wednesday, February 14, 2007

చిరుగాలి కోపానికి..

అలుపు తీర్చే చిరుగాలి
అలిగి సుడిగాలైపోతే
చిగురుటాకులా వణికిపోతున్నాను..!
కానీ..
ఈ సుడిగాలి జడివాన కురిపించి
సాహిత్యపు మొలకలెత్తిస్తుంటే
ఆ ధారల్లో తడిసి మురిసిపోతానుగానీ
ఎండుటాకులా దూరం గా ఎగిరిపోను

13 comments:

Vissu said...

bavundi kavitha.

Anonymous said...

manchi arthamundi induloe. baavundi.

Dr.Pen said...

అలుపు తీర్చే చిరుగాలి - శాంతము.
అలిగి సుడిగాలైపోతే - రౌద్రము.
చిగురుటాకులా వణికిపోతున్నాను - భయానకము.
ఈ సుడిగాలి జడివాన కురిపించి - కరుణము.
సాహిత్యపు మొలకలెత్తిస్తుంటే - అద్భుతము.
ఆ ధారల్లో తడిసి మురిసిపోతాను - శృంగారము.
ఎండుటాకులా దూరం గా ఎగిరిపోను - వీరము.

రాధిక గారు అద్భుతమైన కవిత రాసారు...అభినందనలు.

ఇందులో తప్పులెన్నటానికి ఏమీ లేకపోయినా...మిగిలిన భీభత్స,హాస్య రసాలను ఇందులో ఇమడ్చడానికి నేను చేసిన ప్రయత్నం...

"జడివాన చేసిన చిత్తడిలో కాలుజారి - భీభత్సము.
నాలుక్కరచుకొన్న తమలపాకును!" - హాస్యము.

గురువుగారి వ్యాసంలో నా వ్యాఖ్య చూడండి.

Nagaraju Pappu said...

చక్కగా ఉంది. మీరు ఏండుటాకు ఎన్నటికీ కారు, కారాదు, కాకూడదు - కానివ్వం.

ఒక్క ఆకు రాలినా అవనికెంత బాధ? రాలిన ప్రతి ఆకు అవని గుండెకోత. ప్రతి చిగురుటాకు భావాల వలపులో పువై మురియాలని, పూచిన ప్రతి పువ్వు రసారాధనలో తనసి పండై తన కన్నతల్లి గుండె నిండించాలనే నా ఆకాంక్ష.
-- మీ నాగరాజు.

Anonymous said...

చాలా బావుందండి !!

Anonymous said...

radhika garu, mee bhavukatha ku naa hatsoff, nijanga eroje ismail gari blog lo mee link choosi mee blog vachanu, madhyahnam office lo pani cheyyakunda mee kavithalu chaduvuthoo vunnanu, samayam alaaa gadichi poyindi,

asalu inni kavithalanu ela rayagalugu tunnaru, prati okka kavitha lonoo bhavam vundi, andam vundi, pranam vundi,

edi emaina...

meeku hats off..........

రానారె said...

ఈ రచనకు నేపథ్యం నాకు తెలుసుగనక మరింత అర్థవంతంగా కనిపిస్తోంది. లేకుంటే 'దీని భావం ఏమయ్యుంటుందీ' అని సమయం కేటాయించి ఆలోచించేవాణ్ణికాదు. ఐతే ఒకటి మాత్రం నిజం - నేపథ్యం (ఒక సంఘటన, సంఘర్షణ, మథనం, బాధ, సంతోషం లాంటివి) ఏమీ లేకుండా రాసే కవిత్వం మెప్పించలేదు అని నేనంటే ఒప్పుకుంటారా? కాకపోతే, ఎంత అనుభూతి కవితైనా, ఏదో తొందరలో మరేదో అత్యవసరమైన పని మనసులో పెట్టుకొని ఒక జోక్‌ను చదివినట్లు చదివితే అందులోని అందం అందదని కూడా నా అనుభవం.

Rama Deepthi Muddu said...

chala bavundi..
intha sunnitam ga rayagalagadam nijam ga gr8... mee kavita, daniki vachina comments rendu bavunnayi..

Anonymous said...

రాధిక గారు,

మీ ఈ భవాలు నా జీవితంకి ఎంతొ దగ్గరిగ వుంటున్నాయి.
నిజంగా మీ రచనత్మక శక్తి కి నెను అచర్య పొతున్నను.

కొన్ని కాపి చెసి నా భావాలు కలిపి నా బ్లాగు లొ చెరుస్తున్నను, కొపపడరని ఒ చిరు ఆస.

All the best. As of now I am keeping myself anonymous. Time vachinappudu, nee jeevitham lo velugu raagane meeku naa details istanu.

Thanks a ton
Pandu Vennela

కవి కన్నయ్య said...

రాధికగారు,
చాలా బాగుంది మీ కవిత..

Anonymous said...

రానారె గారు -
భావం లేక పోవడం ప్యూర్ పొయట్రీ లక్షణాల్లో ముఖ్యమైనది. నేపధ్యము లేని కవిత్వం ఎందుకు మెప్పించలేదని మీరనుకుంటున్నారు?
ఈ రోజుల్లో కవిత్వం పేరన చలామణి అవుతున్న వాటిలో కవిత్వం ఎంత ఉంటున్నది మీకు తెలియని కాదు కదా (ఇక్కడ మరో మాట - కవిత్వానికి చాలా చాలా, వేరు వేరు నిర్వచనాలు వున్నప్పుడు, ఒకరికి కవిత్వంగా కనిపించినది, మరొకరికి మాటల మూటలా అనిపించవచ్చు)! విరివిగా వస్తోన్న కవితా సంకలనాలు(మరియు సంపుటాలు) ఎందరిని మెప్పిస్తున్నాయో కూడా మీకు తెలిసే ఉంటుంది! నేపధ్యం, సంఘర్షణ, మధనం లాంటివి ప్రధానంగా కథా లక్షణాలని నా అభిప్రాయం.

ఈ బ్లాగులోని రాధిక గారి కవిత్వానికి - ఈ నా కామెంట్ కు ఎలాంటి సంబంధం లేదని అందరికీ మనవి.

- సిరి

shanthi said...

Radhika garu me kavitha chalabagundi

రాధిక said...

thanks