నేను
ఎన్నెన్నో మెలకువ రాత్రుల్లో
మధించబడిన హ్రుదయం...
అమృతం జనించింది ఆశయ రూపంలో
ఖర్చు చేసిన క్షణాల విలువ
ఒక ఉదయం మనిషి గా మరో జననం
ఎదురుగా లక్ష్యం - సైనికుడిలా నేను
చేరడానికి దారిలేదు - దీక్ష తప్ప
పర్వాలేదు - చదునుచేస్తాను
వెనుకవచ్చువాళ్ళకోసం బాటలేస్తాను..
ఎదురుగా లక్ష్యం - కార్మికుడిలా నేను
24 comments:
raadhika gaaru chaala baaga raasarandi.....
i am exactly in the same situation now..
chala baga rasaru...
thanks tapaswi.thanks josh.
Meeku Evaru saati leru.....madam
radhika said on Salabhanjikalu ...
ఏకాంతంలో మనసు
సంఘర్షణ
మీలా కవితలల్లమని
***
మీరు నాగరాజు గారి format అనుసరించాలంటే ఇదీ వరుస
A B
C
D
A = subject = తాటిచెట్లు
B = painful process = ఏకాంత తపస్సు
C = final form = కుటీరమై
D = end result = మనిషికి నీడ నివ్వటం
మీ లైన్లని ఇలా సవరించా :-)
మనసు ఏకాంత సంఘర్షణ
పంచదార పలుకులై
మీలా కవితలల్లాలని.
ఇప్పుడో చిన్న హోం వర్కు. మధ్య లైనులో ఒక శ్లేష (pun) ఉంది. చెప్పుకోండి చూద్దాం!
సాలభంజిక గురించి వ్యాఖ్య రాసే అడావుడిలో ఈ కవిత సరిగ్గా చదవలేదు. ఇప్పుడు చదివాను. చాలా బావుంది.
చాలా విసదీకరించి చెప్పారు.సవరించాకా చక్కగా వుందండి.ఏదో రాయాలని తపన తప్ప పాండిత్యం లేనిదానిని. మీరిచ్చిన హూం వర్క్ లో నాకు ప్రశ్న కే అర్దం తెలీదు ఇంకేమి చెపుతానండి.హూంవర్క్ చేయలేదని కొట్టయినా సరే నాకు కాస్త జ్ఞానాన్ని కలిగించండి.ఇన్నాళ్ళూ మీలాంటి వాళ్ళు[మీరు] నా బ్లాగును దర్సించలేదని కొద్దిగా బాధ వుండేది.నాగ రాజు గారి పుణ్యమా అని మీ రాకతో నా బ్లాగు తరించింది.
అయ్యో అంత సీనేం లేదమ్మా!
ఓకే. ఈ సారికి నేనే చెప్పేస్తాను.
శ్లేష అంటే ఒక పదానికి ఉండే రెండు కానీ అంతకంటే ఎక్కువ అర్థాలు ఉపయోగించి చమత్కరించటం. దీన్నే ఇంగ్లీషులో pun అంటారు.
పలుకు అంటే ముక్క - వక్క పలుకు లాగా.
పలుకు అంటే మాట - అంబ పలుకు జగదంబ పలుకు లాగా.
పంచదార పలుకులు అంటే చక్కెర రేణువులు అని ఒకర్థం, తియ్యటి మాటలు అని ఇంకో అర్థం.
ఇంకో బోనస్:
భోషాణప్పెట్టెల్లో
ఘోషాస్త్రీలను బిగించి తాళం వేస్తూ
"భేషు బలే బీగా"లని
శ్లేషించెను సాయిబొకడు సిరిసిరి మువ్వా. - శ్రీశ్రీ :-)
ఓ ..అర్దం అయిందండి.అక్కడ మీరు ఉపయోగించిన పదాన్ని నేను రెండు అర్ధాలలోను అనుకున్నాను చదివినప్పుడే.[అమ్రుతం కురిసిన రాత్రి ,మహాప్రస్తానం చదవడం మొదలు పెట్టిన దగ్గరనుండి ఇలా ప్రతీ వాక్యాన్నికి అనే భావాలు వెతకడం అలవాటయింది.వీటిని చిన్నతనం లో చదివి అర్దం కాక గొప్పోల్ల కవితలు ఇలా వుంటాయన్న మాట అని మళ్ళా ముట్టుకోలేదు.తరువాత తరువాత మెల్లగా వాటిల్లోని లోతు తెలిసింది.అలా ఏదో మంచి పుస్తకాలు చదివి నేర్చింది తప్ప ఇంకేమి తెలీదు నాకు]ఆ విధం గా పంచదార పలుకుల్లో ని భావం గ్రహించగలిగాను గానీ దానినే శ్లేష అంటారని మాత్రం తెలీదు. టైం కేటాయించి వివరించి నందుకు థాంక్స్ అండి.
ఇప్పుడే మీ కవితలు కొన్ని చదివాను. మీలో స్పార్క్ ఉంది. ఐతే అనుభూతులు, జ్ఞాపకాలు, ప్రేమ, విరహం ఇలాంటి పడికట్టు పదాలనుండీ వస్తువులనుండీ బయటపడాలి. అనవసరమైన విశేషణాలు అవీ లేకుండా సాధ్యమైనంత సరళంగా రాయడానికి ప్రయత్నించండి. All the Best
-- సుబ్రహ్మణ్యం
వామ్మో, వామ్మో! ఇప్పుడే మీ మొట్టమొదటి కవితల పేజీ చదివా! ఓవర్డోసై పోయింది. ఓర్నాయనో, ఇంత మంచి కవిత్వం రాస్తూ, అమాయకంగా మొహం పెట్టి ఏమీ తెలీనిదాన్ని అని మీరనగానే .. నేనేదో పిస్తాలా ఫీలైపోయి - ఆహా, శ్లేష అంటే ఇదీ - గాడిద గుడ్డూ అని లెక్చర్లిచ్చానే!
చాలా బాగా రాశారమ్మా. నాకు బాగా నచ్చినవి - గులాబి, జీవితం, గుండె లోతుల్లో, మది కోరిన మరణం, భాష రాని బాధ (నా ఎదపై చేయి వేయవా, మది లయలో బాధ వినిపిస్తుంది - ఫెంటాస్టిక్!!!) కాలం చేసిన మోసం (ఇది ఈ పేజీకి తలమానికం).
ఏం చెప్పను, మాటలు రాక మ్రాన్పడి పోయానంటే నమ్మండి :-)
రాధిక గారూ!
మీ రాసే కవితలన్నీ చాలా బాగుంటున్నాయి. ఎంతోమంది గుండెల్లో భావాలను చదివి రాసినట్టుగా అనిపిస్తున్నాయి.
మీరు అనుమతిస్తే మీ "స్నేహమా" బ్లాగ్ లింక్ నా బ్లాగ్ లో Add చేసుకోవాలని ఆశ పడుతున్నాను.
కొత్త పాళీ గారు అంతా మీ అభిమానం.80 కవితల్లో ఏదో 2,3 బాగుంటే నేను మంచి కవయిత్రిని అయిపోను కదండి.కానీ బాగా రాయడానికి ట్రై చేస్తాను.అప్పుడప్పుడు నా బ్లాగులోకి తొంగి చూసి మీ విలువయిన అభిప్రాయాలు,విమర్సలు అందించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను.
హ్రుదయ బృందావని గారు నా కవితలు నచ్చాయన్నందుకు,మీ సైటులో లింక్ ఇస్తానన్నందుకు థాంక్స్.
ధన్యవాదాలు....నా blog పై మీ అభిప్రాయాలకు, ఇన అంటే "సూర్యుడు", "ఇన గణ త్రయంబు ఇంద్ర ద్వయంబును..హంస(అన్నా సూర్యుడే..వ్యాకరణార్థం లో) పంచకంబు ఆటవెలది" అని ఆటవెలదిని సూత్రీకరిస్తారు కదా !, ఇక్కడ నా కవిత లో "రాత్రికి కాంతులు తెచ్చేది చంద్రుడే అయినా , అంత కన్నా వెలుగు అంటే సూర్యుడి వెలుగు కల దానా" అని అర్థం , ఇంకా చంద్రుడికి పరోక్షంగా ఆ కాంతిని ఇచ్చేది సూర్యుడే కదా (reflection)
మీ కవితలు చాలా బాగున్నాయి....ఇప్పుడిప్పుడే చదువుతున్నాను
అద్భుతంగా ఉంది.
sainikudilaa nenu....kaarmikudila nenu...adbhutam gaa kudiraayi. naaku kudaa meelaa kavitalu vraayalani undi:) haayigaa undi chaduvutunnanta sepu
నాకు కవిత,కవిత్వం,రచనలు అనగానే గుర్తొచ్చేది "నన్ను కవిని కాదన్నవాడిని కత్తితో పొడుస్తా..నన్ను రచయత్రిని కాదన్నవాడిని రాయెత్తి కొడతా" అని సినీ నటి శ్రీ లక్ష్మి ఏదో సినిమా లో చెప్పే డైలాగే..కానీ నా అభిప్రాయాల్ని మార్చుకోటనికి మీ బ్లాగు బాగా ఉపయోగపడింది..ఏమీ రాదు ఏమీ రాదు అంటూ మీ రాతలు (అదే రచనలు..), వాటికి పెద్దల విశ్లేషనలు ..అధుర్స్స్ ..మీ బ్లాగులోని "నేను", "వీడ్కోలు" నాకు బాగా నచ్చాయి..hatsoff కవయత్రి శ్రీ లక్ష్మి గారూ ..(ఓహ్ సారీ) రాధిక గారూ..! keep going..all the best..
నా బ్లాగుకు వచ్చి కామెంట్ల రూపం లో ప్రోత్సాహాన్ని అందిస్తున్న అందరికి థాంక్స్.పవన్ గారూ మీరు చెప్పిన సీన్ చంటబ్బాయ్ సినిమాలోదనుకుంటా.అది నాకు చాలా ఇష్టం.మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికీ అలానే ఏడిపిస్తారు.ఎప్పుడయినా ఆ సీన్ చూసినప్పుడు అందరికీ నా బ్లాగు గుర్తొస్తే నేను అనుకున్నది నెరెవేరినట్టే.ఆ మాత్రం గుర్తింపు చాలు.
ఇట్లు శ్రీలక్ష్మి [అదేలెండి.. రాధిక]
హ హ హ...కుమ్మెయండి
hi radhika chaala baaga raasavu.
your poem is good and simply captivated me and specislly the explanation given for pun is enlightening
usha
chala baga unndi.
Radhika garu,
Your poetry is excellent.I think spelling of hrudayam in telugu is incorrect.But that is not big matter.
-Amarender Reddy.
Post a Comment