Wednesday, December 03, 2008

ఆలోచనలు



ఏ ఏకాంతక్షణంలోనో
నన్నడగకుండా వచ్చేసి
పారిజాతాల తోటలోని నేస్తాలదగ్గరకి తీసుకుపోతాయి

ఒక్కోసారి సమూహం నుండి వేరుచేస్తూ
నన్నునాకు దగ్గర చేస్తాయి

చిరునవ్వులు పూయిస్తాయి
చెమరింతలు తెప్పిస్తాయి
కారణాలు వెతికిస్తాయి
కాలక్షేపం చేయిస్తాయి
మరుక్షణంలోనే నేనేమీకానట్టు
వదిలేసి వెళ్ళిపోతాయి

46 comments:

durgeswara said...

lalitaa paaraayana yaagam praarambhamavutunnadi. bloglo vivaraalu choodamdi
durgeswara.blogspot.com

వేణూశ్రీకాంత్ said...

ఈ రోజు సాయంత్రమే ఇంటికి వస్తూ మీ కవిత చదివి చాలా రోజులు అయిందే అని ఒక సారి మీ బ్లాగ్ కి వచ్చి పాత కవితలు కొన్ని చదువుకుని వెళ్ళా. మళ్ళీ ఇప్పుడు కూడలి లో చూస్తే మీ కవిత ప్రత్యక్షం :-) బాగుంది.

ఒక్కోసారి సమూహం నుండి వేరుచేస్తూ నన్నునాకు దగ్గర చేస్తాయి
మరుక్షణంలోనే నేనేమీకానట్టు వదిలేసి వెళ్ళిపోతాయి ....

పై రెండులైన్లు చాలా బాగున్నాయండి... ఆలోచనల గురించిన అక్షర సత్యాలు అవి...

Bolloju Baba said...

wow

చైతన్య.ఎస్ said...

బాగుంది.

Anonymous said...

బాగుంది...రాదిక

Anonymous said...

ఎప్పటిలానే బావున్నాయండి

Kathi Mahesh Kumar said...

Simply good...NO great.

Aditya said...

expression of thoughts.very good.

Anonymous said...

ఆలోచించాల్సిందే...!

Kranthi M said...

సింపుల్‌గా చాలా బాగుంది రాధిక గారు.
చిన్నగా చాలా బాగా చెప్పేస్తారు. నాకెందుకో అంత చిన్నగా చెబ్దామంటే కుదరటం లేదండి

Anonymous said...

అవును రాధికా, ఆలోచనలు అలాగే. ఒకొకప్పుడు, రాను రాను అంటూ చాలా పేచీ పెడతాయి కూడాను :)

pavan said...

gr8 poetry and i am still confused where do u get this little words which has lot of meaning thts why i became a fan of u

ఏకాంతపు దిలీప్ said...

ఒకో క్షణం,
నన్ను ప్రశ్నిస్తాయి
నా అసహాయతని నిలదీస్తాయి
ఈ విశాల ప్రపంచంలో,
నా అస్థిత్వాన్ని శోధించమంటాయి
నేనేంటో తెలియని నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి

చంచలత్వంతో మోసం చేస్తాయి
నా నమ్మకాన్ని వెక్కిరిస్తాయి
పంచుకున్న పదిమందిలో
నన్ను అల్పుడుని చేస్తాయి

అనుక్షణం వెంటాడుతూ
నాతో పోరాడతాయి
నే పోరాడలేనని ఎదిరిస్తే
నాకు దూరమై శిక్షిస్తాయి...


మీ అభిమాని :-)
@ http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=50976840

ఆత్రేయ కొండూరు said...

బాగుంది రాధిక. నిజమ్ చెప్పనా ? మిగిలిన కవితల్లో ఉన్నంత బరువు ఈ కవితలో లేదు. కవితల్లో తప్పులెన్నేటంత ప్రతిభ నాకు లేకపోయినా, నీ మీద అభిమానము, ఇంకా బాగా రాయాలన్న ఆకాంక్ష తో ఇలా చెపుతున్నాను ఏమీ అనుకోకు.

ఏకాంతంలో నిన్ను చేరిన ఆలోచనలు
ఏ సమూహము నుండి వేరుచేస్తున్నాయి ?
ఇక్కడ ఏకాంతం సబబు కాదేమో !

" వదిలి వెళ్ళిపోతాయి " అన్నప్పుడు "ఏకాంతంలోకి తోస్తాయి " అని పూరిస్తే బాగుంటుందేమో

నేను చెప్పిన దాంట్లో తప్పులుంటే, నీ కవిత అర్ధం చేసుకునే స్థోమత నాకు లేదను కుంటాను. క్షమించు.

రాధిక said...

శ్రీకాంత్ గారూ నిజమే కవిత రాసి చాలా రోజులయిపోయింది.ఆలోచనలయితే పుస్తకం నిండుగా వున్నాయి.వాటికి సరయిన రూపం ఇవ్వడానికి తగినంత సమయం,మంచి మూడ్ ,ఓర్పు ప్రస్తుతానికి నాదగ్గర లేవండి.మీలాంటి వారి వల్లే అనుకుంటాను కొత్త కవితలు రాయకపోయినా విజిట్లు బానే వుంటున్నాయి.థాంక్స్ అండి.
బాబాగారూ వావ్ అనేంతగా లేదని నాకుతెలుస్తుందండి. నన్ను నిరుత్సాహపరచకూడదన్న మీ మంచితనానికి నెనర్లు.
చైతన్య,జయ,అశ్విన్,ఆదిత్య గారు అందరికీ నెనర్లు.
మహేష్ గారూ మీలా చెప్పేవాళ్ళంటే నాకు అభిమానం.నా మంచి కోరేవారని నాకనిపిస్తుంది.ఈ కవితలో నేననుకున్న భావానికి బరువులేదు.అందుకే వ్యక్తీకరణ కూడా మీరన్నట్టు సింపుల్ గా వుంది.
బాబు గారు :) థాంక్స్.
మాలతి గారూ అవును మీ మాటతో 1000% అంగీకరిస్తాను.ఒక్కోసారి ఎంత బ్రతిమాలినా,ఎంత ఏకాంతం కల్పించినా అస్సలు రావు.ఎంత కోపం వచ్చేస్తుందో అప్పుడు.
క్రాంతి కుమార్ గారు పెద్ద పెద్ద పదాలు రాయడానికి సరిపడా భాష లేక ఇలా చిన్నగా సరిపెట్టేస్తాను.మీకేమిటండి బోలెడు భాష వుంది మీ దగ్గర.
పవన్ మీ అభిమానానికి థాంక్స్.
దిలీప్ "పంచుకున్న పదిమందిలో
నన్ను అల్పుడుని చేస్తాయి"అన్నారు.అలాగే అదే పదిమందిలో మిమ్మల్ని ప్రత్యేకంగా కూడా నిలబెడతాయి.మీరు చెప్పిందంతా చెప్పలేకే "కారణాలు వెతికిస్తాయి" అని వదిలేసాను.చాలా బాగుంది.మీ బ్లాగులో కూడా పెటండి.

రాధిక said...

ఆత్రేయగారూ అభిమానంతో చేసే విమర్శలకు నేను సదా సిద్ధమే.మీలా సరిదిద్దేవారుంటే వద్దని ఎవరు అంటారు?మీకు ప్రతిభలేదని అంటే ఇక్కడ ఒప్పేసుకోడానికి సిద్ధం గా లేమండి. మీరేమి చెప్పాలనుకున్నా సంకోచించకుండా చెప్పండి.నేనేమీ అనుకోనని మీకు బ్లాగుముఖం గా మాటిస్తున్నాను :) ఇక మీ ప్రశ్నలకి వస్తే నేను ఏకాంతం అని చెప్పిన మాటలకి,సమూహం అని చెప్పిన మాటలకి సంబంధం లేదు.భిన్న సమయాల్లో ఆలోచనలు ఎలా వుంటాయనే విషయాన్ని అక్కడ చెప్పదలిచాను. ఒకసారి మళ్ళా చూడండి.ఏకాంతంలో వున్నప్పుడు సమూహంలోకి,సమూహంలో వున్నప్పుడు ఏకాంతంలోకి తీసుకుపోతాయని చెప్ప ప్రయత్నించాను. అలాగే ఏకాంతంలోకి తోస్తాయి అని పూరిస్తే బాగుంటుందన్నారు.కానీ ఆలోచనలు వదిలేసినంత మాత్రాన ఏకాంతం లభించదుకదండి. నా సమాధానాలు తృప్తికరం గా లేకపోతే[అర్ధం కాకపోతే] చెప్పండి మళ్ళా ప్రయత్నిస్తాను.

Rama Deepthi Muddu said...

nice work.. the comments made me read the poem 3 more times... nice observation here...and nice explanation too..
"chemarintalu teppistayi....karanalu vetikistayi" liked these lines.
keep posting.

ఆత్రేయ కొండూరు said...

సమాధానం /సమర్ధింపు బాగుంది.
"వావ్ అనేంతగా లేదని నాకుతెలుస్తుందండి." దీనికీ ఏకీభవిస్తునాను. కనీసం నీతో అబద్దం చెప్పదలుచుకోలేదు. నా expectation మీటరు కిందకి దిగనంటుంది.

pruthviraj said...

హృదయానికి ఆనందం చేరువై అంతలోనే ఆవిరైనట్టు భావస్పష్టత కనిపించింది. ఇంకా పూర్తికాకుంటే నూరుమార్కులు మీకేనేమో..బావుంది రాదిక గారు.

యోగి said...

కవితా మీరు ఎంచుకున్న చిత్రం చాల బాగున్నాయి!

A small suggestion, your beautiful blog would look more beautiful with a nice template :)

kRsNa said...

సింపుల్గా ఉంది. బావుంది.

Unknown said...

i am a new one to vistit. i heard so much of this blog, but i am dispointed with ur work . becoz its good but not great bcoz meru eppati k andari lo o hip create chesaru so meru danini continou cheyalani korukuntu.....
o abimeni..

ఆనంద ధార said...

చాలా...చాలా బాగా రాసారు...

Anonymous said...

బావుంది రాధిక :)

నేస్తం said...

రాధిక గారు నిన్ననే మీ బ్లాగ్ చూసా.. అబ్బో చక్కని కవితలు అందుకు తగ్గ చిత్రాలతొ బలే ఉంది కదా రేపు తీరికగా మొత్తం బ్లాగ్ అంతా ఒకసారి చూడాలనుకునేంతలో ఉదయమే మీ వాక్య నన్ను చాలా సంతోష పెట్టింది.ఇంకా ఇలాగే మంచి కవితలతో మమ్మల్నీ అలరింప జేయాలని కోరుతూ మీ నేస్తం

నిషిగంధ said...

వేణు గారిలానే నేనూను.. చాలా రోజులైందే అనుకుంటూ వచ్చాను :-)

నీ కవితలు చదవగానే 'బావుందే!!' అన్న ఆలోచన తప్ప ఇంకోటి రాదు! ఇప్పుడు కూడా అంతే :-)

మరువం ఉష said...

నిజమే రావకున్నపుడో, రాగలవేమిటనుకున్నపుడో మరీ వచ్చేస్తాయి; వెళ్ళననిమోరాయించేస్తాయి కూడ, వున్న ఒక్క గుండె చాలా చిన్నది, అది వడిసిపట్టుకునే తలపులు మటుకు వెవేలు. ఎందుకో మీ మనసు అద్దంలో నా మనసుకి ప్రతిబింబంలావుంది.

http://maruvam.blogspot.com/

భావకుడన్ said...

చాలా బావుంది........చిన్న పదాలతో చక్కని భావ ప్రకటన.


ఎవరివయినా... చేసే రచనలు అన్నీ ఒక స్థాయిలో ఉండవు....వాటి స్ఫూర్తి, మన స్ఫందన, స్ఫందనకు రచనకు ఉన్న సమయ వ్యత్యాసం, ఉప్పొంగిన భావావేశం, భావావేశానికి తగిన భాష అమరటం .....ఇలా ఎన్నో variables ఉంటాయి రచనలు ప్రచురితమయ్యే సమయానికి........కాబట్టి ప్రతీ కవితది దేనికదే ప్రత్యెక స్థానం.....మిగితా వాటితో పోల్చి చూడటం భావ్యం కాదేమో.......

రాఘవ said...

తేల్చడం అంత తేలికగాని ఆలోచనలగురించి తేలికైన పదాలతో చాల తేలికగా వ్రాసారు. బావుంది.

sudhaker said...

mee blogu chala bagundandi. telugu lo el rayagalugutunnaru vivaralu telupagalaru.....from:sudhakergoudgunda@gmail.com

sudhaker said...

nenu kuda kudali lo na blagunu unchali anukuntunna..emi cheyali

పావనీలత (Pavani Latha) said...

దాదాపు నాలుగైదు నెలల తర్వాత మళ్ళి ఇప్పుడే బ్లాగుల వెంట పడ్డాను,
ఎప్పటిలానే అన్నీబాగున్నాయి రాధిక గారూ,
గాయపడిన ఙ్ఞాపకాలు కవిత ఎంతో ఆర్ద్రంగా అనిపించింది...

ramperugu said...

sunnithamina bhavaala
parampara
mee kavithvam..
kavithvam ninda
undi lalithyam...
motham meeda
mee blog Adbhutham...
perugu

thapasvi said...

mee thoughts ,,swathi kumari gaari thoughts excellent andi... i like very much andi..

మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్. said...

chaala bagundi

విహారి(KBL) said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు రాధిక గారు.

చైతన్య.ఎస్ said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు

Rama Deepthi Muddu said...

Blog template update cheyyadam lo unnara? Leka alochistunnara? no new updates?
Image size kuncham peddadayyindi anukunta tulips di.

పరిమళం said...

రాధిక గారూ!మీ కవిత చాలా బాగుందండి.

Srikar said...

ఇది చదువుతున్నప్పుడు నా స్వనుభావాన్ని నేనే అక్షర రూపం లో చూస్తున్నాటు ఉంది, అందరికి అలానే అనిపిస్తుంది బహుసా...!

మీ సరళ మైన కవితల కోసం ఎదురుచూస్తూ, మల్లి మల్లి పాతవి చదువుతున్ననండి !

Aparanji Fine Arts said...

కత్తి మహేష్ కుమార్ గారితో ఏకీభవిస్త్తున్నా. మీరు అంతో ఇంతో రాసే సమయము స్థాయిలను మించిపోయారు ఇంకా ఎంతో రాయాలి.

సవ్వడి said...

రాధిక గారు మీ బ్లాగుని నిన్నే చూసాను. కవితలు చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చింది మాత్రం ఇదే! ఎందుకంటారా ఆలోచనలను కూడా వర్ణించవచ్చని ఇంత చక్కని కవిత రాయొచ్చని నాకు ఇంతవరకూ తెలీదు. ఆలోచనలను ఎప్పుడూ నెగిటివ్ గా తీసుకునే నేను.. ఇంత అందంగా చెప్పేసరికీ స్పందించకుండా ఉండలేకపోతున్నాను. దిలీప్ గారు కూడా బాగా చెప్పారు. కాని ఆయన అవి మనకు మిగిల్చే బాధను వివరించారు. మీరు మాత్రం అవి అందించే ఆనందాన్ని వివరించారు. చాలా నచ్చేసింది అనుకోండి. సూపర్... మీ స్పందన కోసం చూస్తూ...

ramperugu said...

కవయిత్రి రాధిక గారు..
మీ భావాలు బాగున్నాయి..కవిత్వీకరణలో మరింత మెరుగు పరచండి..
మొల్ల భావాల్లో ల మంచి లాలిత్యం వుంది మీ లో కూడా..
మంచి కవిత్వం అధ్యనం చేస్తే గొప్పగా రాయగలరు..

పెరుగు.రామకృష్ణ ,నెల్లూరు

Admn said...

ME KAVITHALU BAVUNNAI

Admn said...

ME KAVITHALU BAVUNNAI

SAITEJABANGARAM said...

https://storyofabrokenheartbysaitejatangudu.blogspot.com/2020/06/a-moment-of-relief-8-story-on-every.html
Plz suggest me some improvements sir