నువ్వు వెళ్ళాకా..
బ్రతుకంతా ఓ విషాదాంత కవిత !
నినుగూర్చిన కలలన్ని కరిగిపోయాయి
కన్నీరై చెంపలపై జారిపోయాయి !
......................................................కన్నీరై చెంపలపై జారిపోయాయి !
తోడులేదని గాలితో కబురంపగా...
నడిరేయిలో వినువీధి లో
జాబిలై నను పలుకరించింది
వెన్నెలై తలను నిమిరింది !
.......................................................
ఎవరూ ఎవరికి ఏమీకాము
అయినా
అందరు అందరికి అయినవాళ్ళయ్యాము !
1 comment:
తోడులేదని గాలితో కబుర0పగా
నడిరేయిలో వినువీధి లో
జాబిలై నను పలుకరి0చి0ది
వెన్నెలై తలను నిమిరి0ది
ఈ భావం ఎంతో అందంగా ఉంది
Post a Comment