నీకై తపిస్తున్న ఈ మనసు ఘొష వినలేవా?
నా కన్నుల మూగ భాష కనలేవా?
.....................................................
నీకన్నుల వెలుగు చాలు నా శ్వాశకి
నీ నవ్వుల మెరుపు చాలు ఈ జన్మకి
.....................................................
నీ దరి చేరలేకపోతున్న నా హృదయం
ఆవేదన మయం
......................................................
కెరటంలా తాకావు హృదయాన్ని
కలల వాకిళ్ళు గా మార్చావు కన్నుల్ని
......................................................
మనసు పొరలలో దాగిన
అనుభూతుల దొంతరలను విడదీస్తూవుంటే
అన్నీ నీ తాలూకూ జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి
అవి పెదవులపై విరబూస్తున్నాయి
......................................................
చెమ్మగిల్లాయి కన్నులు
ఎన్నటికో కలుసుకున్న అనందంతో
తడినిండాయి అవే కన్నులు మరునిమిషంలో
విడిపోతున్న విషాదంతో
......................................................
నిను చూడగానే ఉప్పొంగిన ఆనందపు అల
ఎగసిందలా..ఆ నింగిని తాకిందనిపించేలా
......................................................
అలుపెరుగని కెరటం నా హృదయం
దిగంతాలదాకా నా పయనం
......................................................
ప్రియా ...చెప్పాలని వుంది నీ రూపు కవితగా
పాడాలని వుంది నీ నవ్వు పాటగా
.....................................................
పలుకురాని నా హృదయంలో వెలికి రాని భావాలెన్నో....
.....................................................
ఊహలకు దారినిచ్ఛేది ఒంటరితనమే
....................................................
1 comment:
చాల బాగుంది.
"ఊహలకు దారినిచ్ఛేది ఒ0టరి తనమే"
ఒంటరి తనమంటారా? లెక ఏకాంతమంటారా?
"ఊహలకు ఊపిరిపోసేది ఏకాంత శోధనే" అంటే ఇంకా బాగుంటుందేమో? ఆలోచించండి.
మరోలా అనుకోకండేం?
Post a Comment