
ఏ ప్రియుడి చేతిలో చేరి
ఏ చెలియ అలుక తీర్చాలా అని..
ఏ కన్నె సిగలో చేరి
ఎన్ని వగలు చూపాలా అని..
ఎన్ని హృదయాల మూగ భావాలు
ప్రేమగా మలచి వివరించాలా అని..
ఆలోచిస్తూ అందంగా ముస్తాబై
మంచు ముత్యాల చెక్కిలిగిలికి
చిలిపిగా సిగ్గుపడుతూ
చేరుకోబోయే చేతుల కోసం నిరీక్షిస్తూ...ఓ ఎర్ర గులాబి
3 comments:
చాలా బాగుంది.
thanks abhisaarika.
చాలా చాలా బాగుంది.. భలే అందంగా ఉన్నది.
Post a Comment