Thursday, October 19, 2006

ఇంకా ఎంత కాలమిలా..?


గోల పెడుతున్న మాటల గువ్వలను
ఎగరనీయకుండా భావాల రూపం లో
గుండె లోనే బంధించేస్తూ
ఇంకా ఎంత కాలమిలా..?

మనసుకి స్నేహం మత్తు నిచ్చి
నిద్రపుచ్చుతూ
మాటలకు మౌనం భాషనేర్పి
నవ్వుకుంటూ
ఇంకా ఎంతకాలమిలా..?

ఆగని కాలంకేసి భారంగా చూస్తూ
భారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూ
చూస్తూ..చూస్తూ..అతడిని దూరం చేసుకుంటూ
ఇంకా ఎంత కాలమిలా..?

15 comments:

Naveen Garla said...

చాలా చాలా బావుంది కవిత. తెలికైనా వాక్యాలతో బరువైన అర్థాని చెప్పారు. డబ్బు పెట్టి తీసుకొనేది వస్తువు. మనసు పెట్టి నేర్చుకొనేది విధ్య. ఇష్టంతో నేర్చుకొనేది కళ. ఇవేవి లేకుండా గుండెలోని భావాలకు అక్షర రూపమిచ్చేదే కవిత. అది రాయటం అందరికీ రాదు. రాసినా కొద్ది మంది మాత్రమే మీరు రాసినంత అందంగా కవితలు వ్రాయగలరు. శభాష్, ఇలాగే వ్రాస్తూండండి.

నవీన్
http://gsnaveen.wordpress.com

రాధిక said...

naaku amta ledandi.kaani mee abhimaanaaniki dhanyavaadaalu.

spandana said...

రాధిక గారూ,
ఇది కూడా మీ కవితల్లో మరో ఆణిముత్యం. సరళమైన పదాలు, మృదువైన భావాలు. చదివే ప్రతి ఒక్కరూ తమకోసమేనా ఇది అనుకునే భావం.
మీ బ్లాగు పేరే "స్నేహం" కాబట్టి ఈ కవితలు అన్నీ పేరు నిలబెట్టేవే! కాకపోతే మీ మనసును కదిలించే వార్తలు, మనసును ద్రవింప జేసే దృశ్యాలు మీలో కవితను పుట్టిస్తే వాటిని కూడా ప్రచురించడానికి ప్రయత్నించండి.
--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

మరో చక్కటి కవిత!
కానీ ఒక చిన్న అనుమానం: స్నేహమే మత్తంటారా? లేక స్నేహం పేరు చెప్పి మనసును మభ్యపెట్టడాన్నే మీరు స్నేహం మత్తు అంటున్నారా?

రాధిక said...

స్నేహం పేరు చెప్పి మనసును మభ్యపెట్టడాన్నే స్నేహం మత్తు అంటున్న
miilaantivaallu naa blaaguki raavadam chaalaa adrustamandi.thanks

Anonymous said...

vare vaaa exellent. is it happened in your real life

Anonymous said...

చాలా బాగుంది

Nagaraju Pappu said...

డీన్ని కూడా చాలా మార్చొచ్చు. మీ కవితల్లో పదాలని తగ్గిస్తే, భావానికి బరువు పెరిగి, కవితకి లోతు వస్తుంది:

గుండె పంజరంలో బందీలైన బావాలు
రెక్క విప్పి పాటల గువ్వలై ఎగరలేక..

మాటల మౌనవ్రతం పాటై
కాలం పెదాల పాడలేక

భారమైన గుండె బరువు చూడలేక
పారిపోయిన కాలంలా...

మిగతాది మీరు పూర్తి చేసెయ్యండి..
ఇంతకీ ఎలా ఉంది? మీరనుకొన్న దానికి సరిపోయిందా?

Nagaraju Pappu said...

గుండె గుడిలో అంటే, గుండె పంజరంలో అనే దానికన్న బావుంటుంది, గువ్వలు గుడి గవాక్షాల మీదుంటాయి కదా?

S said...

నేను కవిత్వం ఆట్టే చదవను..కనుక నేను బాగుందనో..బాలేదనో చెప్పలేను... కాకపోతే, భాష సరళంగా...అర్థమయ్యేలా ఉంది... అది నాకు నచ్చిన విషయం. సగం అర్థమయ్యీ సగం కాక .. ఇలా లేదు... :)

Anonymous said...

గుండెలోన ఒకమాటుంది.గొంతుదాటి వచ్చేసింది.

priyathama said...

స్నేహం మీద మీరు రాస్తున్న కవితలు బాగున్నవి. మీ అంత కాకపోయినా నేను కూడ ప్రేమపై కొన్ని కవితలు రాస్తున్నాను. మీరు చదవగలరు.

Anonymous said...

ఇలా ఇంత సున్నితమైన జాలిగొలిపే పదాలతో ఎల రాస్తున్నారండీ?
గోల పెడుతున్న మాటల గువ్వలను ఎగరనీయకుండా కట్టేసి
మనసుకి స్నేహం మత్తు నిచ్చి మాటాడనీయకుండా,
మాటలకు మౌనం భాషనేర్పి,పైకి నవ్వుకుంటూ
చాలా చాలా బాగుంది.

spandana said...

నువ్వు శెట్టీ వాఖ్య వాఖ్యల కూడలిలో చూసి మరో కొత్త కవిత రాసినట్టున్నారే అని ఇక్కడ వాలాను. ఎప్పుడు రాసిందీ చూసుకోకుండా చదివాను. అబ్బా ఎంత బాగుంది అని వాఖ్య రాద్దామని అలవాటులో భాగంగా వాక్యలు చదువుకుంటూ వస్తుంటే అందులో ఎప్పుడో నేను రాసిన వాఖ్య వుంది. అంటే ఇది నేను ఇంతకు ముందే చదివానన్నమాట!
అయితేనేమి మరపు కూడా ఓ వరమని అందుకేగా అన్నది. మళ్ళీ చదువుతున్నా, మళ్ళీ మళ్ళీ చదువుతున్నా భావాల అందాల విందు.

--ప్రసాద్
http://blog.charasala.com

kumar said...


chala bagundi.