Monday, November 06, 2006

అంతరంగం


పౌర్నమి నాటి వెన్నెల కెరటం లా వుంది
ఈ రోజు నా అంతరంగం


నీటి నురుగులా నా ఆలోచనలు
తీరం చేరినట్టే చేరి
పట్టుకొనే లోపే మాయమైపోతున్నాయి

అలల ఆటకు అలుపు లేదు
నా కలల బాటకు గమ్యం లేదు

13 comments:

తెలు'గోడు' unique speck said...

"అలల ఆటకు అలుపు లేదు
నా కల బాటకు గమ్యం లేదు"

చాలా బాగున్నాయి ఈ పాదాలు. "కల" అనే బదులు "కలల" అంటే ఎలావుంటుందంటారు?

రాధిక said...

kalala anukune raasanandi.post cheseppudu kala ani raasinattunnanu.

రానారె said...
This comment has been removed by a blog administrator.
రానారె said...

కవిత అని దేన్ని అంటారో, తెలుగు కవిత లక్షణాలెలా వుండాలని పెద్దలు నిర్ణయించిరో నాకు తెలీదుగానీ, ఈ కవిత నాకు నచ్చింది. ఈ కవిత చదివితే ఆరోజు మీ అంతరంగం ఎలావుందో పూర్తిగా మాత్రం అంతుచిక్కలేదు. పౌర్ణమి నాటి వెన్నెల కెరటం లా - అంటే ప్రశాంతంగా హాయిగా వుంది అనుకొంటే, ఆలోచనలు పట్టుకొనే లోపే మాయమైపోతున్నాయి - ఆనే మాటతో మనసు పూర్తి ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించడంలేదు, గమ్యంలేని కలలబాట - ఆ బాటెలావుందో మరి. చిన్నకవితే. కానీ దీనర్థం ఒకచోట ఇమిడేదిగా కాక పౌర్ణమి నాటి వెన్నెలంత విస్తారంగా వుంది.

రానారె said...

మీ వివరణ ఇక్కడే రాసుంటే మీ బ్లాగ్ చూడబోయే వాళ్లకూ తెలిసేది కదా.

Anonymous said...

మరో మంచి కవిత!

Anonymous said...

Radhika garu
sneham meeda mee kavithalu chala adbhutamga vunnayi.Nenu kuda snehaniki naa jeevithamlo chalane chotichanu.Naaku chala aatmeeyulina nesthalunnaru.

kondaveeti satyavati

Anonymous said...

హాయ్ రాధిక,
మీ కవితలు చాలా బాగుంటై.మీ బ్లాగుకి నా హృదయపూర్వక ధన్యవాదములు.
ఇక్కడ మీరు వెన్నెల కెరటం అని ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. మిగతా భాగం అంతా ఇలా చెప్తున్నట్లు నాకు అనిపిస్తుంది. మీ అంతరంగం లో ఎన్నెన్నో ఆలోచనలు వస్తున్నట్లు, వాటిని విచారించుకొనే లోపే మాయమవుతున్నట్లు వాటికి ఒక గమ్యం ఇవ్వలేనట్లు వుంది. కాబట్టి నా మనసుకి మొదటి లైన్ ని ఇలా రాస్తే బాగుండేదేమో అనిపిస్తుంది
పుర్నమి నాటి సముద్రపు కెరటం లా లేదా సముద్రపు కెరటాల వలే
"నాకు తెలిసి పౌర్ణమి రోజున కెరటాల ఉద్రుత ఎక్కువగా వుంటుంది కాబట్టి మొదటిది వుపయోగించవచ్చు".

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
రాధిక said...

thanks

Bolloju Baba said...

నాకిలా అర్ధమయ్యింది,
ఇది తప్పేమో మరో గొప్ప అర్ధమేమైనా ఉందేమోనన్న అనుమానం కూడా లేకపోలేదు.


మొదటి పాదం: పౌర్ణమి నాటి కెరటం వెన్నెలలా ప్రకాసిస్తూ ఉదృతంగా పడిలేస్తున్నట్లుగా అంతరంగ మంతా కల్లోలంగా ఉంది

రెండవ పాదం: అంతరంగ మధనం లో జనించిన నురగలాగ ఆలోచనలకు ఒక స్థిర రూపం లేక జారిపోతున్నాయి.

మూడవ పాదం: చెప్పక్కరల లేదు.


చలం అంటాడూ
బ్రెవిటీ ఆఫ్ థాట్స్ లేక పోతే ఆత్మ లోకంలో దివాళా అని (అవే పదాలు కాక పోవచ్చు)
ఈ పద్యం చూస్తే సంతోషించేవాడేమో.

ఇంత బ్రెవిటీని ఎలా సాధించగలిగారండీ బాబూ.
హేట్సాఫ్

బొల్లోజు బాబా