Wednesday, November 01, 2006

అక్షర రూపం


మనసులో కలుగుతున్న భావాలెన్నో
ఏ రూపం లేకుండా అలానే గతిస్తున్నాయి
నా అక్షరాలు కొంత కాలం గా అజ్ఞాతం చేస్తున్నాయి మరి

భావానికి రూపాన్నిచ్చే భాష
ఆమె మాయలో పడి లిపిని మరచిపోయింది
ప్రేమ మత్తు అటువంటిది మరి

భావాలకి రూపాన్నిచ్చి గుండె
బరువు దించుకునే క్షణం ఎప్పుడొస్తుందో మరి?

1 comment:

Anonymous said...

చక్కగా చెప్పారు. ఐతే భావాలకు రూపమివ్వలేకపోవడం, అక్షరాలు అజ్ఞాతం చెయ్యడం వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. :) ఏమంటారు?