Wednesday, December 13, 2006

నీ ఉత్తరాలు


చాలా మంది అంటారు
ఒక్కసారి కనులు మూసుకుని
జ్ఞాపకాల తలుపులు తెరుచుకో అని!

కానీ నేను...
నిను తలచినప్పుడల్లా
నువు పంపిన ఉత్తరాలు తెరుస్తాను

కనులు మూస్తే నీ రూపం మాత్రమే కనిపిస్తుంది
అదే ఉత్తరాలు తెరిస్తే నీ మనసుని చూపిస్తాయి మరి!

అక్షరాల్లో దాగిన అనుభూతులని
కళ్ళతో ఏరుకుంటూ..
పాత అనుభవాలను
కొత్తగా పరిచయం చేసుకుంటూ..
మడిచిన ఉత్తరాల్లో దాగిన
ఎన్నో తీయని స్మృతులని
వెచ్చగా అనుభవిస్తూవుంటాను

ప్రసాద్ గారి "ఉత్తరాలు" స్పూర్తి తో

17 comments:

Anonymous said...

బాగుంది. ఇంతకీ ఎవరు అవతల!?

Anonymous said...

Hmm... బాగుంది.

Anonymous said...

"అక్షరాల్లో దాగిన అనుభూతులని
కళ్ళతో ఏరుకుంటూ..
పాత అనుభవాలను
కొత్తగా పరిచయం చేసుకుంటూ.." అద్భుతంగా చెప్పారు

Anonymous said...

mIru EmI anukOnaMTE oka chinna #correction# chivaralO mIru "smutulu" annaaru daanini "smRtulu"gaa maarchagalaru.

I tried not to post this but couldn't stop as it was pointing out in this beautiful post of yours.

రాధిక said...

ramand gaau avatala vunnadi naa prana snehitulu aruna,tulasi.vaalla uttaraalu naaku chala aanamdaannistaayi.
pavana garu anyway mii suucanaku dhanyavaadaalu.srinivas garu,unique garu mee comments ki thanks.

spandana said...

రాధిక గారూ,
నా "ఉత్తరాలు" మీతో కవిత రాయించినందులకు గర్వంగా వుంది.
పవన్ అనుకున్నట్లు మీరు రాసింది "smutulu" కాకపోయినా, మీరు రాసిన "smrutulu" కూడా తప్పేననుకుంటా! "smRtulu" capital R ను గమనించండి.
--ప్రసాద్
http://blog.charasala.com

రాధిక said...

thanks prasad garu.ippudu marchanu.pawan garu sorry nene chusukoaleadu.thanks again

Anonymous said...

RADHIKA RADHIKA RAYABOKE...
RASI NA MANASUNUU DOCHUKOKE..
***

MEE KAVITA CHADAVADAM
ANUBHUTULA SAMUDRAMLO MUNAGADAM

Thanking you for filling the
vacume of life with your 'sweet
poems'....

Dr.Pen said...

రాధిక గారూ...ఒకటి తరువాత ఒకటిగా ఇన్ని అద్భుతమైన కవితలు చూసి నా మతి పోతోంది. హార్థిక ఆభినందనలు. అన్నట్టు మీ కవితల్ని ఓ పుస్తక రూపంలో తెస్తే ఎలా ఉంటుందంటారు?

రాధిక said...

అలా పుస్తకం లా అచ్చేస్తె కవులందరు...రాసిన నన్ను,అచ్చేసిన వాల్లని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు.నా కవితలు చదవడానికి బాగున్నా అందులో వ్యాకరణ దోషాలు చాలా వుంటాయండి. ఈ కవితలని బ్లాగులో పెట్టడమే పెద్ద తప్పు.అదన్న మాట విషయం.అయినా మీ అభిమానానికి కృతజ్ఞురాలిని.

Anonymous said...

మంచి వ్యాకరణం కోసం అయితే పద్యాలు, శ్లోకాలు చాలా ఉన్నయి. మీ కవితలలో మంచి ఫీల్ ఉంటుంది. ఎక్కడో తగులతాయండి అవి. అరే ఇలాంటి జ్ఞాపకాలు నాకూ ఉన్నయి కదా...మరి నేనెందుకు కవితా రూపంలో వ్యక్తీకరించలేక పోయాను అనిపిస్తుంది. మన జెనరేషన్ కి అవసరమైనది హృదయాన్ని హత్తుకొనే భావన తప్ప, వ్యాకరణం,ఛందస్సు ఇలాంటివి ఎందుకని? అక్షర దోషాలు నిజమైన దోషాలుకానీ, వ్యాకరణం వ్యాపకానికి తప్ప, వాక్యానికి పనికి రాదు.

SATYA said...

super...i am also now searching for old letters...antha ayina....letters ki unnatha importance emails ki levu...

Anonymous said...

Old letters bring memories of past - Golden days which never come back again.

Anonymous said...

good expression!!

నిషిగంధ said...

రాధిక గారూ, నిన్ననే ఒక ఫ్రెండ్ ద్వారా మీ బ్లాగ్ తో పరిచయం ఏర్పడింది.. అలా చదువుతుంటూ వెళ్తుంటే కళ్ళని పట్టి ఆపేసిన కవిత ఈ 'నీ ఉత్తరాలు ' !! 'కళ్ళు మూసుకుంటే రూపం కనిపించటం .. ఉత్తరాలు తెరిస్తే మనసు కనిపించటం ' ఎంత అద్భుతమైన భావమో !! చాలా అందంగా చెప్పారు..

ఇంకో మాట.. మీ కవితలని ఒక సంకలనంగా అచ్చు వేయించడంలో మీరస్సలు సందేహ పడకండి.. తిట్టే వాళ్ళంటారా, వాళ్ళు ఎంత బాగా రాసినా దూసుకుంటూ వస్తారు తిట్టడానికి!!

thapasvi said...

రాధిక గారు....చాలా బాగా రాస్తున్నారండి....మీరు ఉత్తరాల మీద రాసిన కవిత చాలా బాగుందండి...పుస్తకాలే మిత్రులు..ఉతారాలే మిత్రులు..ఉత్తరాలలో దాగున్న గతం కొద్ది కొద్దిగా జారివస్తుంటే ...ఎక్కడో మనసు పొరల్లో దాగున్న నీటి చుక్క నిశ్శబ్దంగా చెక్కిలి పైకి కదిలొస్తుంటే .....ఎవరన్నరండి మనం ఒంటరని? ......

రాధిక said...

ఎంత బాగా చెప్పారండి.నా కవితాన్నా మీ రిప్లై చాలా బాగుంది. నిజమే గతం తోడుండగా మనమెప్పటికీ ఒంటరి కాదు.