Sunday, December 17, 2006

కన్నీటి లేఖ



నేస్తం
నీ కన్నీటి ని చూసి
నా గుండె నిండి పోయింది
నువ్వు చిందించిన కన్నీరు
నాకు భరోసానిచ్చింది

నేస్తం... నీకు గుర్తుందా...
ఆ రోజు నువ్వు
నానిగాడి తో పంపిన ఆ ఉత్తరం...

అందులో కన్నీటి చుక్కలతో
అలుక్కుపోయిన అక్షరాలు
చెప్పేసాయి మన స్నేహం గాఢతని

ఆక్షణం
నీ కన్నీరు నాకెంత ధైర్యాన్నిచ్చిందని?
నాకోసం బాధపడే హ్రుదయం
ఒకటంటూ ఉందని నా మనసెంత గర్వపడిందని?

ఇంతకీ ..
నా కనుల కాగితం పైన
కన్నిటి చిత్రాలు
నీకు కనిపిస్తున్నాయా మరి?

17 comments:

Anonymous said...

కవిత చాలా బాగుంది...

చిత్రము ఇంకా బాగుంది !!

Anonymous said...

మీరు చిత్రాలని చూసిన స్ఫూర్తితో కవితలు వ్రాస్తారో, లేక కవిత వ్రాసిన తర్వాత చిత్రాలు వెదుకుతారో తెలియదు కానీ రెండూ అతికినట్లుంటాయి

Anonymous said...

chala bagundi

SATYA said...

chala bagundi.....
mee blog.....meeru inka anno kavitalu ralayalini korukuntu
satyam

Anonymous said...

"మీరు చిత్రాలని చూసిన స్ఫూర్తితో కవితలు వ్రాస్తారో, లేక కవిత వ్రాసిన తర్వాత చిత్రాలు వెదుకుతారో తెలియదు కానీ రెండూ అతికినట్లుంటాయి "

నాదీ సేం డైలాగ్!

అవునూ ఎలా రాస్తున్నారు ఇంత బాగా?
జోక్ కాదు.

Naga said...

మీరు వ్రాసే కవితలు, కామెంట్లు నాకు మరియు అందరికి ఎంతో స్పూర్తిని కలిగిస్తున్నాయి అనుకుంటున్నాను.

Anonymous said...

Mee blog modati saari ga chadivaanu. mee kavithalu chaala adbutam ga vunnayi. mee kavithalalo images kuda chaala effective ga vethiki pettaru.

Keep up the good work.

Mee permission tho na blog lo linkify chestunnanu.

Rama Deepthi Muddu said...

last stanza is too good...
mana kosam okaru edisthey nijamgane manaki garvam ga untundi..appudu kalige adbhutamayina udrekam, garvam..dhairyam..manakosam okaruunanru ane oka sakti varninchalem... mee chivvari stanza tho adi sadhincharu!
avunu.., meeru evvari comments ki reply ivvaledu enti?

Anonymous said...

కన్నీటి తో మీరు వ్రాసిన కథ చాలా బాగావుంది. మనసుని పలకరించి కదిలించేలా వుంది మీ కవిత్వం.

Unknown said...

hi
mi kavithalu chala bagunnai
any way congrats for that type of poetry............
ur poetry is simply superb

Anonymous said...

మీ కవిత చాలా నచ్చింది

adarsh said...

చాలా బాగా రాస్తున్నారు. వస్తా... మళ్ళీ మళ్ళీ వస్తా :)

Unknown said...

chala baguundi

Anonymous said...

hai radhika garu ...mee kavithalu chala bagunaayi.

Anonymous said...

manasu chalistundi chaduvutu unte.anni rakala anubuthulu unnayi.chala chala bagunnayandi Radhika garu...eppudina vachi malli malli chadukuntanemo manasu baleka pothe

Anonymous said...

మీ యొక్క కవితలు చాలా బాగూన్నాయి. ప్లీజ్ ఈ కవితలను నా మెయిల్ కి పంపించండి. నా మెయిల్ address friend.hai63@gmail.com

Swamy Jagadvikyata Devotess said...
This comment has been removed by the author.