Friday, January 05, 2007

వీడ్కోలు


అప్పటి వరకు బాధ అంటే తెలీదు
అందం గా అల్లుకున్న స్నేహ బంధాలు తప్ప
కన్నీళ్ళు అంటే తెలీదు
నవ్వి నవ్వి కనుచెలమలు నిండడం తప్ప

కష్టాలంటే తెలీదు
నేస్తాలతో చిన్న చిన్న అలుకలు తప్ప
విడిపోవడం అంటే తెలీదు
చేతిలో చేయెసి సాయంత్రాలు నడవడం తప్ప

మౌనంగ వుండడం తెలీదు
సెలయేరులా గల గలా మాట్లాడడం తప్ప
మరి ఈరోజేమిటి..

నవ్వులన్ని జ్ఞాపకాల్లో చేరిపోతున్నాయి
అందమయిన బంధాలన్ని ఆటోగ్రాఫ్ లో
భాషగా మారిపోతున్నాయి
మనసులేమిటి మాటలని దాచేస్తున్నాయి

వీడుకోలు చెప్పడం అంత కష్టమా?

అరే...ఇదేమిటి?
ఆకాశంలో కదా మేఘాలున్నాయి
మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?

21 comments:

Anonymous said...

Hi Radhika gaaru,
nice poem. nijame chinnappadi snehitula gnapakaalu chaala madhuramgaa untaai.

Anonymous said...

Bavundi radhika :)

Anonymous said...

చాలా బాగుంది.

సాధారణంగా నాకు కవిత్వం అర్థం కాదు. కానీ మీ ఈ కవిత్వం ఎంతో సులభంగా ఉంది.

నాదొక స్వార్ధ కోరిక. మీ అన్ని కవితలూ ఈ కవితలానే ఉంటాయని ఆశిస్తూ..

- కిరణ్

Anonymous said...

నేస్తం ,
నీ కవిత్వం పఠించిన పిమ్మట కలిగిన అనుభూతి ..
నీవు చెప్పింది అక్షరాల సత్యం.

Sateesh said...

నేస్తం ,
నీ కవిత్వం పఠించిన పిమ్మట కలిగిన అనుభూతి ..
నీవు చెప్పింది అక్షరాల సత్యం.

Anonymous said...

mee kavitha chaala bavundi.

mee anni kavithallo sneham meeda adbutham ga varninchaaru. prathi okkari manasullo inchuminchu ilanti baavale vastayi.. kaani chaala koddi mandike devudu vaatini akshara rupam lo koorche kalani prasadistadu anadaaniki meeru kuda oka vudaharana matrame!

Anonymous said...

typo "meeru oka vudaharana "

gaa chaduvukondi.. naa comment lo chivari line. sorry about it. :)

Anonymous said...

radhika mee kavitha chala bagundhi...

manchi friends undatam nijanga varame...adhi chala kotha mandhike labisthundhi.aa friends ni vadhili pette mundhu cheppaleni badha..

Anonymous said...

VERY GOOD WRITE I LIKED IT A LOT.

Anonymous said...

రాధిక గారూ,

మీ ఈ కవిత మీద నా అభిప్రాయం రాద్దామని అనుకుంటే చాలా సార్లు ఈ బ్లాగ్స్పాట్ నన్ను రాయనివ్వలేదు. ఇప్పటికైనా కుదిరింది. రాస్తున్నా.

చాలా రోజుల తరువాత స్పందించిది మీ కవితా హృదయం. చాల చక్కగా వుంది. అప్పుడప్పుడు అనుకుంటూ వుంటా మీలా కవితలు కూడా రాయాలని. రాయలేకపోతే ఏం మీలా కవితలు రాసే వాళ్ళుంటే వాటిని చదువుకుంటూ ఆ ఆశ ని తీర్చుకోవచ్చు.

విహారి
http://vihaari.blogspot.com

swathi said...

wonderful..
chala andam ga vastavikam ga vyakteekarinchaaru..
pulakarimpachesaru.

thapasvi said...

అవునండి చాల బాగా రాసారు.....వీడ్కోలుకు ప్రతిరూపం చెంపల పై కన్నీరేనేమో!?....విడిపోతుంటే ఇద్దరి చెంపలపైకి అగుపడని కన్నీరొచ్చి,,మౌనం మాత్రమే మాట్లాడుద్ది క్ష్ ణాల్ని దాటేసుకుంటూ.

J-O-S-H (My Bench !) said...

the way u conclude ur poems is too good..last stanza is very nice...

Suresh said...

ఆకాశంలో కదా మేఘాలున్నాయి
మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?

ee 2 lines adbutham gaa raasaaru...Kudos...

మేధ said...

రాధిక గారు,
చాలా బాగా రాశారండి.. మీ కవిత చదువుతూ ఉంటే కాలేజీ లో చివరి రోజు గుర్తొస్తూ ఉంది.. ఇంతకంటే ఏమి చెప్పాలో కూడా తెలియడం లేదు.....
- మేధ

శరత్ said...

అరే...ఇదేమిటి?
ఆకాశంలో కదా మేఘాలున్నాయి
మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?

wow! excelent

LENIN THUMMALAPALLI said...

అరే...ఇదేమిటి?
ఆకాశంలో కదా మేఘాలున్నాయి
మా కన్నుల్లో వర్షం కురుస్తుందేమిటి?

చాలా బావుంది... మనసు తట్టి లేపింది మీ కవిత.

savi said...

simply superb.

Anonymous said...

Hi Radhika garu,
simply awesome. ur poetry evoked a lot of emotions. forgotten emotions. wanna read and know more abt u.

Anonymous said...

hi radhika garu na frnd marr undi thanakosam oka kavitha rayagalara..mem 5members friends ma andhari tharaphuna meeru oka kavitha rayagalaru ani na request

naik. said...

బాగుంది