Thursday, January 11, 2007

కన్నెమనసు


ప్రతి రాత్రి నను పలుకరిస్తూ
మా ఇంటి కిటికీ లో నవ్వుతూ చంద్రుడు!

వెన్నెల ఊసులెన్నో చెపుతూ
కన్నెగుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు !

ఏతారకతో స్నేహం కుదిరిందో
ఇటురానేలేదు ఈరోజు నిశీధినేలే నెలరాజు!

లోకమంతా చీకటి...
కన్నె మనసులోనూ అదే చీకటి...
చెప్పలేని ఏదో వెలితి !

ఆ చిలిపి స్నేహితుడు
చెంతచేరే చల్లని రోజెపుడు?

16 comments:

Anonymous said...

Bavundi :)

Dr.iSMILE said...

ఇది ఓ అమ్మాయి మాత్రమే రాయగల కవిత.విరహాన్ని ఎంతో సరళంగా, చక్కగా చెప్పారు. మీ కవిత చదువుతూంటే ఓ సినీ గీతం గుర్తుకు వచ్చింది...!

Dr.iSMILE said...

చంద్రుడిలో మచ్చలా...మీ బ్లాగు మకుటంలో అ0కిత0 అని ఉంది "అంకితం" అని సరిదిద్దగలరు.

Anonymous said...

లోకమంతా

Anonymous said...

bavundi!

spandana said...

చాలా అందంగా వుంది.
మీవి, అభిసారిక గారివి కవితలు చదువుతున్నంతసేపూ ఆరోజుల్లో నేను రాసుకొన్న కవితలు గుర్తొస్తాయి.
--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

chala bagundhi....
naku chala nachindhi..
kani chandrudu oka masam lo paksham rojule vasthadu kadha radhika...

satyam4u said...

సూపర్.....రాధిక గారు...చాలా బాగుంది.....

ra.... said...

Hi Radhika, i am impressed with your geetham and i wish to express the feelings of the moon by looking at you. This is like a counter verse for each line of your poem.

prathee ratri vasantha ratri gaadaa aa chandruniki ninnu chustoontee..

neelo nimpina uhalanni, nuvvu naalo nipina bhavalukava!

naa cheli nicheli momupye O chinni kunuka chudalanega, nenu mabbula matuna dagonnadi..!

nee manasulo velithi naa gundelo aghathame kada mari..!

Nee chanta untenegada naakaa challladanam..!

O bhavama! Naa priyaragama.. Naa chata sarigamalu palikinchi neevala mounamuga unte ela.. Ee reyi chinnapoda.!!

----Ra

Venu said...

eppatilaage haayigaa undandi chaduvutunte. Good one.

'lOkamantaa' daggara typO undi. saricheyyanDi.

radhika said...

"ra" gaaru mii kavita caalaa baagumdi.jabilli ayi miirichina vivarana adbhutam.

jags said...

Thanx for going thru my blog...:) mee kavitalu and kavitalani meeru andariki panchaalane taapatrayam naaku chaala nahchindi

sarath said...

వావ్!

Ravi Kiranam said...

వావ్

Mahi said...

Excellent Sister, You wrote an excellent poetry.

Very good, keep it up, OK. Bye.

Iam Mohan Babu from Hyderabad.

రాజ్ గౌడ్ said...

మాటలే రావంటూ మదిలోని భావాలను మధురంగా రాసినారు.
మీ కవితలు చదువుతుంటే చాలా ఆహ్లాదంగా హృదయం గాలిలో తేలిపోతుంది.
మీకో మాట చెప్పనా !
మనసులోని భావాలకు అక్ష్రరూపం ఇస్తే కవిత.!
దానికి మహాకవులే కానక్కర్లేదు.

ఏదేమైనా
మీ యీ మృధు మధుర కవితలు
సెలయేరులా నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ
నీ నేస్తం ...!