ఇప్పటికైనా..
నన్ను మాట్లాడనివ్వు...లోలోన అదిమిపెట్టుకున్న ఎన్నో ఆశలుఆనందాలు,కన్నీటి సవ్వళ్ళను ఇప్పటికైనా నీ చెవిని తాకనివ్వు !
చాలు...ఈ మూగ రోదనింక చాలు
గుండె పాటను గొంతులో ఆపేసిన
ఆనవాళ్ళు చెరిగిపోయేలా
ఒక్కసారి కేక పెట్టనివ్వు...
ఇకనైనా నన్ను మాట్లాడనివ్వు!
వర్షించడానికి సిద్దం గా
ఎన్నేళ్ళ భావాలో?
ప్రవాహం లా
ఎన్నెన్ని కన్నీళ్ళో?
16 comments:
http://www.eenadu.net/htm/weekpanel2.asp
ఈనాడు ఆదివారం పుస్తకంలో వచిన ఈ కధకు నా స్పందనే ఈ కవిత.
నిజమే రాధికగారు, నేను కూడా చదివా.నిజంగా ఎంతమంది ఆలోచిస్తారు ఈ విషయం గురించి.నాకు కూడా ఈ విషయం మీద చాలా చెప్పాలని ఉంది.కాని అందరు సుత్తి అనుకుంటారేమో అని భయం. మనసులో మాటను దాచుకోవద్దు కదా.
cala darunamaina samasya.
caala mandi tama bharyani pillalni discipline lo uncalani ila tayaru cEstunTaaru.
బ్లాగుల్లో ఎంతో మంది మగ వాళ్ళ సున్నితమైన
భావ వ్యక్తీకరణ చూస్తుంటే నాకు అడగాలనిపిస్తుంది,
వాళ్ళందరూ(పెళ్ళైన వాళ్ళు) భార్యతో అంతగానూ మనసు విప్పి మాత్లాడతారా అని.
ఆమె చెప్పే మాటలను సావధానంగా వింటారా,
ఓపికగా సమాధానం చెప్తారా అని.
నాకు తెలిసిన మగ వాళ్ళలో ఇది చాలా అరుదైన
లక్షణం. మరీ కనిపించదు అంటే కోప్పడతారేమోనని
అలా రాస్తున్నాను. మగ వాళ్ళు చెడ్డ వాళ్ళు అని నా
అభిప్రాయం కాదు సుమండీ. కాకపోతే, "మాట్లాడుకోవడం"
ప్రాముఖ్యత వాళ్ళకు ఎందుకు అర్థం కాదు అని?
లలిత.
రాధిక గారు....మీ కవితలు అన్నీ ఒకే సారి చదివి comment raastaanu...
రాధిక గారు, చాలా బాగా రాసారు.
chaalaa baagundi....nija jeevitaaniki daggaragaa undi.
kadha chadivi comment cheddamani agenu... prati inti lonu unde samsye..chala baga rasaru...
నిజంగా స్పృశించిందండి మీ కవిత! stream like flow. కవిత చదవగానె, ఈనాడు కధ గుర్తుకొచ్చింది. comment రాద్దామని చూసే సరికి, that's the inspiration for u...
మేము చెప్పాలనుకునే వాటిని మీరెలా పసిగడతారండీ. ఆలోచనల ముళ్ళపొదలలో పడి కొట్టుమిట్టడుతున్న నాబోటి వారి సంఘర్షణకి చక్కటి పదాలలో (కఠ్ఠినమైన గ్రాంథికంలో కాదు...హమ్మయ్య!) ఒక రూపాన్నిచ్చి మాముందుంచుతున్నారు. చాలా థాంక్స్.
చాలా బాగుందండీ..
ముఖ్యంగా..."గుండె పాటను గొంతులో ఆపేసిన
ఆనవాళ్ళు చెరిగిపోయేలా
ఒక్కసారి కేక పెట్టనివ్వు..."
నేను మీ కవిత చదివాక ఈనాడులోని ఆ కథ కూడా చదివాను. ఇదీ ఒక సమస్యే కాని, దారుణమైన సమస్య కాదు. ప్రతి ఇంట్లో ఉండే సమస్య అంతకంటే కాదు. ఈ కారణంగానే నాకు బొమ్మరిల్లు సినిమా కూడా కృతకంగా అనిపించింది. (తండ్రి అతి ప్రేమకి తల్లడిల్లే తనయుడు.)
tnq radika garu..nene meelage kavitalu rastunanu..........
naaku meere aadrsham
Post a Comment