జాజిపూల జ్ఞాపకాలు
ఆ పెరటి గుమ్మానికి సన్నజాజుల తోరణాలు
జాజులతోపాటూ
జ్ఞాపకాలు కోసుకుంటూ
రాలిపడిన పూలతో పాటూ
గత కాలపు క్షణాలను ఏరుకుంటూ
స్నేహితురాళ్ళతో పంచుకున్న
పూలదండల బహుమతులను
అపురూపం గా మననం చేసుకుంటూ
ఆహ్లాదకర సంధ్యను
జాజిపూల సాక్షిగా
మనసారా ఆఘ్రాణిస్తున్నాను
52 comments:
Chaalaa Baagundi .....!
కాసేపు సన్నజాజి తోటలో గడిపిన అనుభూతి కలిగింది.
జాజి పూల జ్ఞాపకాలు కవిత నా నేస్తాలని గుర్తుకు తెచ్చింది.
మా ఇంట్లో పొగడపూల చెట్టు ఉంది.
నేను ఉదయపు మంచు వేళ
పొగడ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి దోసిళ్ళ నిండా
పొగడ పూలను ఏరుకొచ్చి
పుస్తకాల మధ్య వాటిని ప్రెస్ చేసి
తెల్ల కాగితాల మీద వాటిని అతికించి
నల్లటి అక్షరాల్లో నా స్నేహాన్ని అద్ది
పొగడపూల పరిమళపు గుబాళింపులో
నా ఆత్మీయతని కలబోసి
నా ప్రియ నేస్తానికి పోష్టు చెయ్యడం
నాకెంతో ఇష్టమైన పని.
బాగుందండీ.
ఈరోజు గమనించాను తెరవెనుక నుండీ వస్తున్న పాటని. అయితే పాట వింటూ కవిత తెచ్చే అనుభూతుల్లోకి వెళ్ళడం కష్టంగా అనిపించింది. నా మట్టుకు ఏదైనా కవిత చదవాలంటే పూర్తిగా అందులో లీనమయి చదువుతాను. ఇది నా ఒక్క అభ్యంతరేమేనేమొ వదిలెయ్యండి అలాగే! ఎలాగూ పాటను మ్యూట్‌లో వుంచి చదువుకునే వీలుంది కదా.
--ప్రసాద్
http://blog.charasala.com
రాధిక గారు! కవిత చాలా బాగుంది. India కి దూరంగా వున్న చాలా మందికి మాత్రం జాజులు, మల్లెలు కూడా జ్ఞాపకాలవంటివే. అసలే శ్రావణమాసం. మీ కవిత చదివి చాలా జ్ఞాపకాలు కళ్ళముందు కదిలాయి. :)
by the way పైన ప్రసాద్ గారు రాసిన కామెంట్ లో back ground లో ఎదో పాట వస్తోందని రాసారు. నాకైతే ఏమీ ప్లే కావడం లేదు మరి.
రాధికగారు శ్రావణపూర్ణిమ(రాఖీ)శుభాకంక్షలు.
మీ మనసు కూడా మల్లెలంత స్వఛ్చంగా కనబడుతోంది నాకు...ధన్యుడిని రాధికగారు... కాదు, సోదరిగారు. రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు... ఉంటాను మీ సోదరుడు నంద
had an nice feeling reading it...
well written..
ammammma inti ki velli vachinattu ga undi...
well connecting words...
a very nice post.
Jaaji mallela thonu
vaana jallula thonu
naaku eppudu kastale
denini anandinchina nastale
rendinti thonu naaku vachedi jalube :(
Kaani ee kavitha choosina tharuvatha intiki velli unnapalanga velli jaajulanu thaakalani pisthundi.
మీకు శ్రీక్రిష్ణాష్టమి శుభాకాంక్షలు
మీరు కవిత్వంలా మాట్లాడుతున్నారే?
మీ బ్లాగు చూశాను. అది అంతులేని మహా సముద్రంలా వుంది.
మీ కవితల గూర్చి యెంతో రాయాలని వుంది.
ప్రస్తుతానికి ,చలం రాసిన ఉత్తరాలను పోగు చేసి
ఒక బ్లాగు తయారు చేసే పనిలో వున్నాను.
తప్పకుండా మీ కవితల గూర్చి రాస్తాను.
వీలైతే మీ కవితలన్ని PDF లో పంపగలరా?
మీకు నా కవితని చదివినందుకు ధన్యవాదాలు.
నాకు రాధిక అనే అమ్మాయి ఒకరే తెలుసు.
ఆమె నూజెర్సీలో వుంటుంది.
యాధృచ్చికమేంటంటే ఆ కవిత 'మీతో' అనేది ఆమె గురించే!
me kavithalu chala bagunnai. mukhyanga jnapakam kadu nuvvu kavali anna seershika chala chala bagundi. www.kesland.blogspot.com
జాజి పూలతో సుతారంగా కొట్టినట్టు అనిపించింది, హృదయపూర్వక అభినందనలు. మీ బ్లాగు డిజైను నాకు అరువిస్తారా ?
Plz check
chelam.blogspot.com
మీకు వినాయకచవితి శుభాకాంక్షలు
రాథికా గారు Simple words తో చాలా బాగా రాస్తున్నారు అండి..! మీ కవితలు కవి హ్రుదయం లేని నాకు కూడా అర్దం అయి పోతున్నయి....!.పొతే మీరు మీ కవితల్లో పెట్టే ఆ చిత్రాలు ఎచటనుండి తస్కరిస్తున్నారో కాస్త ఆ site పెరు మా చెవిన పడేస్తారని మనవి (మీకు నచ్హక పోతే చెప్ప వద్దు లేండి)
ave_kallu@yahoo.com బుచ్హి బాబు
ఎమండి
నేను మొదటి సారి మీ బ్లాగు కి వచ్చా
మీ కవితలన్నీ చుసా
చాలా బాగా రాసారండి
మీ ఈ కవితలు నన్ను మట్లాడనీయలేదు
మీ మనసులోని భావాలే బ్లాగు రూపం దాల్చింది
ఓక్కోక్కటి చూసే వాల్లే ఎం చెప్పాలో అర్థం కాకపోతే
అన్నీ ఒకేసారి చూసిన నేను ఎం చేప్పగలను
అయినా మీకు మీరే సాటి
hats off
ఇది చెపుతుంది నేను ఒక్కడిని కాను
మేమంతా...
@విహారి గారూ ప్రతీ విశేషమయిన రోజుకీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.మీ అభిమానానికి చాలా థాంక్స్.
@శంకర్రెడ్డిగారూ థాంక్స్
@ నువ్వుశెట్టిబ్రదర్స్ నాకు కలిగిన అనుభూతిని అందరితో పంచుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించినట్టుగానే కనిపిస్తుంది మీ కామెంట్ చూసాకా.
@ సత్యవతిగారూ నేస్తాలు సరదాగా ఇచ్చిన గడ్డిపరకలను కుడా అపురూపం గా దాచుకున్నదానిని.మీ ఆనందం నాకు అర్ధమయింది.
@ప్రసాదు గారూ తెరవెనుక పాట చాలా తక్కువ సౌండ్ లో పెట్టాను.మీ కంప్యూటరులో వాల్యూము గరిష్ట స్తాయిలో వుంటేనే అది వినిపిస్తుంది.అదో సరదా.కొన్నాళ్ళు వుంచి తీసేస్తాను.
@ హృదయ బృందావని గారూ మీరన్న ఆశ్రావణమాసమే కొంతవరకూ ఈ కవితకి స్పూర్తి.ఇందాకా చెప్పినట్టు మీ మృదులాంత్రం లో శబ్ధము గరిష్ట స్థాయిలో పెట్టి వుంటేనే ఆ పాట వినిపిస్తుంది.అదీ ఒక నిమిషం పాటే వినిపిస్తుంది.
@ ప్రవీణ్ కుమార్ గారూ అనుకుంటే అందరూ మనవాళ్ళే.అభిమానించడానికి,అభిమానం పొందడానికి రక్త సంబంధీకులే అవ్వక్కర్లెద్దు.
@ జోష్ మనమింకా అదృష్టవంతులం.అమ్మమ్మ ఇల్లు అంటే ఇవన్నీ గుర్తొస్తాయి.రేపు మన పిల్లల గురించి తలచుకుంటే బాధ గా వుంది.
@ కి2 గాఊ అయ్యో అలా అయితే ఎలా అండి?కొన్ని సార్లు తౌవాత బాధ పడతామని తెలిసినా కొన్ని పనులు చెయ్యలనిపిస్తుంది కదా. ఆనందం కలుగుతుందనుకున్నప్పుడు ఆ బాధ లెక్కలోకి రాదులెండి.
@ శ్రీధర్ గారూ చలం బ్లాగుని చూస్తూనే వున్నాను.ఇలాంటివి మిస్ అయితే చాలా పోగొట్టుకున్నట్టు.నా కవితలకి అంత సీన లేదులెండి.అయినా తప్పక పంపుతాను.
కేశవ్ గారూ చాలా థాంక్స్.
@ రవికిరణం గారూ గట్టిగా కొడితే జనాలు మళ్ళా నా బ్లాగుకి రారని నెమ్మదిగా కొట్టాను.నా బ్లాగు డిజైను కావాలంటే బ్లాగ్స్పాట్ వాళ్ళని అడగండి.అంతా వాళ్ళ పుణ్యమే.టైటిల్ మాత్రం గోదావరి విశ్వనాధ్ గారు తయారు చేసి ఇచ్చారు.
@ అనానమస్ గారూ ఎక్కడినుండీ తస్కరించలేదండి.గూగుల్ నుండి,ఫ్లిక్కర్ నుండి తీసుకున్నాను.
@ అస్విన్ చాలా థాంక్స్.
రాధికగారూ మీ బ్లాగంటేనే జాజిపూల జ్ఞాపకాలు, మంచుపూలు, వెన్నెల.... అంతా ఆహ్లాదంగానే ఉంటుంది. నేను మీ కవితల్ని చాలా వరకు చదివే ఉంటాను. అన్నింటిలోనూ ఏదో తాజాదనం కనిపిస్తుంది. పదాలు కూడా చాలా లలితంగా కనిపిస్తాయి. కానీ ఈ కవితలో మాత్రం 'ఆఘ్రాణిస్తాను ' అన్నారు. అస్సలు సరిపోలేదనిపించింది మీ శైలికి.
అసలు ఈ పదానికి కాస్త వివరణ ఇస్తారా. తెలియకే అడుగుతున్నాను. చాలా మంది కవులు ఈ మధ్య శ్వాసిస్తున్నాను, ఆఘ్రాణిస్తున్నాను... ఇలా చాలానే వాడేస్తున్నారు. అస్సలు వాడుకలో ఉండవు కదా! మీరు వాడిందయితే మరీనూ!
ఆ j2ee button తీసేద్దురు.
చక్కటి కవితల మధ్య పానకంలో పుడకలాగ అది ఎందుకండీ?
inkennni rojulu mamalni gnaapakalalone unchestaaru radhika garu..waiting for ur next update...
రాధిక గారు అందరు పాట పాట అంటుంటే ఏంటా అనుకున్నాను...
మొదటిసారి ఈరోజు వినగలిగాను... విండోస్ సిస్టం అవ్వడం వల్ల.. ఆ పాట వింటుంటే నేను ఈ మధ్య రాసుకున్నది గుర్తొస్తోంది.. మా గోదావరి గుర్తొస్తోంది...
ఆహ్లాదకర సంధ్యను ... మనసారా ఆఘ్రాణిస్తున్నాను
Interesting!
జాజులతోపాటూ
జ్ఞాపకాలు కోసుకుంటూ
రాలిపడిన పూలతో పాటూ
గత కాలపు క్షణాలను ఏరుకుంటూ
These four lines are Beautiful.
మీరు ఫోటోను ముందుగా సెలక్ట్ చేసుకొని, దాని గురించి కవిత వ్రాస్తారా? లేక కవిత వ్రాసాక దానికి తగ్గ ఫోటో తీసుకొచ్చి పెడతారా?
too tuch to memories
exlent with little words.
I bow to memories those especially with flowers.
"kisi shayarne kahaa
yeh phool nahi meradhil hai"
this fragnance is of all telugu people.
జాజిపువ్వంత ఆహ్లాదంగా ఉంది మీ కవిత!! చాలా బావుంది..
విరజిమ్ముతున్న సన్నని జాజిపూల జావళీల పరిమళల్లో విహరింపచేస్తున్నారు
First thing, please bear me with my poor english. Important thing isl; you are the first lady who is enjoying the nature even living in the cyber world. keep it up. According to my knowledge you are the best audion who can judge the visual stories. I am going to telecast tv shows soon in Gemini channel and some meterial published on net for public information. As a good and precious audion, I want to know your comments, guessings. address: www.neelosagam.com
రాధిక గారు మీ బ్లాగు చూసాను చాలా బాగుంది.కాని కవి హృదయాలకు తప్ప నాలాంటి వారికి అర్ధం కాదనేది నా అభిప్రాయం.
రాధిక గారూ, మంచి బ్లాగరుల పోస్టుల్ని, చదివి అభినందించే వారిలో మీరు మొదట వుంటారని వాళ్ల వాళ్ల బ్లాగులని చదివినప్పుడు గమనించాను, కానీ సమయాభావం వలన ఎప్పుడూ మీ బ్లాగు చూడలేకపోయాను, చూసాక అర్థం అయ్యింది, గొప్ప అనుభూతుల్ని నెమరువేసుకునేటట్టు చేసే చాలా మంచి బ్లాగు మీది అని. చాలా ఆలస్యం గా చూసాను :-( అని. ప్రతీ పోస్ట్ లోని కవిత మనసుకి హత్తుకునేలా రాసారు. అభివాదాలు. అభినందనలు. :-)
మీలాంటి వారు నా బ్లాగుని చదివి, బాగుంది అని చెప్పడం నాకు చాలా ఆనందాన్ని, మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విషయం, థాంక్యూ వెరీ మచ్ అండీ.
మీ రాక కోసం నా బ్లాగ్ ఎదురుచూసింది ఇప్పటివరకు... చాలా థాంక్స్ అండి.. తీరిక చేసుకుని పోస్ట్ చేసినందుకు...
nachindi.
nachindi.
nachindi...
radhika garu i want to tell just hats off to you
రాధిక గారు! మొదటిసారి నేను మీ బ్లాగు చూస్తున్నాను.....ఓ కవితా సముద్రాన్ని చూస్తున్నట్లనిపిస్తుంది, రెండు మూడు కవితలు చదివాను అద్భుతంగా రాస్తున్నారు, తీరిక చూసుకుని(చేసుకుని )....అన్నీ కవితలు చదివి మళ్ళీ కలుస్తాను.
హాయ్ రాధికా గారూ, మీకు తెలుగు భాష మీద వున్న అభిమానానికి జోహార్లు. I would like to invite you to an idea for Telugu people and Telugu Language lovers, please visit http://www.atuitu.com I shall be glad to have your contribution on atuitu in terms of participation and your writings. Cheers, Cass.
Guppedu Jaajulni voohistu...
Gampedu madhuroohalni..
Sumadhuram gaa padamaalalalli
Maa andariki panchinanduku joharu..
Mee kavithaavesam elaane konsaagalani.. mee voohala nindaa marennoo suma baalalu, madhuroohalu nindaalani aasistoo..
రాధిక గారు...నిజంగా మీ కవితలు అద్భుతంగా ఉన్నాయండీ. మీ బ్లాగ్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా రాయడం మొదలెట్టాను.
www.giliginthalu.blogspot.com
ఒకసారి ఇది చూసి మీ అభిప్రాయం తెలియజేస్తారా? ఎక్కడ తప్పులు చేస్తున్నానో ఏమన్న చెప్పండి. తప్పులుంటే మన్నించండి. సరిదిద్దుకుంటాను.
--శ్రీనాధ్.
రాధిక గారు...నిజంగా మీ కవితలు అద్భుతంగా ఉన్నాయండీ. మీ బ్లాగ్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా రాయడం మొదలెట్టాను.
www.giliginthalu.blogspot.com
ఒకసారి ఇది చూసి మీ అభిప్రాయం తెలియజేస్తారా? ఎక్కడ తప్పులు చేస్తున్నానో ఏమన్న చెప్పండి. తప్పులుంటే మన్నించండి. సరిదిద్దుకుంటాను.
--శ్రీనాధ్.
its very nice.... bagundi
keep it up jaji puvva
its cool yaar
నేస్తమా..!
నీవు భాషే రాదంటూ బాగా రాసావు.
సూక్ష్మంలో మోక్షం లా చాలా బాగా రాసినావ్
Hi Rashika gaaru, Ur peoms are so good. Just giving a warm sunrise to the sleeping memories of school(child) days in the heart... And some are freshening the eyes with the warm water(Aananda bhasphaalu).
Thanks a lot for giving this kind of peoms to all of us, that too in TELUGU :-)
రాధిక గారు,
దూరంగా ఉంటూ కూడా మూలాలలోని సౌమ్య జ్నాపకాలను చక్కని భావుకతతో వ్యక్తీకరిస్తున్న మీ బ్లాగులోని కవితలు చాలా బాగున్నాయి.
బొల్లోజు బాబా
విన్నపం: మీరు పాతకవితలలో జ్నాపకాలను నేను పైన వ్రాసి నట్లు గా తప్పుగా వ్రాసారు. ఈ మద్య కవితలలో ఆ పదం సరిగ్గా వ్రాయబడింది. ఆ పదాన్ని ఎలా కరెక్టుగా టైప్ చేయాలో కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్ ......ఎందుకంటే నేను కొత్త బ్లాగర్ ని.
mee kavithala jaajipoolu jnaapakaallo parimalistunnayee. inka manchi kavithalu vrayandi.
mee jaajipoola kavithalu jnaapakaallo parimalaistunnaayee.Inka manchi kavithalu vrayandi.
eennallu gaano vechina udayam eennadu kolleduruga,mi kavithala roopamlo edurochindi,naa manasu lothulloni bhavala palakarimpula,samanyavame ee jaaji mallela kavitha thoranam.abhinandanalu
Aantu leni E Mahasamudrani
Aandukune Varevaro
Post a Comment