Sunday, July 29, 2007

లేఖ


నీ లేఖలో ని ప్రతీ వాక్యం
ఎన్ని కబుర్లు చెబుతుందో
నిశ్శబ్ధం గా
ఎన్ని జ్ఞాపకాలను తడుతుందో

ఇరికించి మరీ రాసే అక్షరాలు
ఎంత ఆప్యాయతను చూపిస్తాయో
చదివిన ప్రతీ సారీ మదిలో
ఎన్ని రంగులను నింపుతున్నాయో

అల్మారాలో,బట్టల మడతల్లో
పరుపు క్రింద,ఫొటోల వెనుక
ఎక్కడ చూసినా నీ అక్షరాలే
వాటి తాలూకూ పరిమళాలే

ఎప్పుడూ నీ ఉత్తరాలతో పాటూ
నా దగ్గరగా నువ్వు

-స్నేహం తో
నీ చిరు నవ్వు

23 comments:

cine abhimani said...

I didn't get the feel with it that I used to get with your previous poems...There were some from you after reading which I can't stop my self from crying...Please take my words positive, we have a great respect towards you..

Anonymous said...

poem kaMTE bomma baavuMdi.

J-O-S-H (My Bench !) said...

ending was really good...
"enni kaburlu chebutondo nissabdhanga" that sentence is nice...irikinchi maree rase aksharalu... few expressions really added some flavour...
nice pic too... even i re-read letters and mails in the folders.. gives a great feeling to get back to those torn pages of letters from dear ones..
Feelings tho-
JOSH!!!

jags said...

"Lekhaa idi oka lekhaaaa.... leka leka raaya lekaa raasaanu oka lekhaaa" ee paata vinna pratisaari okalaanti aanandam kaligedi, mee kavita chadivina taruvaata naaku maro saari ade anubhuti kaligindi. Andamayina kavita...:)

aman said...

Dear Radhika garu,
thanks for the opinion on my short story in pranahita. u can read another story in prajakala.org's october 2006 issue.
regards
kurmanath

Viersh's said...

రాధిక గారు మీ కవితలు super. ఇంతకంటే ఏమీ చెప్పలేము._అపరిచితుడు.

విహారి said...

Radhika garu me kavitalu chala bagunnai.
inka mee blog lo song excellent,marvellous,super inka matalu laevandi.

oremuna said...

బాగుంది

విహారి said...

రాధికగారు బ్లాగ్ లొ పాత ఎల పెట్టారండి చెప్పరా.నేను పెట్టుకుంటా

radhika said...

సినీ అభిమాని గారూ ఎవరు ఏమి చెప్పినా పోజిటివ్ గానే తీసుకుంటాను.మీ కామెంట్ కి థాంక్స్.
దీప్తి గారు ఉత్తరాలనేవి ఎవరికయినా దాచుకోదగిన బహుమతులు.అవి ఎన్ని సార్లు చూసినా,చదివినా అస్సలు తనివి తీరదు.
జాగ్స్ థాంక్స్.ఇలా పక్క వాళ్ళ కవితలకి కామెంట్లు రాయడమేనా?త్వరగా మీ బ్లాగుని అప్డేత్ చేసేదేమయినా వుందా?
చాలా థాంక్స్.
అమన్ జీ తప్పకుండా చదువుతానండి.వాటిని నేను ఎప్పుడూ చదువుతూనే వుంటాను.కామెంట్లు మాత్రం అప్పుడప్పుడూ రాస్తుంటానంతే.
విహారి గారూ చాలా చాలా థాంక్స్.మరీ ఎక్కువ చెప్పీఅసారు.బ్లాగులో పాట ఎలా పెడతారో నాకూ తెలీదండి.మా వారిని పెట్టమని అడిగితే పెట్టారు.మీరు ప్రవీణ్[నా మదిలో] గారిని గానీ,కిరణ్[ఒరెమూనా],సుధాకర్[శోధన] గారిని గానీ అడగండి.

radhika said...

విహారి [2] గారూ నాకు తెలిసినంత వరకు మీరే పాట పెట్టాలను కుంటున్నారో అది mp3 అయి వుండాలి.ఆ పాటని గూగుల్ పేజెస్ లో కి అప్లోడ్ చేసి ఆ లింక్ ని టెంప్లెట్ కి ఏడ్ చెయ్యాలనుకుంటాను.[ఇది కరక్ట్ కాదనుకుంటాను.మా వారు చేస్తుంటే చూసింది ఇలా చెప్పేసాను.]

radhika said...

కిరణ్ గారూ[ఒరెమూనా] నా బ్లాగులో మీ తొలి కామెంట్ అనుకుంటాను ఇది.ధన్యురాలిని.

జాన్‌హైడ్ కనుమూరి said...

లేఖ పల్చబడిందండి

ఇంకొంచం చిక్కగా రాయాలి

ఉత్తరాలు తరిగిపోని సంపదలాంటివి.
దానికి కవిత్వం అద్దటం ఒక మహత్తర ప్రక్రియ.
ఉత్తరాలు ఏకాతం నుండి సమూహాల్లోకి

సమూహాల నుండి ఏకాతంలోకి
వంతెనను నిర్మిస్తాయి
ఎవరి వంతెనకు వాళ్ళ నేపద్యమే చిత్రాన్నిస్తుంది
నిర్మించడమే
మీరు మీ వంతెనను ప్రదర్శనకు పెట్టారు
సుమారు రెండు కిలోమీటర్లున్న రాజమండ్రి వంతెనలా అనిపించాలి
లండన్ లోని వంతెనపైనో, హౌరా వంతెనపైనో విహరిస్తున్నట్టు వుండాలి
అక్షరాల వంతెన పైనుండి ఎవరికివారే మరో కొత్త వంతెన నిర్మించుకోవాలి.
బాల్యంలో తొక్కుడు బిళ్ళ ఆడినట్టు,
యవ్వనంలో దాచి దాచి చదువుకున్నట్టు
మన్సులో కట్టుకున్న కొత్త ఫొటో ఫ్రేములా అనిపించాలి.

ఈ అనుభూతులు మీ అక్షరాల మద్య దాగివున్నాయి వెలికితీయండి.
మీరు రాయగలరనే నమ్మకంతో
అభినందిస్తూ
జాన్ హైడ్ కనుమూరి

Raja Rao Tadimeti said...

రాధిక గారూ, మీ కవితలో ఎంతో భావం దాగుంది. మరల మరల చదివిన కొద్దీ కొత్త భావాలు స్ఫురిస్తున్నాయి. ఇలాగే కొనసాగించండి.

Bhanu said...

రాధిక గారికి,

నా కవిత్వం నచ్చినందుకు ధన్యవాదాలు.మీ కామెంట్ చూసి మీ బ్లాగ్ చూసాను. మీ పొయెట్రీ కూడా చాలా బాగుంది. నిజంగా ఉత్తరాలు రాయడం ఒక ఆర్ట్. చలం గారి మ్యూజింగ్స్ లాగా, ప్రేమలేఖల్లాగా
అక్షరాల్లొ ఆత్మను నింపి ఎంతమంది రాయగలరు? అలాంటి ఉత్తరాలు ఎప్పటికీ ఒక మధురమైన జ్ఞాపకంగా గుండెను పట్టుకు వేలాడతాయి.

భాను

Nandagiri Praveen Kumar, Hyderabad INDIA said...

నా బ్లాగ్ లో మీ సద్విమర్శకి ధన్యవాదములు..... ఏ నాటికైనా మీ క(విత)ళ లో ౧ (1) శాతమైనా నాకు వస్తే అదృష్టవంతున్ని... ఉంటానండి - ప్రవీణ్

Lavanya said...

Hi radhika,
this is the first time i am watching your blog..really i cant express in the words how is the blog n all.

mee kavithalu chala bagunnayu ra..
i have to appeciate ur knowledge.

nice photos also.
keep smiling always radhika.

RAMU said...

mee kavitalu chalabagunnai................ "kallalo nindi unna ninnu gundello dachukunta...eppudu kavalante appudu chusukunela addanga maluchukunta.............Ram"

RAMU said...

gooooooooooooooooooood

Ravi Kiranam said...

రాధిక గారు,

నేనో కొత్త బ్లాగర్ని. మీరు నా బ్లాగు లో రాసిన పోస్ట్ చూసి, మీరెవరు తెలుసుకుందామని మీ ప్రొఫైల్ క్లిక్ చేసి, మీ కవితలు చదవడం జరిగింది.

యేమీ చెప్పలేను.

కొన్ని అనుభూతులు మౌనం లోనే బావుంటాయి.

రవి

ఫణీంద్ర కుమార్ said...

బావుంది.

ganesh said...

radhika garu mee kavithalu chala bagunnai.

ganesh said...

mee kavithalu chaduvuthunte patha jnapakalu gurthu kostunnai super....