Sunday, December 02, 2007

ఆటోగ్రాఫ్ లో నా మనసు



అప్పుడప్పుడు ఎలావున్నావంటూ
ఒక్కపలకరింపు చాలు
నేను గుర్తొచ్చినప్పుడల్లా
నీ పెదాలపై నవ్వులు పూస్తే చాలు
సంతోషమైనా,బాధయినా
నేనుంటే బాగుండుననిపిస్తే చాలు
మన మధ్యనున్న వేల జ్ఞాపకాలు
కొన్నయినా మధురం గా అనిపిస్తే చాలు
చాలు....నా
స్నేహానికిది చాలు

మనిషి కీ,మనిషికీ
మనసుకు,మనసుకూ మధ్య
ఈ మాత్రం వారధి చాలు


ఓనమాలు లలిత గారికి కృతజ్ఞతలతో

31 comments:

తెలుగు'వాడి'ని said...

హమ్మయ్య ఇన్ని రోజులకు మామీద దయకలిగినందులకు ధన్యులం రాధిక గారు. ఎండాకాలంలో వేగిన పుడమితల్లికి తొలకరి జల్లులా ఒక మధురమైన జ్ఞాపకంగా, అందమైన అనుభవంగా మొదలయ్యింది.

అప్పుడప్పుడూ మీరున్నారంటూ
ఒక్కొక్క కవిత చాలదు
మేము* గుర్తొచ్చినప్పుడల్లా
మీ మనసులోని భావాలు అక్షరాలుగా మారితే చాలు
పేరాలైనా పదాలైనా
మీరు ప్రచురిస్తుంటే చాలు
మీ నుంచి వచ్చే(చ్చిన) వందల కవితలు
అన్నీ మధురంగానే అనిపిస్తాయి(పించాయి) మాకు
చాలు .. మీ బ్లాగుకొచ్చినందుకు అది చాలు

కవితకూ, కవితకూ
టపాకూ, టపాకూ
ఇంత వ్యవధి మాత్రం ఎక్కువ మాకు

* అభిమానులం

ఏకాంతపు దిలీప్ said...

పైన "తెలుగు'వాడి'ని" చెప్పిన దానితో ఏకీభవిస్తున్నాను...


"మనిషి కీ,మనిషికీ
మనసుకు,మనసుకూ మధ్య
ఈ మాత్రం వారధి చాలు"

మీకు మాకు మధ్య ఉన్న సున్నితమైన మీ భావుకత్వ వారధి మిమ్మల్ని ఎప్పుడు తలచుకునేట్టు చేస్తుంది... మీ బ్లాగ్ కి రాగానే పెదాలపై నవ్వులు పూస్తాయి... ఒకటి చదువుతుంటే మనసు సంతోషంగా స్పందిస్తుంది, ఇంకొకటి చూస్తే భాధగ స్పందిస్తుంది... కొన్ని చదువుతుంటే, బిజీ బిజీగా పరుగులు పెడుతు వాటిని పట్టించుకోవడం లేదని అలిగి పత్తాలేకుండా పొయిన జ్ఞాపకాలన్నీ రెక్కలు కట్టుకుని ముందు వాలతాయి... ఒక్క క్షణం ఆగి నన్ను నేను తరచుకుని చూసుకుంటాను.. నా మనసు నాకు ఆటోగ్రాఫ్ రాస్తున్నట్టే ఉంటుంది... మీరే రాయిస్తున్నారు! ఏదో చేస్తున్నప్పుడు, ఎలానో ఉన్నప్పుడు, నన్ను నేను మరిచిపొతున్నప్పుడు.., ఒకప్పటి నాకు, ఇప్పటి నాకు, అలుపు నుండి ఉత్సాహానికి, చంచలం నుండి స్థిమితత్వానికి మీ కవితలు వారధిగా నిలుస్తున్నాయి...
చుసారా మీ కవితలొ పదాల కన్నా నా స్పందనలొ పదాలు ఎక్కువైపొయాయి..! I cant help it... but then, I like my true self :)


నాలో మీ చెలిమి

Anonymous said...

hi
chaalaa chakkani bhaavukathatho wrasaaru... chaalaa chaalaa baavundandi...

lalithag said...

రాధిక గారు,
మీకు నా కృతజ్ఞతలు.

నా భావాన్ని అర్థం చేసుకుని,
అందంగా అమర్చి
అర్థమయ్యేలాగా చెప్పారు.
హత్తుకునేలా చెప్పారు.

చాలా బాగా చెప్పారు.

raju said...

రాధిక గారూ కవితలు బాగున్నాయని అందరూ చెప్పే మాటైనా, నిజంగానే చాలా బాగున్నాయి.
నేను మీ బ్లాగ్ నిన్నే చూశాను. కవితలు చదివి కామెంట్ రాయడానికి ఇంత సమయం పట్టింది(ఇంకా అన్నీ చదవలేదు).

August తరువాత కవిత రాయడం ఇదే తొలిసారైతె, పాపం ఎంత మందికి ఎన్ని యుగాలు గడచుంటాయో!

మీ కవితలు చదివితే చాలా అమాయకంగా వుంటాయి గానీ, మీలో చాలా అల్లరి దాగుందండి(మీ replies చూసి (కాదు చదివి) )

మీరు ఇంకా 'అమృతం' ను 'అమ్రుతం' , 'ప్రకృతి ' ని 'ప్రక్రుతి ' అని రాయబోతే, వాటిని సరిగా రాయగలరా please.

అంత మంచి కవితల్లో అలాంటి పదాలను చూస్తే ఎలాగో వుంది

మీ కవితలు చదివాక నాకు ఒక మనసంటూ వుందని గుర్తొచ్చింది

raju said...

ఇంకో విషయం మరచాను. అంత మంచి pictures ని ఎక్కడ నుండి పట్టుకొస్తున్నారండి

అక్షరాలు left brain ను బొమ్మలు right brain ను నింపి కవితల భావాలను చాలా కాలం(జీవితాంతం అనొచ్చా)గుర్తుండేలా చేస్తున్నాయి.

Nagaraju Pappu said...

ఈయనెవరో ఎంచక్కా మీ కవితలని జెరాక్సు తీసుకొని వారి బ్లాగులో పెట్టుకొన్నారు - చూసారా?
http://manasulomatacheppna.blogspot.com/

హృదయ బృందావని said...

రాధిక గారు! ఏ కారణంగా బ్రేక్ ఇచ్చారో గానీ
మళ్ళీ చాలా మంచి కవిత తో ఆ గ్యాప్ ని పూరించారు.
చిన్ని కవితలో మంచి భావాన్ని వ్యక్తం చేసారు.
చాలా బాగుంది.

by the way నా బ్లాగ్ లో మీ కామెంట్ కి thank u:)

Anonymous said...

Good post, excellent.

I wish I had a person like this too.

Thanks to ....

రాధిక said...

తెలుగువాడు గారూ మీ అభిమానానికి చాలా థాంక్స్.ఈ మధ్య పనిలేని పనులు ఎక్కువయ్యి సమయం చిక్కడం లేదు.పెన్ను,పుస్తకం పట్టుకుంటే పచారీ సామానులిస్టు రాసేస్తున్నాను,పోనీ లేఖిని లో రాద్దామంటే ఎవరో ఒకరి టపా కి కామెంటు రాసేస్తున్నాను.
దీపు మీ కామెంట్లు గానీ,కవితలు గానీ చదివినప్పుడల్లా నాలాంటి మనిషే ఇంకొకరున్నారు అనిపిస్తూ భలే ఆనందాన్నిస్తూవుంటుంది.చాలా థాంక్స్.
రవి గారు నెనలు
లలితగారూ ఈ మధ్య ఎన్నో ఆలోచనలొచ్చి అలాగే వెళ్ళిపోయాయి.మీ స్నేహం కవిత చదివాకా నా ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి.సరిగ్గా చూస్తే మీ ఆ కవితనే ఇక్కడ మళ్ళా రాసినట్టు వుంటుంది.ఈ సారికి క్షమించేయండి.
సిద్దిరాజుగారు ఆ అక్షర దోషాలన్నీ తెలుగు టైపింగు సరిగా రానప్పుడు వచ్చినవి.ఇప్పుడు అవన్నీ మార్చాలంటే బద్దకం.అదీ కాకుండా బ్లాగులో ఏ చిన్న మార్పు చేద్దామన్నా కూడలిలో వచ్చేస్తుంది.ఏదో చిన్న వయసులో రాసిన కవితలన్నీ ఇప్పుడు కూడలి జనాలకి ఎందుకు చూపించడం అని అలాగే వదిలేసాను.కొన్ని తప్పులు అయితే అవి తప్పుగా రాసాను అనే నాకు తెలియట్లేదు.అలాంటివి ఎవరన్నా చెపితే బాగుంటుంది.ఆ బొమ్మలన్నీ గూగుల్,ఫ్లిక్కర్,మిత్రుల దగ్గరనుండి తీసుకొన్నవి.
గురువుగారూ ఇప్పుడే చూసాను.నావే కాకుండా వేరే సేకరణలు కూడా వున్నాయి.ఎక్కడో ఒక కామెంటులో చెప్పారు ఆ బ్లాగరు కొన్ని సేకరణలు అని.
రాధ థాంక్స్
అపరిచితుడు గారూ థాంక్స్.అదృష్టవంతులు.మీ పేరు తెలియచేసి వుంటే బాగుండేది.

Anonymous said...

మీ profile ఎక్కడ వెతకాలి మేడమ్

Unknown said...

raghika gariki namaskaramulu.2days back nundi maatrame naaku ee blog gurinchi telisindi.ennirojulanundi nenu mis ayinanduku feel avutunnanu.mee kavitalu chaala bagunnai.mee kavitalalo manchi depth vundi.ekanundi regularga follow avutaanu. meeku naa hrudayapurvaka abhinandanalu. mee nundi marinni manchi kavithalu expect chestunnanu. once again thank u thank u very much bye

Anonymous said...

radhika gariki namaskaramulu. 2 days back naaku mee blog gurinchi telisindi. naaku mee kavithalu baga nachinayi. ennirojulu miss ayinanduku badhapadutunnanu.mee kavithalalo manchi subject& depth vundi. meeku naa hrudayapoorvaka abhinandanalu. mee nunchi marinni manchi kavithalu expect chestu thanku thanku very much

Unknown said...
This comment has been removed by the author.
మాలతి said...

సున్నితమైన భావాలని సుందరంగా, చక్కగా చెప్పారు. మీకు శుభాకాక్షలు.

మాలతి

Chakrapani Duggirala said...

నమస్తే రాధిక గారు,

మీ కవితలు వాటిని ప్రతిబింబించే చిత్రాలు చాలా బాగున్నాయి. మరిన్ని వ్రాస్తూ వుండండి.

Rama Deepthi Muddu said...

"Manishiki manishi ki manasu ku manasuku madhya ee matram varadhi chaalu.."
Nice line... chala simple ga chala touching ga rasaru.. very nice one after a long gap.. atleast meerena update chesaru blog ni.. good to c the post..
keep writing often... maku exams and snow tho time dorakadam ledu kotta pics click cheyyadaniki.. keep posting.
- JOSH

వికటకవి said...

రాధిక గారూ,

సరళంగా బాగుంది ఈ కవిత.

spandana said...

మళ్ళీ మీకలాన్ని కదిలించినందులకు కృతజ్ఞతలు.

--ప్రసాద్
http://blog.charasala.com

jags said...

నేను చూసిన అందమైన వారధి ఇదే సుమండీ. మీరు ఇలాంటి వారధులు మరిన్ని మా ముందుంచాలని కోరుకుంటున్నాం

హృదయ బృందావని said...

చాల థ్యాంక్స్ రాధిక గారు. ఈ మధ్య నేను కూడలి చూడనే లేదు. మరి పోస్టింగ్స్ మిస్ అవుతున్నాయేమో. నేను వీవెన్ గారితో మాట్లడతాను. థ్యాంక్ యు. :)

మీ నెక్స్ట్ పోస్టింగ్ కోసం ఎదురుచూస్తుంటాను. :)

Rajendra Devarapalli said...

ఎందుకండీ బాబూ,జనాన్ని ఇలా ఇబ్బంది పెడతారు.మేమేదో మా బతుకులు ఏదో ఒక విధంగా ఈడుస్తూ,స్పందనలు లేని బండలుగా,సున్నితత్వం మరిచిన రాజకుటుంబీకులుగా,మా
షాపింగులూ,మా ఉద్యోగాలూ,మా రియల్ ఎస్టేట్లూ, ఇలా మా దారిన చాప్లిన్ సినిమాలో గొర్రెల్లా తలొంచుకుపోతుంటే ఏనాడో మరిచిపోయిన స్నేహాలూ,మనసులూ,వారధులూ అంటారు? అజ్ఞానం కంటే ప్రమాదకరమైన అర్ధజ్ఞానం మాకు పూర్తిగా ఉంది మీరేమీ చెప్పక్ఖర్లేదు

పావనీలత (Pavani Latha) said...

మీబ్లాగు నిన్నానే చూశాను,ఏమిరాయాలోకూడా నాకు మాటలు రావడం లేదు,సున్నితమైన పదాలతోకూడా ఇంత అందమైన లోతైన భావాలను పలికించడం నిజంగా అధ్భుతంగా అనిపించింది...

Anonymous said...

వీరందరి స్పందనలు చదివిన తరువాత, మళ్ళీమళ్ళీ వారధిని చూసాను. ఎవరిదో భావాన్ని భాషలో పొదగటం మాటలు కాదు. కవిత్వమే. దాన్ని స్పృశించే శక్తిని సమపార్జించుకున్నందుకు మీకు మా అభినందనలు.
మీరు ఇప్పుడు వ్రాస్తున్నట్లే సమయపాలన పాటించటంలోనే కొంత క్వాలిటి వుందనిపిస్తూ వుంది. రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారి కామెంట్ నాకు నచ్చింది.

Sarat Chandra said...

రాధిక గారు..

మొదటి సారిగా మీ బ్లాగు ని చూసా.. చాలా బావుంది. మీ కవితల్లొని సరళత/గాఢత అకట్టుకున్నయి.

-శరత్చంద్ర (saratkakarla.blogspot.com)

పద్మ said...

చాలా బావుంది రాధిక గారూ. :)

విహారి(KBL) said...

Happy New Year Radhika garu

హృదయ బృందావని said...

Wish You A Very Happy and Prosperous New Year Radhika garu :)

రవి said...

రాధికాజీ, మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

"నేను గుర్తొచ్చినప్పుడల్లా
నీ పెదాలపై నవ్వులు పూస్తే చాలు"

మీ అంత అందంగా,సున్నితంగా చెప్పలేను కానీ, నేనూ ఇలానే అనుకుంటాను.

Anonymous said...

నా బ్లాగులో మీ బ్లాగుకు లంకె ఇచ్చినాను.అభ్యంతరం వుంటే తెలియచేయగలరు.

Unknown said...

this very very beautiful yours feelings tached my hearts