Friday, January 11, 2008

మా స్నేహం


పంటపొలాలమధ్య పాటలా మా స్నేహం
ఎగుడు దిగుడు రహదారుల్లో
అలుపు లేకుండా సాగిన పయనం

పిల్లకాలువలో ప్రతిబింబాలు చూస్తూ
గట్టు మీది గడ్డి పూలు కోస్తూ
మైమరచిన క్షణాలు
అపార్ధాలు,అలుకలతో
మూతి ముడుచుకున్న వైనాలు

బుజ్జగింపులు,లేఖలు,రాయబారాలు
వెనువెంటనే నవ్వులు,పువ్వులు...గంటలతరబడి కబుర్లు

ఒక మనసు బాధపడితే
చెమ్మగిల్లే కన్నులెన్నో మరుక్షణంలో
ఒక పాదం తడబడితే
ఊతమిచ్చే చేతులెన్నో మా స్నేహంలో


.

41 comments:

karyampudi said...

"గట్టు మీది గడ్డి పూలు కోస్తూ
మైమరచిన క్షణాలు"
కావాలన్నా మరల తిరిగిరాని క్షణాలను గుర్తుచేశారు.....
చాలా బాగుంది...ఇంతకు మించి ఎలాచెప్పాలో తెలియదు....

Anonymous said...

చాలా బాగుంది...

ramya said...

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ లా
చాలా బాగుంది.

Anonymous said...

Nice kavata…. It takes me into childhood… I once again remember my sweet memories…
Thanks to Radhika garu

హృదయ బృందావని said...

రాధిక గారు ! సంక్రాంతి శుభాకాంక్షలు :)

హృదయ బృందావని said...

సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చి మీ ఈ కొత్త కవిత చూసాను

"పంటపొలాలమధ్య పాటలా మా స్నేహం" : కవిత ప్రారంభమే కవిత ఎంత అందంగా వుంటుందో చెప్పేసింది :)
"ఒక మనసు బాధపడితే
చెమ్మగిల్లే కన్నులెన్నో మరుక్షణంలో
ఒక పాదం తడబడితే
ఊతమిచ్చే చేతులెన్నో మా స్నేహంలో"

అలాంటి ఊతమిచ్చే స్నేహితులుండడం చాలా అదృష్టం రాధిక గారూ :) చాలా బాగా వర్ణించారు మీ స్నేహానుబంధాన్ని.

Anonymous said...

Radhika Garu,

Mee blog bahu muchhataga, chooda chakkaga vundi. meedi manchi anubhooti kavitvam.

Kalpana

Usha said...

namaste radhika gaaru mee sneham ane blog lo anni chalaa chalaa bagunnayi meeku antha chakkani nestam kaligi unnanduku naaku koddigaa jealousy gaa kuda undi meelanti[just for fun]
meeru naaku alanti madhurima gaa kalavaalani korukuntunnanu
HAPPY PONGAL
mee saha blogger
USHA

Anonymous said...

నమస్తే రాధిక
కాదండి కాపోతే ఆ నేస్తం తో చాలా నెలలు గా చాట్ చేస్తున్నా
ఒక బెస్టు ఫ్రెండు గా అనుకున్నానే తప్పా నిజమైన నేస్తం ఒక చెలిమి అని మాత్రం జస్ట్ నిన్ననే అర్ధం అయ్యింది


థాంక్స్
ఉష
http://usha-poetry.blogspot.com

తెలుగు'వాడి'ని said...

నాది కూడా హృదయ బృందావని గారి అభిప్రాయమే ... చివరి నాలుగు వాక్యాలలో అత్యధ్బుతమైన పదాల పొందిక ఒక చక్కని ముగింపునివ్వటమే కాక ... ఈ సైటు విడిచి వెళ్లిన తరువాత కూడా ఇంకా నాలుక కొసలపై ఆడుతూ,, మెదడులో తిరిగుతూ ఉండేలా చేసేవి ...

అభినందనలతో...

ఏకాంతపు దిలీప్ said...

చూసారా? మీ ఙ్ఞాపకాలలో ఎంతటి తాజాదనం ఉన్నదో... ఎంతటి తాజాదనం అంటే పచ్చని పంట పొలం అంత! అలాంటి చిన్ననాటి స్నేహాలకి విలువనిచ్చి పదిలంగ మనసులో దాచుకోగలిగినప్పుడే ఇలా భావాలు పొంగగలవు... ఉప్పొంగగలవు... మీ మంచి కవితకి నా ధన్యవాదాలు...

jags said...

@ రాధిక గారు,
"ఒక మనసు బాధ పడితే
చెమ్మగిల్లే కన్నులెన్నో....
ఒక పాదం తడబడితే
ఊతమిచ్చే చేతులెన్నో...."

స్నేహం గురించి ఇంత కంటే అందంగా చెప్పటం సాధ్యం కాదని చెప్పటం అతిశయోక్తి కాదేమో. సంక్రాంతి శుభాకాంక్షలు..

నిషిగంధ said...

ముగింపు బ్రహ్మాండంగా ఉంది రాధిక గారు.. మీ కవితతో నా స్నేహితులందరినీ తలుచుకునేలా చేశారు.. సంక్రాంతి శుభాకాంక్షలు :-)

విశ్వనాధ్ said...

రాధిక గారూ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
నేను కొద్దిగా పని వత్తిడిలో ఉండి బ్లాగుల జోలికి పోలేదు. నా గోదావరిలో మళ్ళీ టపాలు రాస్తాను. కొత్త బ్లాగు పేరు సంసృతిగా మార్చాను. అందులో మన సంసృతి,సాంప్రదాయక విషయాల టపాలు రాద్దామనుకొంటున్నాను.

crystal said...

Good One .. Nostalgia and Memory are curse in disguise some times ...

Anonymous said...

Hi Radhika garu munduga naa congrats. endukante matallo cheppaleni anubhootine nenu pondanu naku mee blog chaale baga nachchindi nenu bayataki cheppaleni bhavalu mee blog lo choosanu naku chinna help kavali plz nenu oka blog create cheddmmani anukuntunnau daniki meeru design chesi pettali plz, plz, plz madam. naagu999@gmail.com

Anonymous said...

ఎప్పుడూ Target లు, code review లు, Bug fixing లు, Good rating కోసం కష్టాలు. పొరపాటున దారి తప్పి ఇటొస్తే.......

తీయనైన బాల్య స్మృతులు,సుతిమెత్తని మధుర భావనలు... అన్నీ కళ్ళ ముందు తెరలు తెరలుగా కదిలి హృదయం బరువెక్కుతుంది.

ఎవరిదో పిలుపుతో మళ్లీ వర్తమానం లో పడితే.......

ఏదీ ఈ జీవితంలో ఆ సారూప్యత? ఏమయ్యాయి ఆ ఊహలు? ఏవీ ఆ స్పందనలు?... మనసు లో ఒకటే ఘర్షణ.

అయినా ఘర్షణ అంటే మారాలన్న కోరికకు సూచికే కదా! చూద్దాం ఆ మార్పు వచ్చేనేమో

Anonymous said...

మీ కవిత చదవటం మొదలు పెట్టినప్పుడు, నా మనస్సంతా ఆఖరి వ్యాఖ్యాలెలా ఉంటాయా అన్న ఆలోచనతో నిండిపోతుంది. ఎందుకంటే మీ కవితల్లో ముందు వ్యాఖ్యాలన్నీ చిరునవ్వుతో చనువు చేస్తాయి, ఆఖరు వ్యాఖ్యాలు మాత్రం కదం తొక్కి మనసుని మైమరిపిస్తాయి.

Ramani Rao said...

ఒక మనసు బాధపడితే
చెమ్మగిల్లే కన్నులెన్నో మరుక్షణంలో
ఒక పాదం తడబడితే
ఊతమిచ్చే చేతులెన్నో మా స్నేహంలో

చాల బాగుంది రాధిక గారు..మీ కవితలు భావావేశంలో వున్నప్పుడు చదివితే కల్లు చెమ్మగిల్లుతాయి... చక్కటి భావం బాష్యం తో వుంటాయి .. ఇంతకన్నా ఎలా చెప్పాలో తెలీదు నాకు పాదాలు చంధస్సులగురించి తెలీదు.. మాలాంటి సామాన్యులకి అర్ధమయ్యే రీతిలో వుంటుందని మాత్రం చెప్పగలను.

Ramani Rao said...

సారి.... కళ్ళు అని సరి చేసుకొని చదవ ప్రార్ధన ..

Rama Deepthi Muddu said...

"Egudu digudu rahadarullo- in the best and the bad times..
A tireless journey.. memorable moments..a hand always to hold..and a shoulder always to lean on.."
Every bit so true..so mesmerizing.
A real good one.
a nice pic too.
Happy new year radhika garu.

Anonymous said...

Hi

been a regular viewer of your blog. i have started a new site called www.supertelugu.com

It has news updated as they happen,
Games there always to entertain,
Radio makes you sit and relax,
Forums will make you think, other languages, reviews.it has some blogs also.

Please give me feedback about the site. my mail id is manoj546@gmail.com

Anonymous said...

i have seen your web page its interesting and informative.
I really like the content you provide in the web page.
But you can do more with your web page spice up your page, don't stop providing the simple page you can provide more features like forums, polls, CMS,contact forms and many more features.
Convert your blog "yourname.blogspot.com" to www.yourname.com completely free.
free Blog services provide only simple blogs but we can provide free website for you where you can provide multiple services or features rather than only simple blog.
Become proud owner of the own site and have your presence in the cyber space.
we provide you free website+ free web hosting + list of your choice of scripts like(blog scripts,CMS scripts, forums scripts and may scripts) all the above services are absolutely free.
The list of services we provide are

1. Complete free services no hidden cost
2. Free websites like www.YourName.com
3. Multiple free websites also provided
4. Free webspace of1000 Mb / 1 Gb
5. Unlimited email ids for your website like (info@yoursite.com, contact@yoursite.com)
6. PHP 4.x
7. MYSQL (Unlimited databases)
8. Unlimited Bandwidth
9. Hundreds of Free scripts to install in your website (like Blog scripts, Forum scripts and many CMS scripts)
10. We install extra scripts on request
11. Hundreds of free templates to select
12. Technical support by email

Please visit our website for more details www.HyperWebEnable.com and www.HyperWebEnable.com/freewebsite.php

Please contact us for more information.


Sincerely,

HyperWebEnable team
info@HyperWebEnable.com

Anonymous said...

"భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు.", అని అంటూనే "ఒక పాదం తడబడితే.." అని ముగించారుగా.

కాలువ ఒడ్డున బాల్యం గుర్తు చేసారు!

Subhash Chandra said...

చాలా బాగుంది!! మమ్మల్ని ఒక్కసారిగా బాల్యంలోకి తీసుకెళ్ళారు!!

pruthviraj said...

pruthvi_varma@yahoo.com
meerradigina naa email address.

Anonymous said...

తెలుగు బ్లాగులు వెతుకుతు ఉంటె మీ బ్లాగు కంటపడింది. మీ కవితలు చాల బావున్నాయి. నా పాత ఙాపకాలను గుర్తుచేశాయి. నమస్తే.

Tenneti said...

చక్కగా ఉన్నాయండి మీ కవితలు...
అందమైన పల్లెటూరుని కమ్మగా వర్నించారు...

మీ దయ వల్ల మల్లి మంచి తెలుగు కవితని చదవగలిగాను...

Rama Deepthi Muddu said...

hi radhikagaru... am trying for ur email id on line...dorakaledu.
can u give me ur email id?
or mail to joshmybench at yahoo dot co dot in
do u have an account in facebook?

Ramani Rao said...

చాలా థాంక్స్ రాధిక గారు నాతో ఏకీభవించినందుకు. నెవేదన బ్లాగ్ లో మీ వ్యాఖ్య చదివాను, పోటీ అయ్యేదాకా ఎందుకండీ? ఎవరి ప్రత్యేకత వారిది. పోటికోసం అని మనసులో పెట్టుకోకుండా మీరు కధ ప్రచురించండీ. పోటి కోసమా కధలు అని నాకనిపిస్తోంది..మీ కవితల్లాగే మీ కధకి కూడ మంచి ప్రాచుర్యం వుంటుందని నా మనసు చెప్తోంది మీ కవితలు చాలు కధ గురించి చెప్పడానికి. (ఒక్కమెతుకు చాలు అన్నము వుడికిందో లేదో చూడడానికి) మీ తెల్ల కాగితం కధ కోసం ఎదురు చూస్తూ... wish you all the best

kasturimuralikrishna said...

రాధిక గారు,పొద్దు లొ మిత్రుదు సొమ సంకర్ కథ పై మీ వ్యాఖ్య చూసాను.అలాగె మీ బ్లొగ్ చూసాను.మీ భావుకతకు జోహార్లు.కవితలకు తగ్గ చిత్రాలు ఎంచుకొవటంలొ మీ ప్రతిభ కనిపిస్తుంది.ఇంకా అనేక భావాత్మకమయిన కవితలు మీ బ్లొగ్ లొ చూస్తామని ఆశిస్తున్నను.

నిషిగంధ said...

రాధికా, మీ తర్వాతి కవిత కోసం చాలా ఎదురుచూస్తున్నాను.. ఇక మీ మనసుకు కాస్త పని కల్పించండి, ప్లీజ్ :)

Unknown said...

The last lines.. tht ended are gr8..!!

యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ said...

రాధిక గారూ..మీకు ధన్యవాదాలు..
ఎన్నో ఏళ్ళ క్రితం కలిసి.. మరలా అనుకోకుండా కనిపించిన ప్రియురాలిని చూసి సంభ్రమాశ్చర్యాలతో నోరు పెగలని పరిస్థితి..మొదటి చరణంలో..

ఎదురుగా కూర్చోని వున్నప్పుడు...ఎప్పటినుండో సలసల కాగుతున్న కన్నీళ్ళు..చప్పున చల్లారటం..అదీ ప్రియురాలి ముఖం కనపడదేమో అనే ఆవేదన..రెండవ చరణంలో..

వీడ్కోలు తీసుకుని వెళుతున్న క్షణాన్ని తెలిపేది ..మూడవ చరణంలో..


ఇకపొతే పల్లవి..'ఛలియా' అనే పాత హిందీ చిత్రం లోని..'జరా సామ్నేతో ఆవో ఛలియే..ఛుప్ ఛుప్ చల్నేమే క్యా రాజ్ హై.. యూం ఛుప్ నా సకేగా పర్ మాత్ మా..మేరీ ఆత్ మా కీ ఏ ఆవాజ్ హై.." అనే ట్యూన్ లో కూర్చబడినది..

పాట మీకు నచ్చినందుకు..మరొక్కసారి ధన్యవాదాలు..

-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.

http://yvs-yvs.blogspot.com/2008/03/blog-post_15.html

Rakiii said...

hi radhika garu!

పిల్లకాలువలో ప్రతిబింబాలు చూస్తూ
గట్టు మీది గడ్డి పూలు కోస్తూ
మైమరచిన క్షణాలు
అపార్ధాలు,అలుకలతో
మూతి ముడుచుకున్న వైనాలు


ee lines v.heart touching !
challa nachesindi naku ee post

satya said...

super andi, chala bagundi, naku kali samayam dorikanppudu alla na sweet memories na school days ni taluchukuntanu, meku chala mandi fans vunnattu vunnaru, byee...Satya

Jo said...

Hi Radhika,


Manchi kavitha chala bavundi.Keep going.

Anonymous said...

Inta baga kavitalu meeru ela raayagalugutaaru? mimmalni choosi baga eershya kalugutundi.

whenever I feel alone/sad I try to remember my childhood memories and feel happy.

అశోక్ పాపాయి said...

chala baga rasharu........chusharu meelo entha thelivithetalu vuaai ani meere nammalekapothunnaru

Unknown said...

Radhika garu,

Mee kavitalani ee madyane chadavatam modalupettanu.Andaroo Chala bagunnayani cheptunte anthakante minchina padalemunnaya ani vetukutunnanu , kaani naku doraktam ledu. Sneham meeda mee kavita chala bagundi. Madilo nidrapotunna jnapakalanu suti mettaga tatti nidraleputunnayi.

"ఒక మనసు బాధపడితే
చెమ్మగిల్లే కన్నులెన్నో మరుక్షణంలో
ఒక పాదం తడబడితే
ఊతమిచ్చే చేతులెన్నో మా స్నేహంలో"

Nijanga ituvanti snehitulu untara..? Naku kanapadarem...?

-Rambabu

Vasu said...

"ఒక మనసు బాధపడితే
చెమ్మగిల్లే కన్నులెన్నో"

భలే ఉంది