Saturday, March 22, 2008

ఒక రోజు


ఇంట్లో ఒంటరిగా వున్నాను.ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న క్షణాలివి.
ఎన్నెన్నో ఆలోచనలు అసంపూర్తిగా.ఒక ఆలోచనకు,మరొక ఆలోచనకు సంబంధంలేదు.అసలెంత బాగుందో ఇలా...సమయమే తెలియట్లేదు.
ఈ క్షణంలో ఎవరన్నా తోడుంటే ఇంకా బాగుండుననిపించింది.వెంటనే నువ్వే గుర్తొచ్చావు.అదేమిటో కోరుకున్న ఒంటరితనం దొరగ్గానే నువ్వు నాపక్కన వుంటే బాగుంటుందనిపిస్తుంది.నీకూ అలాగేవుంటుందికదూ!ఉంటుందని చెప్పవూ.
నాకోసం సమయం కావాలంటూ గోల చేసే నేను ఇప్పుడు ఏమి చేస్తున్నాను. పిచ్చిదానిలా నీ గురించి ఆలోచిస్తున్నాను.అసలు నీ జ్ఞాపకాల తోటలో విహరించడానికే నేను ఏకాంతం కోరుతాను కాబోలు.
సెల్ ఫోను మూగగా కొట్టుకొంటోంది నా గుండెలాగానే.ఏదో వినిపించాలనే ఆరాటందానిది.ఆలోచనలు కొనసాగించాలనే పోరాటం నాది.మనిషితో మాట్లాడాలనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులో కదా?మనసు భాషకు అడ్డులేదు,హద్దులేదు.
మళ్ళా ఎప్పుడో ఇలా తనివితీరా మాట్లాడడం?
నేస్తం
ఊసులన్నీ పోగేసి వుంచు.
ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను.

23 comments:

Veera Sekhar Kasu (వీర శేఖర్ కాసు) said...

mee kavitalani mottamodati saari choostunnaa... chaalaa baagunnayi. ilanti kavitalu wraayaalante manchi bhaavukatha kaavaali, hrudayam kaavaali. Good work. Keep it up.

yvs said...

మనం ప్రేమించే వాళ్ళు మన పరోక్షంలో..ఎప్పుడూ మనగురించే ఆలోచిస్తుంటారనే తియ్యని భావనే..ప్రేమంటే..

అన్నట్టు...మీ కవితలు చాలా బాగున్నాయి..
-----------------------------------

రాధిక గారూ..మీకు ధన్యవాదాలు..
ఎన్నో ఏళ్ళ క్రితం కలిసి.. మరలా అనుకోకుండా కనిపించిన ప్రియురాలిని చూసి సంభ్రమాశ్చర్యాలతో నోరు పెగలని పరిస్థితి..మొదటి చరణంలో..

ఎదురుగా కూర్చోని వున్నప్పుడు...ఎప్పటినుండో సలసల కాగుతున్న కన్నీళ్ళు..చప్పున చల్లారటం..అదీ ప్రియురాలి ముఖం కనపడదేమో అనే ఆవేదన..రెండవ చరణంలో..

వీడ్కోలు తీసుకుని వెళుతున్న క్షణాన్ని తెలిపేది ..మూడవ చరణంలో..


ఇకపొతే పల్లవి..'ఛలియా' అనే పాత హిందీ చిత్రం లోని..'జరా సామ్నేతో ఆవో ఛలియే..ఛుప్ ఛుప్ చల్నేమే క్యా రాజ్ హై.. యూం ఛుప్ నా సకేగా పర్ మాత్ మా..మేరీ ఆత్ మా కీ ఏ ఆవాజ్ హై.." అనే ట్యూన్ లో కూర్చబడినది..

పాట మీకు నచ్చినందుకు..మరొక్కసారి ధన్యవాదాలు..

-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.

http://yvs-yvs.blogspot.com

arunakiranalu said...

radhika garu
mee kavitha chala chala chala bavundi.. mee kavitha ku na feelings ku daggara ga vundi.. chusi wonder ayyanu.. chala bavundi

aruna

నిషిగంధ said...

సరైన ఫోటో జతచేయడంలో మీకు మీరే సాటి రాధికా!!
'ఊసులన్నీ పోగేసి ఉంచు..
ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను '
అవతలి వ్యక్తి ఏకాంతంలోనూ మనముంటామన్న భావన చాలా అందంగా ఉంది..
మీ టపా చదివాక మీ 'ఒక రోజు ' లాంటి రోజు కోసం మనసు మారాం చేస్తోంది :))

బుసాని పృథ్వీరాజు వర్మ said...

బావుంది.

బుసాని పృథ్వీరాజు వర్మ said...
This comment has been removed by the author.
Purnima said...

"కవిత చాల బాగుంది" అని మాత్రమే చెప్పి పోదాము అంటే మనసు కాదు అంటుంది. మీ మనసులోని ఊసులు దానికి బాగా నచ్చినట్టు ఉన్నాయి. ;-) నాకిష్టమైన వారు చెంతనుండగా మౌనంగా ఉండి, వారి ఊహల్లో విహరిస్తూ నాకు ఎన్నో కబుర్లు చెప్పే నా మనసు గురించే వ్రాశారని భ్రమింస్తుందెమో ఇప్పుడు. "కవిత నచ్చింది" అని ఇంకా చెప్పాలా??!! :-)

నువ్వుశెట్టి బ్రదర్స్ said...

"నేస్తం
ఊసులన్నీ పోగేసి వుంచు.
ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను." నాకెంతో నచ్చింది. మనగురించి ఆలోచించేవాళ్ళూ ఉన్నారని మనకి అనిపిస్తే ఆ మధురభావనే వేరు. మీరుండుండి విసిరే బాణాలు మనసుని తట్టిలేపుతున్నాయి.

Vijay Sattar said...

amandi radhika garu,
meeku munduga danyavadaalu
meere dinini telugulo convert chesukondi,asalu meeru nijanga pallatoori vara,
nijanga mee kavitalu choosanu chala rojula taruvatha mumbai lo telugu kavitalu chadivanu nenu

దీపు said...

@రాధిక
చదివేసరికి మనసు ఉక్కిరి బిక్కిరైపోయింది... మొదటి పదం నుండీ చివరి పదం వరకు గుండె పదానికోసారి ఆగి ఆగి కొట్టుకుంది... ఇప్పటికి చాలా సార్లు చదివేసాను.. ఈ అనుభూతి భలే ఉంది..

నిషీ గారితో ఏకీభవిస్తున్నాను... మీకు మీరే సాటి :-)

Jhani said...

Superb.. specailly the last line. "ఊసులన్నీ పోగేసి ఉంచు..
ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను" great poem.

ఒంటరి చుక్క(వెంకట్) said...

రాధిక గారు భాషమీద పట్టులేదంటూనే పట్టు దారాల్ని పరిచారు కదండి.

Subrahmanyam Mula said...

ఆఖరి వాక్యాల్లో కవిత్వం కనిపిస్తోంది. ముందు వాక్యాలు
అన్నీ వచనం. I have read your other poems also. You are trying to set up a base before going to the crux of the poem! please don't do that. కవిత్వం సూటిగా ఉండాలి. వివరణ పాలు తగ్గాలి. ఉదాహరణకి ఈ కవితలో మొదటి లైను నుండి, " పిచ్చిదానిలా నీ గురించే ఆలోచిస్తున్నాను" వరకు తొలగించండి. గమనించండి "సెల్ ఫోను మూగగా కొట్టుకుంటోంది నా గుండెలాగే" అనడంలోనే ఏకాంతం, విరహం ఇలా మీరు ఆవిష్కరించదల్చుకున్న మొత్తం దృశ్యం వచ్చేస్తుంది.

సెల్ ఫోను మూగగా కొట్టుకుంటోంది
నా గుండెలాగే
ఏదో వినిపించాలనే
ఆరాటం దానిది!

మనిషితో మాట్లాడేందుకు
ఎన్ని అడ్డంకులో కదా!
మళ్ళీ ఎప్పుడో
నీతో తనివితీరా మాట్లాడ్డం

నీ జ్ఞాపకాల తోటలో విహరించేందుకే
నేను ఏకాంతం కోరుకుంటాను కాబోలు
నేస్తం.. ఊసులన్నీ పోగేసి ఉంచు
ఏదో ఒకరోజు నీ ఏకాంతంలో జతచేరుతాను!

మీ కవితని తిరగ రాయడం నా ఉద్దేశం కాదు. ఇలాంటి ప్రయత్నాల వల్ల కవితా స్ఫూర్తి కూడా దెబ్బ తినవచ్చు.
But i just wanted you to think about this and take it as a guide line in your future poems. సాధ్యమైనంత సరళంగా సూటిగా రాయండి. GOOD LUCK!

నిషిగంధ said...

@సుబ్రమణ్యం, ఇది కవిత కాదనుకుంటా.. రాధిక గారు ఒకనాటి తన ఏకాంతాన్ని వ్యక్తీకరించినట్లున్నారు.. నేనైతే అలానే అనుకుని చదివాను.. మీరేమంటారు రాధికా?

రాధిక said...

అభిప్రాయాలు వెలిబుచ్చిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.సుబ్రహ్మణ్యం గారూ నిషిగారు చెప్పినట్టు ఇది కవిత కాదు.నేను రాసేవి కవితలు కాకపోయినా, నేను కవిత అనుకుంటే వాటిని విడగొట్టి రాస్తుంటాను.ఇది ఎక్కడా విడగొట్టకుండా పేరాగ్రాఫ్ లా రాసాను.కానీ మీరు దానికి చక్కని రూపుని ఇచ్చారు.మీలాంటి పెద్దల సూచనలు,సలహాలు తప్పక స్వీకరిస్తాను.మీరు నా బ్లాగుకి రావడమే అదృష్టం.
నిషి గారూ అసలు ముందు మీకు చెప్పాలి థాంక్స్.కవిత రాయమని ఒక కామెంటు పెట్టారుగా మీరు.ఏదోకటి రాద్దామని కుర్చుంటే అసలు ఏమీ తట్టలేదు.ఏవో కొన్ని ఐడియాలు వచ్చాయిగానీ రూపం ఇవ్వలేకపోయాను.ఇక ఇలా కాదు అని మీ "ఊసులాడే ఒక జాబిలి"లా ఏదన్నా రాసుకుందామని ఇలా మొదలు పెట్టాను.
అందునా మొన్న "పొద్దు"లో కవితాత్మక భావన ఏదయినా కవిత క్రిందే లెక్క అన్నారుగా అందుకే ఇలా.ఇందులో ఆ భావన ఎక్కడుందీ అని ఎవరయినా అంటారా?నేనూ కాదనను.:)

ramya said...

ఈ టపా నేను మిస్సయ్యాను,
~ఊసులన్నీ పోగేసి వుంచు.
ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను.~ అద్బుతంగా ఉంది రాధిక గారు.
ఈ మధ్య ఇటుకేసి రాక చాలా బ్లాగుల టపాలు మిస్సవుతున్నా!

Sridhar said...

ilanti shaililo meeru inkonni raayamani naa request

Anonymous said...

♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥

మస్త్ రాశావ్ పొ
నీ పేరు ఎమి? నాతొ ఫ్రెండ్ షిప్ చేస్తావా?

http://www.HappyDude.tk

♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥ ♥♥

Anonymous said...

ఇక్కడా తయారయ్యారా, Desparate D*cks
God save the te-blogs
:(

reddyjaya said...

Iam jaya reddy
రాదిక గారు!
చాలా చాలా బాగుంది.

Ammalu said...

రాధిక గారు
ఎలా వ్రాస్తార౦డి అలా. హ్రుదయానికి హత్తుకునేలా. మనసుని కదిపి కుదిపేసే భావ౦. మనస౦తా భారమైపోతో౦ది.నిజ౦ ఎవరినన్నా ప్రేమిస్తే ఎప్పుడూ వారి ధ్యాసే. అదే ప్రేమ కదా నేస్త౦...ఊసులన్నీ పోగేసి వుంచు. ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను. ఎ౦త చక్కని పదాలు. ఎ౦తో చక్కని అనుభూతి. నేను చెప్పాలనుకున్నవి మీరు చెప్తున్న ఫీలి౦గ్. ఎ౦త పొగిడినా తక్కువే. అ౦దుకే ఏమైనా చెప్పి తక్కువ చేయాలని లేదు. మనసులో అవ్యక్తమైన అనుభూతి. నేనెప్పుడూ బ్లాగ్ లు చూడలేదు. ఎక్కడా కామె౦ట్ చేయాలని అనుకోలేదు. నా మనసు నా నేస్తానికి ఎలా తెలియ చెప్పాలా అన్న ఆలోచనతో వెతుకుతున్న నాకు మీ (ఇది కవిత కాదేమో కదా) ఈ కవిత కనపడి౦ది. ఇ౦కా ఏదో వ్రాయాలన్న తపన మిగిలే ఉ౦ది, అలా వ్రాస్తే అది పెద్ద ఉత్తర౦ అవుతు౦దేమో అన్న భయ౦ తో ఆపేస్తున్నా.నా నేస్తానికి ఇ౦త చక్కగా తెలియబరిచాక నా గు౦డె ఆగి పోయినా చాలు అన్న ఆన౦ద౦. ఇలా వ్రాయొచ్చో లేదో కూడా నాకు తెలియదు.

Ammalu said...
This comment has been removed by the author.
నేను మీ నేస్తాన్ని said...

bagundi... mitramaa...

naa peru seshagiri