Tuesday, May 06, 2008

ప్రయాణం


చుక్కల దారిలో
ఊహల పల్లకి లో
మెత్తని ప్రయాణం


తారల నవ్వులలో
తరగని లెక్కలతో
తరిగిపోతున్న దూరం


గెలుపులేని ఆటలో
అలుపుతెలియని ఆనందం


మూతపడుతున్న రెప్పల వెనుక
మేలుకొంటున్న లోకంలో
నన్ను చేరుతూ
నేను కోరిన ఒక తారక


దీపుగారి http://ekantham.blogspot.com/2008_03_01_archive.html ప్రేరణతో

29 comments:

Bolloju Baba said...

మీరు దేన్ని సింబలైజ్ చెయ్యాలనుకున్నారో అర్ధంకాలేదు
బొల్లోజు బాబా

ఏకాంతపు దిలీప్ said...

@రాధిక గారు

ఒక ప్రియుని ఊహాలోకంలో ప్రేయసి కోసం చేసే అలుపెరుగని ప్రయాణాన్ని చక్కని కవితలా రాసారు... నేను చాలా మాటల్లో చెప్పడానికి ప్రయత్నించిందాన్ని మీరు చిన్న కవితలొ చెప్పేసారు... ఆ వర్ణన కన్నా మీ కవితే బాగుంది... :-) మీ నుంచి ఏదొకటి నేర్చుకుంటూనే ఉన్నాను... నాకు చాలా సంతోషంగా ఉంది...

నిషిగంధ said...

'గెలుపు లేని ఆటలో
అలుపు తెలియని ఆనందం'
చిన్న చిన్న మాటల్లో ఎంత చక్కటి భావాన్ని చెప్పారో!
కవితలోని క్లుప్తత బాగా నచ్చింది!

సుజాత వేల్పూరి said...

nice

Bolloju Baba said...

నా ఆక్షేపణ కు సమాధానం ఇస్తారని ఎదురుచూసాను.
ఈ కవితను
మనోలోకంలో ప్రయాణమనుకుంటే మెత్తని ప్రయాణం అనే పదం చాలా బాగుంది.

మరి ఈ తరగని లెక్కలు అంటే ఏమిటి?

గెలుపేలేని ఆట అనే ప్రయోగం సాధారణంగా సెక్స్ ను సింబలైజ్ చెయ్యటానికి వాదతారు.
ఆ వాక్యం కవితలో మిస్ ఫిట్/మిస్ ప్లేస్ అయినట్లు లేదా?
ఎందుకంటే కవిత చివరలో మూతపడుతున్న రెప్పల వెనుక మేలుకుంటున్న మనోప్రపంచపు లోకంలోకి తారక వచ్చిందని ముగించారు.

ఆ రెండు వాక్యాలు చివరలో ఉంటే బాగుంటుందేమో!

మొత్తంమీద ఇది చాలా మంచి కవిత. బహుసా ఈ కవిత నుంచి ఎదో సింబాలిజం ను ఆశించటం పొరపాటవుతుందేమో?

యధాతధంగా ఈ కవితను చదువుకుంటే చాలా సరళంగా, అరటిపండు వలచిపెట్టినట్లు గా ఉంది.
నాకొచ్చిన చిక్కల్లా మీకు లాంటి చెయ్యితిరిగిన కవి నుండి ఒక సరళమైన కవితను స్వీకరించటానికి మనసొప్పుకోవటంలేదు.

బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/

Anonymous said...

nice...naa kavitaki kuda prayanam ani peru pettanu....kaani mee prayanam super....
'గెలుపు లేని ఆటలో
అలుపు తెలియని ఆనందం'
really superb!

రాధిక said...

బాబాగారూ ఆలస్యానికి మన్నించాలి.వివరణలు ఇక్కడ కాకుండా మీ మైల్ ఐడీ కి రాద్దామనుకుని అలా ఆలస్యం చేసేసాను.మరీ ఇంత దారుణమయిన అర్ధం వస్తుందని నేను అనుకోలేదు.అందుకే వివరణ ఇక్కడే ఇస్తున్నాను.
బస్సులోనో,మరెక్కడో ప్రయాణిస్తుంటే ఆకాశంలో చుక్కలు,మదిలో ఊహలు....వాటితో చుక్కలదారిలోనే ప్రయాణం చేస్తున్న భావనలో మెత్తగా ప్రయాణం సాగిపోతుందన్న అర్ధంలో రాసాను.
తరగని లెక్కలతో
తరిగిపోతున్న దూరం
ఆ చుక్కలని చూడడంతోనూ,వాటి లెక్కలతోనూ నాకు సమయం గడిచిపోతుంది.నేను వెళ్ళాల్సిన దూరం తెలియకుండానే తరిగిపోతుందని చెప్పాలనుకున్నాను.
గెలుపులేని ఆట అంటే నా ఉద్దేశ్యం,చుక్కలని లెక్కపెడుతున్న ఆట.ఈ ఆటలో ఎప్పుడూ గెలుపు ఉండదు.అయినా లెక్కపెట్టడం నాకు ఆనందం.అదే అక్కడ చెప్పాను.
మూతపడుతున్న రెప్పల వెనుక
మేలుకొంటున్న లోకం అంటే స్వప్నం లో అని నా ఉద్దేశ్యం.
ఆ కలలో ఆకాశంలో నాకు నచ్చిన ఒక తారక నన్ను చేరుకుంటుంది.నిజంలో పొందలేనివి అన్నీ కలల్లోనేగా దొరికేవి.
ఇక ఇంకో కోనంలో చూస్తే ప్రకృతిని ఆనందించాకా కలిగే ఆనందం తరువాత మనకి చాలా ఇష్టమయినవాళ్ళు గుర్తొస్తారు.అలా తరువాత నిద్రలో అతని ప్రేయసి చేరువయిందని కూడా అర్ధం వస్తుంది.అది చదివేవారి ని బట్టి ఉంటుంది.పైన దీపుగారు అదే చెప్పారు.
చాలా సరళమయిన ,తేలికగా అర్ధమయ్యేలా రాసాను అనుకున్నాను.కానీ చెప్పలేకపోయాను.నా తప్పే.క్షమించండి.నాకు ఇంతకు మించి రాయడం రాదండి.నా జ్ఞానం ఇంతవరకే.నేను చేయి తిరిగిన రచయితని కాదండి.మీ అభిమానానికి కృతజ్ఞురాలిని.

Kathi Mahesh Kumar said...

రాధిక గారు,అలిబాబా చెప్పిన అర్థం అంత "దారుణం" కాదులెండి. మీ కవితను వారు తన interpretation తో ఇంకో స్థాయికి తీసుకెళ్ళారు. దీపు గారు అంతర్లీనంగా చెప్పినా, వారి అర్థంకూడా అదే.
"మూతపడుతున్న రెప్పల వెనుక
మేలుకొంటున్న లోకంలో" కూడా ‘తమకానికి’ సూచనార్థకం."తారక..చేరడం", ‘ఫలదీకరణకు’చిహ్నం.

అందుకే అంటారు "reader is an author in his own right" అని.

రాధిక said...

మహేష్ కుమార్ గారూ బాబాగారు చెప్పింది దారుణమని కాదు నా ఉద్దేశ్యం.నేనసలు ఆ కోణం లో రాయలేదు.కానీ వాక్యాలన్నీ ఆ కోణాన్నీ స్పృశిస్తున్నాయని తెలిసేసరికి కొద్దిగా షాకులో ఉన్నాను.నేనేదో ప్రకృతి ఆరాధనలో తేలుతుంటే అది కాస్తా రొమాంటిగ్గా అయిపోయింది.శ్లేష పదాలు విన్నాను కానీ నాకు తెలియకుండా నేనే శ్లేష కవితలు రాసేస్తున్నానా?

నిషిగంధ said...

రాధికా, బాబా గారి వివరణ పరంగా అయితే మీ కవితా సామర్ధ్యం బోల్డంత పెరిగినట్లే!! ఒక్క వాక్యానికి రెండు మూడు విభిన్నమైన భావాలు (అవీ హత్తుకునేవి) స్ఫురించగలిగేట్లు చేయగలిగారూ అంటే మీరు కవయిత్రిగా ఇంకో మెట్టు ఎక్కినట్లే!
please take it as a complement.. ఇకనించీ మన రాధిక కదా స్ట్రైట్ గానే రాసి ఉంటారు అనుకోకుండా ఆలోచనలకి పదును పెట్టే ఇలాంటి కవితలు మీ నించి మరెన్నో రావాలి :-)

Bolloju Baba said...

రాధిక గారికి
మీ కవితను శల్య పరీక్షకు గురిచేయాలన్నది నాఉద్దేశ్యం కాదు. చాలా మంచి కవిత ఇది. నిషిగంధ గారన్నట్లు చాలా డెప్త్ ఉన్నటువంటి కవిత.
ఏదైనా ఒక కవితను వ్రాసేసిన కొద్ది నెలల తరువాత మళ్లీ చదువుకుంటుంటే మనమే వ్రాసామా అనిపించేట్టు కొత్త కొత్త అర్ధాలు స్ఫురిస్తూ ఉంటాయి. అది ఆయా కవితల సామర్ధ్యం అంతే. అలాగే మీ కవిత కూడా.

మీ షాక్ కు నేను కారణమైతే క్షంతవ్యుడను. ఈ వివరణలు మీ కవితలోని భిన్న కోణాలను ఆవిష్కరించాయని నిషిగంధ గారు చెప్పినట్లు గా ఈ విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటారని ఆశిస్తున్నాను.

ఒక వేళ ఇంకా నామీద కోపం ఉంటే నాబ్లాగులోని ఏదైనా కవితను చీల్చి చెండాడి మీ కసి తీర్చుకోండి (జస్ట్ కిడ్డింగ్).
బొల్లోజు బాబా

పి.స్. బాబా గారు తన ఇంటర్ప్రెటేషను తో మీకవితను మరోస్థాయికి తీసుకువెళ్లారు, అని వ్యాఖ్యానించి, సమర్ధించిన మహేష్ గారికి కృతజ్ఞతలు.

Rama Deepthi Muddu said...

everyone liked the lines" gelupuleni aata lo aluputeliyani aanandam"..and so did I...
nice one. i had a draft in my blog too which is in same lines as this one..i guess i have to drop it as i see so many expert pieces here!

రాధిక said...

బాబా గారు అంత పెద్దమాటలెందుకులెండి.మీరు నా కవిత స్థాయిని పెంచారు.కవితలోని విభిన్న కోణాలు చూపారు.అందుకు మీకు సదా ధన్యవాదాలు తెలుపుకుంటాను.మీరు చెప్పినదానిని నేను పాజిటివ్ గానే తీసుకున్నానండి.మీరిలాగే నా కవితలను ప్రోత్సహిస్తారని,మీ అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తున్నాను.
నిషి గారు,సుజాతగారూ,జోష్ దీప్తి గారు,మహేష్ గారూ అందరికీ ధన్యవాదాలు.దీప్తిగారూ మీరు తప్పక త్వరగా పోస్ట్ చెయ్యాలి.మీ కోణం కూడా తెలుసుకోవాలని ఉంది.

మురళీ కృష్ణ said...

'గెలుపు లేని ఆటలో
అలుపు తెలియని ఆనందం'

ఆహా(, గెలుపుతో సంబంధం లేకుండా ఆడుకుంటూ పోవటమే ... ఎంత హాయిగా ఉందండీ మీ భావన. హ్యట్సప్!!!

నిజానికి, 'గీత ' లో క్రిష్ణుడు చెప్పిందీ ఇదేనేమో...

( ఇక అందరి అభిప్రాయాలు చదివిన తరువాత...)
బాబా సార్ మీ కామెంట్ చదివి ఒక్కసారిగా షాక్ అయ్యాను. రాధిక గారు ఎలా రియాక్ట్ అయ్యరో అని అనిపించింది. మళ్ళీ అందరూ పాజిటివ్ గా తీసుకున్నందుకు సంతోషించాను.
మరి నాకైతే "జీవితాన్నే 'గెలుపు లేని ఆట ' గా ఆడేద్దాం" అని అనిపిస్తోంది. అప్పుడు సూపర్ గా ఉంటుంది కదూ. మీరేమంటారు??

Anonymous said...

మీకెవరో ప్రేరణిచ్చారనిజెప్పి ఇంత మంచి కవిత వ్రాసేస్తారా? :)అందులో కోణాలు, వృత్తాలూ పక్కనబెడితే సరళమైన పదాలతో ఓ చక్కని కవితని అందించారు మీరు రాధిక గారు.

సుజాత వేల్పూరి said...

రాధిక గారు,
మీ కవిత చదివి నేను మా పెళ్ళికి ముందు పెద్ద వాళ్ల పరీక్షల వల్ల చెరో చోటా ఉంటూ, కలుసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నప్పటి రోజులు గుర్తుచేసుకుని పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను!ఇప్పుడేమొ ఇదొక శ్రుంగార ప్రబంధమై కూచుంది. కానీ ఇప్పుడు మళ్ళీ చదివినా నేను 'అలా' అర్థం చేసుకోలేక పోతున్నాను.వూహల పల్లకిలో ప్రయాణించడం అందరికీ ఎప్పుడొ ఒకప్పుడు అనుభవమవుతుందనుకుంటాను.

pavan said...

for the first time in my life i just thoguht of love,u r gr8 mam i really say thank yo

మేధ said...

చాలా బావుంది.. చిన్న చిన్న మాటలతో, చాల బాగా వ్రాశారు... Simply superb :)

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Aditya said...

రాధిక గారు,

"గెలుపు లేని ఆటలొ అలుపు తెలియని ఆనందం"

పంచ్ డైలాగ్ లు అని ఈ మధ్యన అంటున్నారు,అలాగే మీ కవిత కూడా మంచి పంచ్ ఇచ్హింది.

మీకు నా శుభాకాంక్షలు


బుజ్జి.

పావనీలత (Pavani Latha) said...

బావుంది ...

Anonymous said...

sodari . navvutoo brathakaaliraa anE naa bkog choosi meeru pampina samdEsam ardham kaaledu choosinamduku thanks.

Anonymous said...

ఋఅధిక గారూ,
యధావిధిగా కవిత చాలా బాగుంది. మీకు ప్రేరణ కల్పించిన దీపు గారికి కృతజ్ఞతలు.

కవితంటూ రాశాక ఒక వర్ణ చిత్రంలాగే అదీ ఒక్కొక్కరికీ ఒక్కోలా అర్థం అవుతుంది. అయితే అందులోని అర్థాన్ని పాఠకులనే రకరకాలుగా చర్చించుకోనీయండి. మీరు తొందరపడి మీ భాష్యాన్ని చెప్పేస్తే దానికున్న వివిదార్థాలకి, భావాలకి మీరు దారులు మూసేస్తున్నారు.

మీరు కవిత రాయడానికి ప్రేరణ ఏదయినా కానీయండి. మీరు మీ మనసులో దేన్ని ప్రతిష్టించుకొనైనా కవిత రాయండి. అయితే పాఠకుడికి ఆ ప్రేరణ అవసరం కాకూడదు అని నా అభిప్రాయం. కవిత చదువుతూ వుంటే పాఠకుడికి తనదైన వూహ, అర్థం తన మనసులో వుధ్భవించాలి. అలా గాక మీలో వున్నదే పాఠకుడిలోనూ ప్రవేశపెట్టడానికి ప్రయత్నించడం కవిత యొక్క వుద్దేశ్యాన్ని తగ్గిస్తుందేమొ.

--ప్రసాద్
http://blog.charasala.com

Anonymous said...

రాధిక గారూ,
పై నా వాఖ్యలో మీ పేరు అక్షరక్రమంలో దొర్లిన తప్పుకు క్షమించండి.

--ప్రసాద్
http://blog.charasala.com

సుధాకర బాబు said...

12 లైనులు, 28 మాటలు ఉన్న కవితకు పాతిక వ్యాఖ్యలు! ఎందుకంటే మీ కవితలో ఉన్న పదాలు ఉయ్యాలలో ఊగిస్తున్నంత పొందికగా ఉన్నాయి. మూడు సార్లు చదివితే కంఠతా వచ్చే లయ ఉంది. అభినందనలు.

Anonymous said...

chalabaga rasaru..mee laantivalla inspiration tho nenu oka blog start chesanu (www.nisarga.sosblog.com),choosi mee abiprayani chebutharu kadu..

Anil Dasari said...

శృంగారమనేది 'గెలుపులేని ఆట' కాదు, 'భాగస్వాములిద్దరూ గెలిచే ఆట'. మరో రకంగా చెప్పాలంటే ఇద్దరూ ఓడిపోని ఆట. రాధికగారు రాసింది దానికి పూర్తి వ్యతిరేకార్ధంలో.

'మూతపడుతున్న రెప్పలవెనుక మేలుకొంటున్న లోకం' అంటే సాధారణ పాఠకులు నిద్రలో కనే కల అనే అనుకుంటారు కానీ తమకం అని కాదు.

తెలుగు సినిమాల దెబ్బకో ఏమో, 'చెయ్యి', 'వెయ్యి' లాంటి మామూలు మాటలనుండి కూడా శ్లేషార్ధాలే తీసే కాలమొచ్చింది.

MURALI said...

Chala bagundi radhika garu.

http://muralidharnamala.wordpress.com/

patnaik said...

hi radhika garu meeru rasina ee kavitha nalokam nunchi verelokam loki thisuku veluthundi anta higaani pichidi