రేపటి కానుక
నిజాన్ని అద్దంలోంచి చూస్తూ
అబద్దంలో
హాయిగా తిరిగేస్తున్నాం
ఆకలి కేకలు వింటూ
అయ్యోపాపమంటూ
నిట్టూర్చి వదిలేస్తున్నాం
సుఖాన్ని పెంచుకుని
సంతోషాన్ని కుదించుకుని
మరమనుషుల్లా మిగిలిపోతున్నాం
విలువమారే కాగితాన్ని చూపిస్తూ
మాకేం తక్కువంటూ
ఎదురు ప్రశ్నలు వేస్తున్నాం
ఎంతో విజ్ఞానం సంపాదించి
అంతటి విశ్వాన్ని చేధించి
పచ్చటి దారిలో ముళ్ళ తివాచీలేస్తున్నాం
రేపటి తరానికి ఎడారుల్ని కానుకిస్తున్నాం
32 comments:
విలువమారే కాగితాన్ని చూపిస్తూ
మాకేం తక్కువంటూ
ఎదురు ప్రశ్నలు వేస్తున్నాం..
చాలా బాగుంది.
మొదటి భావమూ బాగుంది. అద్దం అనటంలో మీ ఉద్దేశ్యం ఏమిటి? (సరిగా కనపడని అద్దమనేనా) నేనైతే అదే అనుకున్నాను.
రాధికా, మీ కవిత చదవగానే చాలా ఆవేశం వచ్చేసింది.. ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేసేసి 'నేను సుఖంగా కాదు సంతోషంగా ఉన్నాను ' అని మనసుకి చెప్పాలనిపిస్తుంది :)) మీరు రాసినవన్నీ అక్షర సత్యాలు!! మీ కవితకీ, ఆ ఫోటో కీ అంత చక్కగా ఎలా జతకుదురుతుందండీ బాబూ :))
రాధికగారూ, మొదటి వ్యాఖ్యని దయచేసి తొలిగించంది. అది spam వ్యాఖ్య. దాని మీద నొక్కితే, మీ కంప్యూటర్ కి వైరస్ సోకింది అంటూ నానారకాల కిటికీలు తెరిచింది.
ఇహ పద్యం .. గురించి .. మీరు మరీ సాఫ్టు .. దీన్నింకా పదునుగా బలంగా రాయచ్చు. కసిలో కూడ బేలతనమైతే యెట్లా?
:))నేను మీకవితలు అట్టే చదవలేదు కానీ ఇది చూస్తే మాత్రం మీస్వరం మారినట్టనిపిస్తోంది మదురోహలనుండి మరో లోకంలో అడుగు పెట్టినట్టు. తీరిగ్గా చూడాలి మీరచనలన్నీ.
వికటకవిగారూ అద్దం అంటే టీవీ అద్దం,ఆఫీసు గది అద్దం,కారు అద్దం .....అన్న అర్ధాలలో వాడాను.అసలు లోకం అంతా ఈ అద్దాలకు బయటే వుంది.మనల్ని మనం అద్దాలగదిలో బిగించుకుని, లోకం నుండి వేరుపడి,కొత్తగా అబద్దపు జీవితానికి పునాదులు వేసుకుంటున్నామని నా ఉద్దేశ్యం.సరిగా చెప్పలేకపోయాను.[ఇప్పుడు కూడా చెప్పలేకపొయినట్టున్నాను]
నిషిగంధ గారు అక్షరాలతో ఎటూ ఆకట్టుకోలేను అని ఇలా గీతలను ఆశ్రయిస్తూ వుంటాను.మీరు నా ప్రతీ కవితలోని బొమ్మకూ పొగడ్తలు రాలుస్తున్నారు.మీ అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నానండి:)
ఈ కొత్త గారు ఎవరూ?మా కొత్తపాళీ గారా?నేను ఇప్పుడే బయటనుండి వచ్చానండి.అప్పటికే మీ అందరి కామెంట్లూ వున్నాయి.ఆ స్పాం కామెంటుని తొలగించానండి.మీ సూచనను అనుసరించి ఘాటుగా,కసిగా ఒక కవిత ప్రయత్నిస్తాను.
మాలతి గారూ మీరాకతో నా బ్లాగు తరించింది.ఇప్పటికీ నా కలం అటువైపే పరుగులుపెడుతుంది కానీ అప్పుడప్పుడు ఇలా అసహనాన్ని కూడా వెళ్ళగక్కుతుంటానండి.వీలు చూసుకుని చదివాకా,మరొక్క 2 నిమిషాలు వెచ్చించి దయచేసి నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని నాకొక ఉత్తరంలో చెప్పండి.
అందరికీ ధన్యవాదాలు
సమస్య గురించి ఒక కవిత రాస్తున్నాం..
పరిష్కారం మర్చిపోతున్నాం..
ఈ భాదలన్నీ ఎవరివో..
కవిత రాసిన వారికి సంతోషం..
పడె వాడికవి ఇక్కట్లు ..
కవిత చదివెవాడు చప్పట్లు...
చాల మంచి కవిత వ్రాసారు..
నేను కూడ చప్పట్లు కొట్టా ..
అవునండీ కొత్తను నేనే :-)
కదిలేది కదిలించేది -
"సుఖాన్ని పెంచుకుని
సంతోషాన్ని కుదించుకుని
మరమనుషుల్లా మిగిలిపోతున్నాం"
ఏమిటి ఎర్ర ఝెండా పట్టుకుంటున్నారా?
కవిత చదివిన తరువాత కూడా అంతే!
ఆయ్యో అనుకుంటాం, మళ్ళీ మామూలే
తరించింది!! హా.
నేను మీకవితలు చదువుతుంటానండీ. నాకు కవితలగురించి అట్టే తెలీదు. మీ మిత్రబృందం వయసు కాదు కనక వాళ్లలా స్పందించలేను. ఏంరాయాలో తెలీదు. అంతే.
అయినా మీఅభిమానికి సంతోషం.
ఎప్పటిలానే చాలా బాగుందండి
viluva mare kagitanni choopistu..makem takkuvantu,eduru prasnalu vestunnam!!
awesome.. very well written..
really appreciable phrases..
nice theme.. the concept was balanced thru out..
any particular reason( enduku intha avesam??!!) behind this theme? as someone already commented.. the flow was so smooth that the strong point was delivered in a very casual way.. i liked it.
పెన్ను మారితే దస్తూరీ మారినట్లు
ఏదో ఆవేశం మీలోచేరి
సృజనను మారుస్తున్న సందర్భానికి
అభినందనలు
"సుఖాన్ని పెంచుకుని
సంతోషాన్ని కుదించుకుని
మరమనుషుల్లా మిగిలిపోతున్నాం
విలువమారే కాగితాన్ని చూపిస్తూ
మాకేం తక్కువంటూ
ఎదురు ప్రశ్నలు వేస్తున్నాం"
hats off... మీకు మరల చెప్తున్నాను... పూర్తిగా రచనల్లోకి దిగండి... ఒక ఐదేళ్ళల్లో సమకాలీన రచయితల్లో పేరుపొందివాళ్ళల్లో మీరు ఉంటారు...
బాగుంది రాధిక గారూ...
తేలికైన పదాలతో చాలా సున్నితంగా రాసే మీ కవితలలో ఇంకొక కొత్త కోణం...
ఈ కత్తికి రెండు వైపులా పదునేనన్నమాట
hi radhikaji
thank you
ur hobbies,tastes and poems are very pretty and sensitive and touching.
keep it up.
srinu.
ఆహ! మీ బ్లాగ్ చాలా అందమైన స్మృతులను గుర్తు చేసింది! థాంక్స్!! రాస్తూనే ఉండండి. మీ అనుమతి తో మీ బ్లాగ్ ని నా లింకుల జాబితా లో పెట్ట వచ్చునా? మీ స్వాగాతానికి మరొక థాంక్స్!
మీ బ్లాగ్ కు లింకేనండి!
రాధిక గారు కవిత బాగుంది అండి ... చాలా బాగా అర్దం చెపారు..
రాధిక గారు
అద్దం గురించి మీ వివరణ చూసాక ఆ వ్యాక్యం వెనుక డెప్త్ అర్ధమై అబ్బురపడ్డాను. మీ కవిత చాలా చక్కని అలతి అలతి మాటలతో కూర్చిన జీవన సత్యాలు.
డబ్బు, ఆకలి, నాగరికత కుమ్మరించిన యాంత్రికత , ప్రకృతిల గురింఛి అంత చిన్న చిన్న పదాలతో లోతైన భావాలను పలికించటం వండర్ ఫుల్
బొల్లోజు బాబా
థాంక్స్! ఎండావకాయ భలే ఉంటుందన్దోయి! ఏమీ లేదు, ఊరబెట్టే బదులు ఎండబెట్టడమే! పూర్తి గా విధానం కావాలంటే మామ్మగారిని అడిగి చెప్తా!
మాతా, మీ ఆజ్ఞను శిరసా వహించితిని!వర్డ్ వెరిఫికేషన్ తీసి వేసితిని!! నమో నమః!!!
:)
రాధిక గారూ,
మళ్ళీ జూలు విదిల్చిరన్నమాట! మీ కవితలు చదువుతుంటే నా వయసు పదిహేనేళ్ళు తగ్గుతుందెందుకో!
ఏడాది క్రితం నేను మీకీ సూచన చేశాననుకుంటా, ఒక్కసారి ఇలాంటి స్పందనలమీదా రాయమని. చాలా బాగా వుంది అంటే తక్కువ చేసి నట్లవుతుందేమొ!
"నిజాన్ని అద్దంలోంచి చూస్తూ
అబద్దంలో
హాయిగా తిరిగేస్తున్నాం"
అన్నదానికి వాఖ్యల్లో మీరు మీ భావాన్ని వివరించకపోయివుంటే బావుండేది. ఎందుకంటే మీ వాఖ్య చదవకముందు వున్న నా అర్థాన్ని అనుభూతిని మీ వాఖ్య తక్కువచేసింది.
ఇక అన్ని కామెంట్లలోకి lucky చేసిన వాఖ్య నన్ను మరింత ఆలోచింపజేసింది.
"సమస్య గురించి ఒక కవిత రాస్తున్నాం..
పరిష్కారం మర్చిపోతున్నాం..
ఈ భాదలన్నీ ఎవరివో..
కవిత రాసిన వారికి సంతోషం..
పడె వాడికవి ఇక్కట్లు ..
కవిత చదివెవాడు చప్పట్లు..."
అయితే ఇది చప్పట్లకోసమే రాసిందైతే భాధపడాలి గానీ, మీరు రాసిన ఏ కవితా చప్పట్లకోసం గాక మీ స్పందనను అక్షరబద్దం చేయడం కోసమే చేస్తున్నారనుకుంటాను.
ఎంత సమాధాన పెట్టుకున్నా మీ కవితా, ఈ వాఖ్య రెండూ కూడా గుందెను తాకుతున్నాయి.
--ప్రసాద్
http://blog.charasala.com
radhika garu mee sahitee pravahamlo kottukonipothunnamu.krutgnatalu.
మీ కానుక అందుకోవటం ఆలస్యమైంది.
"ఆకలి కేకలు వింటూ
అయ్యోపాపమంటూ
నిట్టూర్చి వదిలేస్తున్నాం"
అన్నది చాలా బాగుంది. ఆలోచనలో పడేసింది.
"ఆకలి కేకలు వింటూ
అయ్యోపాపమంటూ
నిట్టూర్చి వదిలేస్తున్నాం"-ఇది చాలా బావుంది నువ్వుసెట్టి గారనట్టు అలోచనలలో పడేసింది. నేను మీ కవితలకు కామెంట్లు నేను రాయలేను, అద్బుతంగా ఉంటాయి మీ కవితలు
@రాధిక్:కూడలిలో అశ్విన్ కామెంట్ చూసి ఇటుగా వచ్చి తొలిసారిగా ఈ కవిత చదివాను.
"అద్దం నుంచీ చూడడం" గురించి కాస్త లోతుగా ఆలోచిస్తే, that looks like a symbol of an opinionated mind. మనం ప్రపంచాన్ని చూసేది తెలుసుకోవడానికి,అర్థం చేసుకోవడానికి. కానీ, మన pre-conditioned మెదడు, విలువల ‘అద్దం’ ద్వారా నిజాన్ని చూపించి ఒక అభిప్రాయాన్ని (judgment) మాత్రమే స్ఫురించేలా చేస్తుంది,‘సత్యాన్ని’కాదు.
ఈ పరిణామంలో మనిషి ‘జీవిత సత్యాన్ని’ గ్రహించక, తనకు తెలిసిన impressions అనే అబద్దంలో చాలా convenient బతికేస్తాడు.అందుకే, we have more of opinion than truth.We have relationship with image of people around us, than actual individuals.
చాలా లోతైన విషయాలు మీరు చెప్పేసి, తరువాత చెప్పలేకపోతున్నాను అనడం మీ కవితాహృదయానికి చిహ్నం. మామూలు భాషలో చెప్పడానికి పేజీలు పేజీలు రాయాల్సిన వాటిని భావగర్భితంగా చెప్పడమే కవిత్వం. అదే మీరు చేస్తున్నారు.
వావ్...!
రధిక అదిరింధి పొ, చాల బాగ రాసవ్ కవిత్వం. చాల రొజుల తరువత ఒక మంచి బ్లొగ్ చూస. నీ కవిత్వం చదివితె చాల రిలీఫ్ గ వుంధి. ఈ లాగె రస్థా వుందు.
Happy Blogging
chala bavundandi...
kalamulenni padalu nerchina...
kavulu yenni baavalu palikina..
theeradhu ye karuvu...
aagadhu ye kanneru...
anni prayatnalu namamatrame..
kani mana prayatnamu oka thodai..
voka needai a karuvu dahhani..
theerachakapoyina nenunanani hami ivvali...
మీ కవత గురించి చెప్పాలి అంటే నాకు మాటలు రావడం లేదు రాదిక గారు....
Post a Comment