Thursday, October 30, 2008

గాయపడిన నమ్మకాలు


నావని గర్వం గా చెప్పుకున్నవి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......


తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...


గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను


ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి

54 comments:

sujji said...

అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను
hmm..touching!!

Chetana said...

" అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను "
Been there... its weird feeling..

Niranjan Pulipati said...

Very nice..

వర్మ said...

Excellent ....

రాధిక said...

బాగుంది రాధికా!

Purnima said...

Good one!

laxmi said...

Touched my heart!!!

ప్రతాప్ said...

Nice one

శ్రీవిద్య said...

chaalaa baavundandee..!

రమణి said...

అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను

ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి..

Excellent ....

Pappu said...

తప్పదు మరి..అలవాటయిన చోట అపరిచితులు అంటే గుర్తొచ్చింది..మా వూళ్ళో ఇల్లు అమ్మేసారు(అనాతవరం.తూ.గో..జి లో) అందరమూ ఉద్యోగ రీత్యానో, చదువులకోసమో విశాఖపట్నం వచ్చెయ్యగానే...తర్వాత అప్పుడప్పుడు సెలవల్లో మా వూరు సరదాగా వెళ్ళినప్పుడు మా ఇల్లు(అనలేము కదా అమ్మేసాక)చూస్తుంటే నిజంగానే "అలవాటయిన చోట అపరిచితుడి" లాగానే ఉండాల్సి వచ్చింది...అప్పుడే అనుకున్నా మళ్ళీ ఎప్పటికయినా ఆ ఇల్లు కొనుక్కోవాలని...చూడాలి..

మేధ said...

gud one...

సుజాత said...

అలవాటైన చోట అపరిచితురాలిలా నిలుచున్నాను......ఇదే నచ్చింది నాక్కూడా.!

Anonymous said...

అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను - అద్భుతం.

ఏకాంతపు దిలీప్ said...

మొన్న ఒక పెద్దాయనతో గాయపడిన నమ్మకం గురించి మాట్లాడాను... ఒక కుటుంబంలో ఇంకో వ్యక్తి మీద ఎప్పుడు కోపం వస్తుందో మాట్లాడుకుంటూ ఈ విషయం మాట్లాడుకున్నాము... మీరు రాసిన ప్రతి వాక్యం కుటుంబంలో నమ్మకాలు గాయపడిన బంధాలకీ వర్తిస్తాయి.... అలాగే ఏ బంధానికైనా...

"తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే... "

ఎన్ని సార్లు నాకు నేను పిచ్చివాడిగా అనిపించానో :-)

నిజంగా అప్పటి వరకు మనకి దగ్గర అనుకున్న మనిషి,చేరువైన మనిషి అలా ఉండటం మానేస్తే... అలవాటైన చోటే అపరిచితుల్లా ఉండిపోయే ఆ క్షణంలో నమ్మకాలన్నీ భ్రమలుగానే మిగిలిపోతాయి...

బంధాల్ని వడపోసి రాసినట్టుంది...

నిషిగంధ said...

అందరికీ నచ్చిందే నాకూ చాలా నచ్చింది.. "అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను"
కానీ అక్కడితో కవిత ఆపేసి ఉంటే బావుండేదేమొ అనిపిస్తోంది..

Aditya said...

తప్పదు ప్రతీ మనిషికీ ఎదో ఒక స్టేజీ లో "అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను" ఈ అనుభవం.ఎప్పటిలాగే మంచి కవిత రాసారు అభినందనలు

bhagavan cartoons said...

హృదయాంతరాల్లోని జ్ఞాపకాల పొరలను తట్టింది మీ కవిత..1

aswin budaraju said...

అదిరింది
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను

రిషి said...

కవిత అనగానే అదేదో మనకు సంభంధంలేని విషయం అనుకునేవాడిని..నిజాయితీగా చెప్పాలంటే నాకు అర్ధమవ్వవు. మొదటిసారిగా అర్ధమయిన కవిత ఇదేనండీ...:)

బాగా రాసారు.

నువ్వుశెట్టి బ్రదర్స్ said...

ఇది కవితే కాదు, చాలా మంది గుండెకోత. నాక్కూడా. అందుకే కామెంట్ వ్రాయటం లేదు.

బొల్లోజు బాబా said...

the poem is excellent. the brevity is ultimate

i congratulate you for having been introduced in andhrajyothi. kudos

bolloju baba

kRsNa said...

ఈ రకమైన భావుకత చాలా కవితల్లో చూసినప్పటికి మీ శైలిలో ఒదిగిన పదాల అల్లిక మాత్రం ఆకట్టుకుంది. అలవాటైన చోట అపరిచితంగా, నమ్మకాలన్ని భ్రమలుగా ఈ ఉపమానాలు మాత్రం అద్భుతం. :-)

Anonymous said...

baagundi raadhika gaaru

జయ రెడ్డి said...

మీ కవితలు చదువుతుంటే నా మనసులొని బావాన్నీ రాదిక గారు చెప్తున్నారేంటి అన్నట్లు ఉంటాయి .

అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను
ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి....

చాలా! చాలా బాగుంది.

బొల్లోజు బాబా said...

madam garu,
a review on your blog was published on 2 nov 2008 in the navya suppliment page number 2 of andhrajyothi, under bloglokam category.
here are some links to access them.

i think you need to register for seeing it in enlarged size. which is easy and free.

how you would enjoy it madam


http://epaper.andhrajyothy.com/login.shtml

http://epaper.andhrajyothy.com/AJ/AJYOTHI/2008/11/02/INDEX.SHTML
bollojubaba

బొల్లోజు బాబా said...

there is a spelling mistake. it should be hope you would enjoy it madam. sorry. it is not a question.

telugukala said...

మీ కవిత లోని ప్రతి అక్షరమూ ఆణిముత్యమే అయినా నన్ను ఆకట్తుకున్నది మాత్రం మొదటి రెండు పంక్తులు.
నిజానికి మనసు భరించలేని
వేదన, తీరని తీర్చలేని బాధను కవిత్వమనే మందుపూసి ఆ గాయాన్ని మాన్పుకొనే మార్గమా అన్నట్లు గా నాకు మీ కవిత కనిపించింది.
ఎందుకంటే అప్పుడప్పుడు కాలం ఒక్కోసారి మనవనుకున్నవాటిని మనకి కాకుండా దూరం చేస్తుంది.
నేను ఎంతో అభిమానించే మితృడు ట్రాన్స్ ఫర్ కారణంగా దూరమౌతుండటం నాకు చెప్పుకోలేని బాధను కలిగిస్తోంది. మొదటిసారి అమ్మాయినయినందుకు బాధపడుతున్నాను.
మీకవిత ఒక్కసారిగా నన్ను కదిలించింది.
అధ్భుతం.

J-O-S-H (My Bench !) said...

Its the inner voice of many of us these days.. how true! how simple!
loosing the identity you once had, those little moments..those promises you made to urself... everything starts to disappear right in front of u! sad but true..
very well written.. a very good post from u again..
Keep posting!

win said...

ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి good

ఆత్రేయ said...

మీవనుకున్నది మీరు. మీవని గర్వ పడింది మీరు
జ్ఞాపకాలను తలచి మురిసింది మీరు. గతపు ఆనవాళ్ళుగా మనసులోనే పదిలంగా ఉంచుకున్నది మీరు. మీకలవాటయిన చోటది. మీరెప్పుడూ అక్కడ
అపరిచితులేనేమో? దానికే జ్ఞాపకాలన్నీ చెదిరిపోతే మీరిలా బాధ పడితే ఎలా రాధిక గారూ ? మీ మీద అభిమానంతో అలా అన్నాగానీ మీ కవిత చాలా బాగుంది. నేనూ అనుభవించినదే.

ప్రేమ పంచే మనసు ఉంటే
తిరుగు బదులును ఎదురు చూడకు
గుండె కోసే తరుణ ముంటే
తిరుగు మాటను పదును చేయకు
ఈ రెండు నీతుల మనసు నిలుపు
స్వర్గ మెప్పుడు నీ చెంత నుండును

ఆశీర్వాదాలతో
--ఆత్రేయ

J-O-S-H (My Bench !) said...

@ Atreya garu : Wow sir! i have been going through the comments and you were superb.
those last lines were great.

రాధిక said...

atreya garuu "గుండె కోసే తరుణ ముంటే
తిరుగు మాటను పదును చేయకు" superb.no words

Anonymous said...

nijamga chala baagundi. ekkado, eppudo marichipoyina, marchipovalani prayatninchina jnapakalu anni gurttostunnai.

జయ రెడ్డి said...

రాదికా కోత్త సంవత్సరం వస్తుంది త్వరలో కోత్త సంవత్సర కానుకగ మి అబిమానులకు ఒక కవితని అందిస్తె దానిని మా స్నేహితులకు కానుకగా అందివ్వాలని ఉంది.మరి మా కోరిక తిరుస్తారు కదు.

Ki2 said...

మనస్సు మృదువైన అద్దం లాంటిది అందులోన దాగి ఉన్న మనోబావాన్ని ముచ్చటైన మాటతొ ఎంతటి భారాన్ని అయిన సులువుగా దింపే శక్తి మీ రచనలలో ఉంది అంటె కచ్చితంగ అతిశయం కాదు!!

naveen said...

alavaataina chote aparichithanga undadam andariki anubavame chinna padhalatho peddha bhavamtho varninchadam chala chala bhavundhi..............

naveen said...

alavaataina chote aparichithanga undadam andariki anubavame chinna padhalatho peddha bhavamtho varninchadam chala chala bhavundhi..............

నా మది said...

రాదిక గారు గాయపడిన ఙాపకాలు బాగున్నాయి.నావని గర్వం గా చెప్పుకున్నవి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......

అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను ....
మీ వర్ణన చాలబాగుంది

vijju said...

మీ కవితలు చదువుతుంటే నా మనసులొని బావాన్నీ రాదిక గారు చెప్తున్నారేంటి అన్నట్లు ఉంde

vijju said...

మీ కవితలు చదువుతుంటే నా మనసులొని బావాన్నీ రాదిక గారు చెప్తున్నారేంటి అన్నట్లు ఉం
Very nice..

PAVANKALYAN[I.A.S] said...

నావని గర్వం గా చెప్పుకున్నవిఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......
తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,ఉద్వేగపు క్షణాలు...అన్నీనాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...
గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకునిఅలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను
ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీఒక్కసారిగా చెరిగిపోయాయినమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి

రాధికా మేడం గారు మీ ఈ కవిత చాల భావుంది మనందిరి కోసం మీరు ఇంక్కా మరిన్ని మంచి కవితలు రాయాలి అని కోరు కుంటున్నాము

PAVANKALYAN[I.A.S] said...

నావని గర్వం గా చెప్పుకున్నవిఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......
తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,ఉద్వేగపు క్షణాలు...అన్నీనాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...
గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకునిఅలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను
ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీఒక్కసారిగా చెరిగిపోయాయినమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి

రాధికా మేడం గారు మీ ఈ కవిత చాల భావుంది manandhari కోసం మీరు ఇంక్కా మరిన్ని మంచి కవితలు రాయాలి అని కోరు కుంటున్నాము

Hemalatha said...

mee blog chala bavundi radhika garu..ee roje chusanu modati saarigaa.
'telugu literature in web'community lo jaya reddy garu mee gurinchi rasaaru.
aame cheppina dantlo atisayam ledu.abhinandanalu.

Hemalatha said...

To view the 'telugu literature in web' community page, visit:
http://www.orkut.co.in/Community.aspx?cmm=60859654&mt=7

Mauli said...

Ditto naa thoughts ee kavitha chadivinappudu ...Yekanthapu Dilip garu chepparu ....ee kavita chadivaka, am not alone anipinchindi :) ....same time dhairyam ga kooda undi ....we are in right path ani!!!

Nutakki Raghavendra Rao said...

రాధిక గారు అభినందనలు, మీ విరచిత కవితలు ' హేమంత వుదయం', 'తెలుసుకో నేస్తం' , బాగున్నాయి . 'ఆలోచన' లో చెమరింతలు ప్రయోగం బాగుంది.

Anonymous said...

hmm...Chala bagundandi!

sampath said...

intha manchi aalochanalu elaa osthaayo ... hrudayaanni touch chesthundhi ... awesome

జాజిమల్లి said...

రాధిక గారూ,
'గాయపడిన నమ్మకం' గురించి మిత్రుడొకరు తెగ చెప్పేవాడు. యేంటీ వీడింత విసిగిస్తున్నాడనుకునేదాన్ని. నేను బ్లాగ్లోకానికి కొత్త. ఇప్పుడర్ధమయ్యింది యెందుకు వాడలా గొడవ చేసాడో.
చాలా సున్నితంగా ఉంది మీ వ్యక్తీకరణ. మున్ముందు ఇంకా చాలా మంచి వ్యక్తీకరణలొస్తాయని మనస్ఫూర్థిగా ఆశిస్తూ, అభినందిస్తూ
మల్లీశ్వరి

santoshreddy said...

chaala chaala baagundi ee kavitha...naa prasthutha sthithini theliya chesthunnadi......dhanyavaadalu ee kavitha valla nannu nenu chusukogalguthunnanu...

soumyakiran said...

hello radhika garu..

today only i visited your blog.

one of my friend sent this.

really this one very very nice.

Sreeman B said...

చాలా బాగుంది. ఏదో ఒక రాక్షస సమయాన క్షనికాలమైనా ఏదో ఒక్క క్షణం ఇలా ప్రతి ఒక్కరికి అనిపిస్తుందేమో కదా.

oddula ravisekhar said...

మనం అనుకున్నవి ,కలగన్నవి,పెంచుకున్నవి,పంచుకున్నవి అన్నీ చివరకు తుంచుకోవలసినవేనండి.మన ఒకప్పటి భావాలు ఇప్పడు కొన్ని మధురంగాను కొన్ని విషాదంగాను ఉంటాయి.జీవితం అంటే ఇంతే మరి.భావస్పోరక మయిన కవిత.