Wednesday, March 18, 2020

బుజ్జమ్మా

బుజ్జమ్మా ...
నువ్వొచ్చేసరికి కళ్ళకి భాష నేర్పి 
మాటకి సాయంగా ఉండమనాలి 
పొద్దుటినుంచి దాచిన ఊసులన్నీ 
నీ ముందు పరచాలికదా! 
నువ్వొచ్చేసరికి కాలాన్ని జయించే 
సాధన ఏదో చెయ్యాలి 
నీ ఆలోచనల్లో  కరిగిపోయిన  క్షణాలని 
నీ సమక్షంలోకి తిరిగి తీసుకురావాలి కదా!

No comments: