Showing posts with label అమ్మ. Show all posts
Showing posts with label అమ్మ. Show all posts

Sunday, August 17, 2008

తమ్ముడు


ఎన్ని అద్భుతాలు పంచుకున్నామో కదా మనమిద్దరం
అమ్మఒడి,ఆవకాయ పెరుగన్నం,పిడిగుద్దులు,తాతయ్య కుర్చి....

ఎంత దూరముంటే ఏమిటి మన మధ్య
పిల్లతెమ్మెరలా జ్ఞాపకాలు తాకిపోవడానికి ఆ దూరం ఏం భారంఅవుతుందని?

ఏక్షణమో నీపిలుపు వినిపిస్తుంది లీలగా
హఠాత్తుగా కళ్ళముందు నీ రూపం మెదులుతుంది
ఏ పార్కులోనో అన్నా చెళ్ళెళ్ళో,అక్కాతమ్ముళ్ళో నవ్వుతూ కనిపిస్తారు
మరుక్షణం నువ్వు నేను మన అరుగుమీద ఆడుతుంటాము

మరిన్ని జ్ఞాపకాలు చుట్టుముట్టేస్తాయి
తెలియకుండానే పెదవుల్ని చిరునవ్వులు పలకరిస్తాయి
గుండె బరువెక్కడం మాత్రం తెలుస్తూనే వుంటుంది