Sunday, August 17, 2008

తమ్ముడు


ఎన్ని అద్భుతాలు పంచుకున్నామో కదా మనమిద్దరం
అమ్మఒడి,ఆవకాయ పెరుగన్నం,పిడిగుద్దులు,తాతయ్య కుర్చి....

ఎంత దూరముంటే ఏమిటి మన మధ్య
పిల్లతెమ్మెరలా జ్ఞాపకాలు తాకిపోవడానికి ఆ దూరం ఏం భారంఅవుతుందని?

ఏక్షణమో నీపిలుపు వినిపిస్తుంది లీలగా
హఠాత్తుగా కళ్ళముందు నీ రూపం మెదులుతుంది
ఏ పార్కులోనో అన్నా చెళ్ళెళ్ళో,అక్కాతమ్ముళ్ళో నవ్వుతూ కనిపిస్తారు
మరుక్షణం నువ్వు నేను మన అరుగుమీద ఆడుతుంటాము

మరిన్ని జ్ఞాపకాలు చుట్టుముట్టేస్తాయి
తెలియకుండానే పెదవుల్ని చిరునవ్వులు పలకరిస్తాయి
గుండె బరువెక్కడం మాత్రం తెలుస్తూనే వుంటుంది

45 comments:

Kathi Mahesh Kumar said...

బాగుంది.

ప్రతాప్ said...

మీఅన్ని కవితల్లానే ఇది కూడా చాలా సరళంగా ఉంది అలానే బావుంది కూడా.

జాన్‌హైడ్ కనుమూరి said...

మనస్సువిప్పి జ్ఞాపకాపొరల్లోంచి
అరుగుమీద ఆడుకోవటం
పెరుగన్నంలో తినేసిన ఆవకాయ బద్దను ఇంకా నములుతున్నట్టువుంది
అది తిన్న వారికే సొంతమయ్యే అనుభూతి.
ఈ కవిత చదవగానే నా బాల్య స్నేహం, అనుబందం ఆడుతూ పాడుతూ స్కూలుకెళ్లిన నేస్తం నా అక్కకు ఫోనుచేసి పెరుగన్నంలో ఆవకాయ నంజుకున్నట్టు జ్ఞాపకాలను పంచుకున్నాము.

Bolloju Baba said...

nice

ramya said...

బావుంది రాధిక ఎంత బాగ చెప్పారు. ఒకే వస్తువు కోసం దెబ్బలాడుకున్న ఆరోజులన్నీ ఇప్పుడు ఎంత మధురం గా తోస్తాయో.
రోజూ దెబ్బలాడు కున్నా, మళ్ళీ వాళ్ళు లేకపోతే (సెలవల్లో చెరో చోటికి వెళితే) అవన్నీ పంచుకోవటానికి వారు లేక ఒంటరి వారై పోయామే అనిపించేది.
ఇంకా ఏదో రాయాలనే ఉంది కానీ ఈ సిస్టెమ్‌ రాయనిచ్చేటట్టు లేదు, ఇది బాగయ్యాక మళ్ళీ ఇటుకేసి వస్తా.

నిషిగంధ said...

చాలా మంచి కవిత రాధికా!!

"గుండె బరువెక్కడం మాత్రం తెలుస్తూనే ఉంది" పొద్దున్న ప్రస్తుతం ఇండియా లో ఉన్న మా తమ్ముడితో మాట్లాడుతుంటే ఇదే జరిగింది :(

చిన్నప్పుడు మేము ఆడుకున్న స్థలాలు, కలిసి తిరిగిన సందులు, తరచూ వెళ్ళే కొట్లూ ఎంత మారిపోయాయో చెప్తూ ఆ రోజులన్నిటినీ గుర్తు చేసుకుంటుంటే మనసు ఆ జ్ఞాపకాల వెంట పరుగులు తీసింది.. మధ్యలో సముద్రం లేకుంటే నా కారుని కూడా అటు వైపే పరుగులు పెట్టించేదాన్ని..

ఏకాంతపు దిలీప్ said...

అబ్బా...! రాధిక గారు... భావాన్ని మాటల్లో యధాతధంగా పెట్టడం మీకే చెల్లుతుంది... చాలా బాగుంది...

Anonymous said...

అసలు మీరు ఎలా రాస్తారండీ ఇవన్నీ

Anonymous said...

Awesome!!

kRsNa said...

చాలా బాగుంది! చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని రీళ్ళు తిరిగాయి.

Aditya said...

రాధిక గారు

అన్నా చెల్లి,అక్క తమ్ముడు ఈ అనుబంధం ఎప్పటకి విడదీయలేనిది.దురాలు పెరిగిపొయి,బాధ్యతలు ఎక్కువై అన్ని మిస్స్ అవుతున్నము.ఈ రాఖి సందర్బంగా మంచి కవిత రాసారు.అలాగే మంచి ఫీలింగ్ గుర్తు చెసారు.దన్యవాదములు.

ఆదిత్య.

సుజ్జి said...

aemandi radhika garu... elanti kavithalu rasi nannu baadha pettakandi.. ela touching ga rasi, adi nenu chadivi,... ..tammudu gurthuku vachi.... nenu aedavatam meeku estamena.... edi meeku bhavyamena..??

Bhasker said...

చాలా బాగుంది! తమ్ముళ్ళ హౄదయాలకు తాకే కవిత.

Pradeep Palem said...

కవిత బాగుందండి...బొమ్మ కూడ...

Anonymous said...

radhika garu, car lo aeto choostuna photo medena?

Trinath Gaduparthi said...

"అమ్మఒడి,ఆవకాయ పెరుగన్నం,పిడిగుద్దులు,తాతయ్య కుర్చి...." ఈ ఐదు పదాల లో ఎన్నో దృశ్యాలను ఇమడ్చారు. చాలా నచ్చింది
ఏ ఒక్క పదము అనవసరం అని అనిపించకుండా, ఆచి తూచి పదాలను వాడారు. బాగుంది !

Anonymous said...

చాలా బాగుంది. మీ కవిత చదువుతూంటే, అసంకల్పితంగా పెదవులపై చిరునవ్వులు దోబూచులాడాయి. మనసుకెంతో హాయినిచ్చింది.

Anonymous said...

hi akka .thank you very much. ee sari rakhi pampalekapoyavani badhapaddaa ippudu ee kavita chadivaaka mottam poyindi . thanks for ur rakhi gift. anand

చైతన్య.ఎస్ said...

చాలా బాగుంది రాధికా గారు.

విహారి(KBL) said...

రాధికగారు మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

జాన్‌హైడ్ కనుమూరి said...

అక్క - తమ్ముడు - చెల్లి - అన్న

వర్మ said...

Radhika garu Excellent andi. అంతకంటే ఎక్కువ చెప్పలేము...

జాన్‌హైడ్ కనుమూరి said...

మీ తమ్ముడు స్పూర్తితో నేను నా అక్కకోసం కవిత రాసాను
చదవండి
http://johnhaidekanumuri.blogspot.com/2008/08/blog-post_29.html

Anonymous said...

radhi bagundi ni kavitha chala rojulyindi ni blog chusi song also good.photo kuda kottaga add chesinattunnv chala bagundi

Rama Deepthi Muddu said...

I remembered my sister.. nice one.. tatayya kurchi does remind me of my childhood!
well written.keep posting.
luv
JOSH

మురారి said...

>>ఏ పార్కులోనో అన్నా చెళ్ళెళ్ళో,అక్కాతమ్ముళ్ళో నవ్వుతూ కనిపిస్తారు
మరుక్షణం నువ్వు నేను మన అరుగుమీద ఆడుతుంటాము
its pleasing visually too.

వేణూశ్రీకాంత్ said...

అద్భుతమైన కవిత రాధిక గారు. చాలా చాలా బాగుంది. ఎన్ని అద్భుతాలు పంచుకున్నాం.... సూపర్. ఓ గుప్పెడు పదాలతో కొండంత భావాన్ని పలికించేస్తారు మీరు. ఫోటో కూడా చాలా బాగుంది.

Prasad Y said...

Radhika Garu

allavunnaru miru wrasina kavithalu chalabagunnae nenu chadhivi chala happy gaa feel aennanu chala thanks.
miru wrashina vidhanga nenu BLOG lu wrayali anukontuvunnanu Please help me
naa Phon NO.09972330784
Y-Prasad@in.Com
prsd_y@Yahoo.com
Please dhayavuchi BLOG alawrayalo cheppagalaru or mi phone No popithegani nenu mi ku contact avuthanu.
Thanks
-Prasad Y-

S said...

Hmm.... ఈ అంశం చాలా ఆసక్తి కరమైనది. నాకు కూడా నా తమ్ముడు గుర్తు వచ్చాడు చదవగానే. కానీ, ఇది ఇదివరలో నేను చదివిన మీ కవితలంత పవర్‌ఫుల్ గా లేదు అనిపించింది. కానీ, అంశం కదిలించే తరహాది కనుక - ఆ విషయం కవర్ ఐందేమో అని నా సందేహం.

chandanamsreekanth said...

superb... kindly continue the same.... iam getting something new..

l said...

hey radhika!
meedhi chala popular blog anukunta.
i've recently started blogging.
meeru na blog chuusi plz post a comment.

మరువం ఉష said...

అనుకున్నంత వతనుగా నా blogని ముందుకు జరపలేకపోతునాను. అది అలసతో, అలసటో తెలియదు. కాని అపుడపుడు మనసు మరీ మనియాద పడ్డప్పుడు వ్రాసుకుపోతుంటాను. మీ కవితలన్నీ చాలా బాగునాయి. తమ్ముడి మీద మీరు వ్రాసిననట్లుగా నేను "వాడు-నేను" అని మా అన్నయ్య మీద వ్రాసుకున్ననిదివరలో. చాల దగ్గరి పోలికవుంది. ఇంకా కొన్ని వున్నాయి అనిపించిందీ. మన ఈ భావసారూప్యంతో అడుగుతునాను - నాతో కలం స్నేహం చేస్తారా?

author_number_2 said...
This comment has been removed by the author.
author_number_2 said...

ఇది చదివాక మా అన్నా గుర్తొచ్చాడు,చాలా బాగా రాసారండి.

Unknown said...

hello! Radhika garu
Akka Thammulla bhandham gurinchi
chala bhaga cheppaaru.
mee padhala phondhika eentho bhagundhi

Anonymous said...

pretty good,i remembered my sister,
u expressed the internal feellings of mien,and the the past life of mien featured infront of my eyes which is same as ur life.

Anonymous said...

రాధికగారు, నా తమ్ముడు కనిపించాడు ఇందులో. Thank you.

Anonymous said...

చాలా బాగుంది రాధికా గారు...

nirvan@hyderabadghar.com
http://hyderabadghar.com

Srikar said...

ఈ కవిత చదివి మా అక్కకి పంపాను, మా ఇద్దరికీ నచ్చింది. నేను మాత్రం ఇప్పుడు మీ బ్లాగ్ కి ప్రోమోటర్ని!

కెక్యూబ్ వర్మ said...

జాన్ హైడ్ గారు మరల ఈ కవితను ఫేస్ బుక్ గ్రూపులో వుంచి మీ ఆవకాయ రుచిని పంచారు..

vemulachandra said...

జ్ఞాపకాలపొరల్లో ... అరుగులూ, ఆడుకోవటాలూ ... పేదరాసిపెద్దమ్మ కబుర్లూ వేడన్నంలో ఉసిరికాయ, గోంగూర పచ్చడి తిన్న అనుభూతి ... నాలుగున్నర పదులు దాటిన ఎవరికైనా ... బాల్యం, స్నేహం, కోతికొమ్మచ్చిలు ... అన్నీ అరమరికలు లేకుండా కళ్ళముందు కనిపిస్తూ ... అభినందనలు మిత్రమా!

pravi said...

avakaya thintea entha anubhuthi unttudho antha bagundi.life long kaliundali brothers

pravi said...

avakaya thintea entha anubhuthi unttudho antha bagundi.life long kaliundali brothers

pravi said...

avakaya thintea entha anubhuthi unttudho antha bagundi.life long kaliundali brothers

Anonymous said...

చాలబాగుందండీ రాధిక గారు .చదువుతుంటే నాకు మా తమ్ముడు గుర్తొచ్చాడు👌👌