Showing posts with label పల్లెటూరు. Show all posts
Showing posts with label పల్లెటూరు. Show all posts

Monday, August 17, 2009

నా ఊరు



నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది

తన
అవసరం లేదనుకుందేమో
రచ్చబండ బీటలేసింది

గుడి
మెట్టు,చెరువు గట్టు
నాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయి

జామచెట్టుకేసిన
ఊయల
కిర్రు చప్పుళ్ళ ఊసేలేదు

ఇక
రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు

ఇపుడా
ఊరు
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది

తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు