
నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది
తన అవసరం లేదనుకుందేమో
రచ్చబండ బీటలేసింది
గుడి మెట్టు,చెరువు గట్టు
నాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయి
జామచెట్టుకేసిన ఊయల
కిర్రు చప్పుళ్ళ ఊసేలేదు
ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు
ఇపుడా ఊరు
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది
తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు



62 comments:
Chala baundi....chala rojula taruvata rasaranukunta....ika pai tarachu rastu undandi.....Krishna
నిజంగానే మీరు ఇన్ని రోజులు రాయకపోవడం బ్లాగులోకం బీటలు వారింది. మీ రాకతో మళ్ళీ వానలు మొదలు..
sonta ooru gurinchi inta baaga raayochani modatisaari telisindi.. kavitalu ela raayaalo nerchukuntunna.. mee blog chadivi...
అసలే మోడు బోయిన ఊరికి
ఆత్మీయులూ కరువయితే
ఆదరించే వారెవ్వరు?
ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు
మావూరు వెళ్లినపుడు, వారెలా ఉన్నారు వీళ్లెలా ఉన్నారు అని అడిగినపుడు విన్న సమాధానలకు దాదాపు ఇలాంటి భావనలే మదిలో మెదులుతాయి.
బ్యూటిఫుల్ పొయెం
బొల్లోజు బాబా
nice one...
the last glimpse is what i guess most have...some things are more beautiful if not seen again..they are good in memories than in real life. Once there is a gap it somehow always will be!
చాలా బావుంది రాధికగారు
"తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు"
ఇది మాత్రం నిజం. జ్ఞాపకాలు నిత్యనూతనం కాలానికతీతం . వాస్తవం అలా కాదుగా. అందుకే మార్పు సహజం
కవిత చాలా బావుంది!
రాధికగారు, అభినందనలు!
"తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు"............చాలా చాలా టచింగ్ అండీ.
చాలా బావుంది రాధిక గారు..
Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking sites.
Telugu Social bookmarking sites gives more visitors and great traffic to your blog.
Click here for Install Add-Telugu widget
కానీ వెళ్ళకుండా ఉండలేం.. అదే ఊరి ప్రత్యేకత.. చాలా బాగా రాశారు..
చాలా బాగుంది రాధిక... మూగపోయిన మనసు ఒక్కసారి వూరి జ్ఞాపకాలలో ఆగి పోయింది.
ఆకురాల్చిన రావి చెట్టు తిరిగి చిగురిస్తోంది
మళ్ళీ మీరాకకోసం ఎదురుచూస్తూ ....
బీటలేసిన రచ్చబండని పచ్చగడ్డి పూడుస్తోంది ...
గుడి మెట్టు,చెరువు గట్టు చెవులురిక్కించాయి
మీపాదాల సవ్వడికై ..
జామచెట్టుకేసిన ఊయల ఇపుడు
బుల్లి బుజ్జాయిల ఆటవిడుపు
దాటిపోయిన అయినవాళ్ళు
ఆకాశంలో చుక్కలై మిమ్మల్ని దీవిస్తున్నారు
మీ చరిత్రకి శిధిల సాక్ష్యంగా మిగిలిన
మీ ఊరు ....
మీ జ్ఞాపకాల పునాదులతో
పునర్నిర్మితమౌతుంది ...
* ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు
ఎన్నెల్లు తిరిగొచ్చేనీబ్లాగుకు ....
రాధికగారు , మీ కవితలో కనపడుతోంది మీ ఊరంటే మీకెంత ఇష్టమో ..
మీ జ్ఞాపకాల్లో మీ ఊరు సజీవచిత్రంగా ఉండాలని నా ఆకాంక్ష !
chala chala bagundi radhika garu..
avnu...konni..manam talchukuntuu untene baguntai...vati marpu badha ga untundi..
ఇప్పుడు మా దాహం తీరింది :)
చాలా బాగుందండి..
ఒక్క క్షణం నెవ్వెరపోయాను
బాధా తప్త హృదయంనుంచి ప్రతీకల్ని లాక్కొచ్చి మీ ఊరును పదాలలో కట్టేసారు
మార్పు ఊరిలోనేకాదు, మీ కవితా పటిమలో కూడా.
అభినందనలు
chala chaala chaaala baavundi radhika:) mee blog lo edi update ledani telisina enduko prati roju vachedani.. entoo ee kavitha post chesina ee 3 rojulu ela miss ayano teledu.. but anyways Welcome Back:)
చాలా కాలానికి రాసినా...., చాలా చక్కని కవిత రాశారు.
మీరు మీ ఊరు వెళ్ల బట్ట్టే....
మీ ఊహలకు ఊపిరొచ్చింది
ఈ కవితగా రూపుదాల్చింది.
ప్రశంసలు :)
చాలా బాగుందండి!
బావుంది రాదికా ...
బీటలు వారిన భూమికి మాములు వర్షాలు సరిపోవండి. కాస్త బారి వర్షాలు పడితే కాని మీ అభిమానుల దాహం తీరదు ..
హ్మ్మ్ తప్పదు. మార్పు తప్పదు. కానీ ఇలాంటి మార్పు జరిగితే కొంచెం కష్టంగానే ఉంటుంది.
రాధిక, "జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు" ఇంచుమించుగా నా "పల్లె పగలబడి నవ్వింది" http://maruvam.blogspot.com/2009/06/blog-post_13.html లో వ్యక్తపరిచింది ఇటువంటి వేదనే. There is a lot of synergy between these two. I appreciate your share of feelings at mine hence..
-ఉష
రవి గారు మీరన్నది నిజమే.ఆత్మీయత కూడా లేకపోతే ఊరేమైపోతుందో?ఆ ఊరు నుండి వచ్చేసి మంచిగా స్థిరపడినవాళ్ళంతా ఊరికి ఏమన్నా చేద్దామంటే అక్కడ ఊరు మాత్రమే మిగిలింది.యువకులంతా చదువులనో,ఉద్యోగాలనో వలసపోయారు.కుటుంబాలన్నీ పిల్లల చదువులపేరుతో వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు.చిన్నాచితకా పనులు చేసుకునేవారు కూడా పట్నాల్లో ఫాక్టరీలకు వెళ్ళిపోతున్నారు.రైతులు కూడా పొలాలు కౌలుకిచ్చుకుని వేరే పనులు వెతుక్కుంటున్నారు.కొద్దో గొప్పఒ మిగిలిన ముసలివాళ్ళు మాత్రం మిగిలారు.మళ్ళాసారి నేనెళ్ళేసరికి అక్కడ నన్ను పలకరించడానికి ఎవరూ వుండరేమో.నేను చూసిన చాలా పల్లెటూర్ల పరిస్థితి ఇదే.
వర్మ గారు,క్రిష్ణ గారు అంతా మీ అభిమానమండి.
@బాబా గారూ అవునండి అదే పరిస్థితి నాకెదురైంది.అందుకే ఈ బాధ.
@జోష్ దీప్తి నిజమే జ్ఞాపకాలు నిత్యనూతనం.ఎంత పాతబడితే అంత విలువ పెరిగిపోతూ వుంటుంది.
@లలితగారూ అవును మార్పు సహజం.ఒప్పుకోవాల్సిందే.కానీ అలా ఒప్పుకోడానికి మనసు రాకే ఇలా.
@సోమశేఖర్ గారు,చిన్ని గారూ,మేధ గారూ ధన్యవాదాలు.
ఁఉరళి బాగా చెప్పారు.అవును వెళ్ళకుండా వుండలేము- వెళ్ళి ప్రతీ వీధిలో మన అడుగుజాడల్ని,ప్రతీ కొమ్మలో మన చిన్నతనాన్ని వెతుక్కోకుండా వుండలేము.
@పరిమళం గారూ మీ కామెంటు తెగ నచ్చేసింది నాకు.అర్జంటుగా వచ్చి హగ్గిచ్చేయాలని వుంది.అలా జరగాలని నేనుకూడా కోరుకుంటున్నాను.ఎటూ లోకం అంతా తిరోగమన వాదం పట్టింది కాబట్టి కొన్నేళ్ళకైనా పల్లెలకి వెలుగొస్తుందని ఆశిద్దాం.
కిరణ్,దిలీప్,ప్రణీత.స్వాతి గార్లకు -కామెంటినందుకు ధన్యవాదాలు.
జాన్ గారూ ఎప్పుడైతే నేను రాయలేనని అనుకుంటూ వుంటానో అప్పుడు నన్ను ఉత్తేజపరుస్తూ మీ నుండో మైల్ వస్తుంది.ఆశ్చర్యం..అంత పర్ఫెక్ట్ టైము లో జాబురాయాలని మీకనిపించడం ...ఖశ్చితం గా అది నా అదృష్టమే :) థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సార్.
@అభిసారికా ఓ మీరేనా గత ఆరునెలలుగా నా బ్లాగుకు హిట్లిస్తుంది.థాంక్యూ థాంక్యూ.
@విశ్వప్రేమికుడుగారూ మీ ప్రశంసలు అందుకున్నాను.ధన్యవాదాలు.
@భైరవభట్ల గారూ మీ నుండి కామెంటే....అదీ బాగుందంటూ ప్రశంస.ఉబ్బితబ్బిబ్బయ్యిపోతున్నాను.పామరులు రాసింది నచ్చడం.మెచ్చడం ....కలలాగా వుంది.మన్స్పూర్తిగా ధన్యవాదాలు.
జయా ఈ వాన సరిపోదని తెలుసు.దీనిని కవితగా కాక అంటే భాష,భావం పరం గా కాక నా బాధ అనుకుంటూ చదవండి.ఇన్నాళ్ళ తరువాత రాసేది కొద్దో గొప్పో బాగుంటుందనుకుంటూ చదివి వుంటారు అందరూ.కానీ హైపున్న మూవీ హిట్టవ్వడం కష్టమైనట్టు ...ఇది ఎక్కడం కష్టమే.హైపుందంటావా అంటారా :)
ఁఅహేష్ గారూ అవునండి ఈరకమిన మార్పు కోరుకోలేదు.ఊరొదిలి వెళ్ళిపోయిన నాకు ఈరకం గా బాధపడే అర్హత లేదనుకుంటా. కానీ మనుషులం కదా మనమింతే.
ఉష గారూ మీ కవిత చదివాను.ఇద్దరి బాధా ఒక్కటే.వీకి వెక్కి నవ్వింది ప్రయోగం అద్భుతం.మీరు రాసిన దానిలో గాఢత ఎక్కువ వుంది.బాధను కూడా బలం గా వ్యక్తీకరించలేని భావ బలహీనత నాది :)
మరొక్క సారి కామెంటినవారందరికి ధన్యవాదాలు.
రాధికా మనసంతా ఏంటొ తెలియని ఒక రకమైన బెంగ వచ్చేసింది మీ కవిత చదవగానే మా ఊరుగుర్తు వచ్చేసింది .. పరిమళం గారిని నేను అభినందిస్తున్నాను చాలా బాగా రాసారు :)
Super
అహా ఎన్నాళ్ళెకెన్నాళ్ళకు రాధిక గారి కవిత అని ఆనందంగా ఇటు వచ్చాను. కవిత బాగుంది, కానీ మీ ఊరి గురించి చదివి గుండె బరువెక్కింది. మార్పు సహజమే కానీ!!
hello... hapi blogging... have a nice day! just visiting here....
చాలా బాగా రాసారు రాధిక గారు..
Very very nice poem. Awaited a long time to see ur new post. If u feel like, have a look at this post...
http://narasaraopet-bloggers.blogspot.com/2009/08/blog-post.html
Really very heart touching...
రాధిక గారు,
చాలా బాగా రాసారు.
* * * *
మీరొస్తారని మర్రి చెట్టు తొర్రలో చిలకమ్మ సింగారించుకుని ఎదురుచూసింది...
కోయిలమ్మ తిరిగి తన గొంతును సవరించుకుని పాడటం మొదలు పెట్టింది..విన్నారా?
మీ కబుర్లు మళ్ళీ విందామని ఏటిగట్టుపై వాన కళ్ళాపువేసింది...
వాకిట్లో సన్నజాజి తన పరిమళం మీరు అఘ్రానించాలని మీతో కలసి ఎంతో దూరం ప్రయానించలేదూ!!
కాలం ఎంతలా మారినా వాటి ధర్మాలు మనుషుల వలే మార్చుకోలేమంటున్నాయి అవి...
* * * *
ఏంటోనండీ...విలువైన పల్లె జీవితాలు వాటి రూపం కోల్పోయి ఇలా ఊళ్ళను నిర్జీవంగా మార్చేస్తుంటే చాలా భాదగా ఉంటుంది.
oollalo ippati paristutalni pratibinbinchaayi mee maatalu.
nenu kooda okkosaari alane feelavutoontanu.
anyway, keep writing.
oorlalo ippati paristitini pratibinbinchaayi mee maatalu.
nagareekarana kaanivvandi maredaina kaanivvandi, oorilo vatavaranam maaripotondi mella mellaga.
any way, keep writing
మా ఊరు గుర్తుకు వచ్హింది
చాలా బావుంది
మీ కవితలే మీ హైపే అంది, చాల expectations ఉంటై మీ బ్లాగ్ మీద .. ! పరిమళ గారి కామెంట్స్ చాల చాల బాగున్నై ! మీ కవిత చదువుతోంటే, మీరు మీ ఊరిలోంచి వెళ్తుంటే మీరు అవన్నీ చూస్తున్నట్టు అలా కనపడుతోంది...! సద మీ తదుపరి కవిత కోసం ఎదురుచూస్టూ !
- శ్రీకర్ (కేవలం శ్రీకర్ JUST SRIKAR)
Hi radhika,
simply superb madam...andaruu anukuntaaru.. but meeru blog cheyagaligaaru...
Chala bagundi...
palle kanneeru peduthundo
need to do something abt it
thank u
Superb! as usual :)
ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు
--------------------
ఈ లైన్ అద్భుతం, టచింగ్
bagundi madam
అయిన వాళ్ళు వెల్లిపోయినా వారు విడిచెల్లిన ఙ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. నిజంగా ఇప్పుడు మా ఊరు వెళ్ళాలంటే ఎక్కడో గుండెలో చిన్న వణుకు. నేను ఊరొదిలి దాదాపు ఇరవై వసంతాలు గడిచాయి. ఇప్పుడా ఊరెలా ఉందో తెలియదు కాని, చిన్నప్పుడు నాతో కలిసి చదువుకున్న వాళ్ళు కొందరెల్లిపోయారు, మరి కొందరెక్కడున్నారో తెలియదు. వాళ్ళ ఙ్ఞాపకాలు మాత్రం మిగిలాయి. మా ఊరి గోరీల దొడ్డి, అందులోని మర్రి చెట్టు, దాని క్రింద ఆడుకున్న ఆటలు, అక్కడే కబడ్డీ ఆటలో నేను విరగ్గొట్టుకున్న నా కాలర్ బోన్ అన్నీ గుర్తొచ్చాయి. nice, keepitup
yemani cheppanu ela cheppanu
mee naa ooru nu chaduvutu
kallalo tirige kanneeru tirigi na oorini gurtu chestunte
vagu vankala snanalu
badi eggotti regu pandla ki vellina rojulu
pakka oori totalo verusenaga dongatanalu
cycle nerchukuntu tagilina mokali debbalu
yemani cheppanu ennani cheppanu
mi naa oorito annnneeeee malli gurtochayi
చాలా బాగుందండి..ఇప్పుడే చుసాను...పరిమళంగారి మాటే నా మాట!!
మీరు పంపమన్నది అందిందాండి? తెలీలేదు..
anubhavaalu, gnaapakaalu, balyam, sneham, manam putti perigina ooru....veeti gurinchi entamandi enni rakaalugaa raasinaa.... prati prayogamlonu ento aardhrata. chaalaa baagundi :)
sunnithamiana matalatho chkkaga nishbadamina nijani rasaru, chala bagundi,..
రాధిక అక్కా.... ఎమి అనుకోకండి అలా పిలవాలనిపించింది తప్పైతే క్షమించండి.
నేను మీ బ్లాగు కొన్ని రోజుల నుండి చూస్తున్నాను.
నాకు చాలా చాలా నచ్చింది నాకు మిమ్మల్ని
'మనసు కవయిత్రీ' అనాలనిపిస్తుంది.
ఇప్పటికి మీరు 98 రాసారు త్వరగా సెంచెరీ కొట్టేయండి.
వందో కవిత మాత్రం సూపర్ గా ఉండాలి అక్కా గుర్తుంచుకోండి,
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది -
అద్భుతమయిన భావన. నాకు చాలా నచ్చిన కవితల్లో ఇదొకటి. అభినందనలు
chala bagundandi.. tharachu rasthundandi..mee kavithalu chala ardhavantham and simple ga untayi..
రాధిక గారూ మీకు ఇదేమన్నా బాగుందా చెప్పండి ఎన్నాళ్ళని ఎదురుచూదమంటారు మీ క్రొత్త కవిత కోసం....
మీ కవితానుభూతుల నీకాసంలో చీకటి మనసులోనికి తొంగి చూసుకోవాలని ఉంది .
మీ బ్లాగు గురించి మీ పై నా అభిమానాన్ని,గౌరవాన్ని నా రాతలలో... నా బ్లాగు ద్వారా తోటి బ్లాగరులకి తెలియజెయాలని చిన్ని ఆశ...క్షమిస్తారు కదూ...అనే నేనూ ఆశిస్తున్నను
ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.
appudoo ippudoo ooru maarachu.. kaani gnaapakaalave gaa.. :)
radhika gaaru please visit
mee blog gurinchi raasaanu mee antha baagaa kaadulenDi.
http://www.tholiadugu.blogspot.com/
ఎప్పటి నుంచో రాయాలనుకుంటున్న మా ఊరు గురించి మీ కవితా స్పూర్తి తో రాసేశాను:)
http://bharath-thippireddy.blogspot.com/2009/10/to-my-village-with-love.html
see this one..
http://srisimhathodeti.blogspot.com/
రాధిక అక్క, ఎందుకని ఆగిపోయారు.... రాయండి మీరు ఇంకా రాయాలి....
మేము ఎదురుచూస్తున్నాం .........రోజు మీ బ్లాగింటికి వచ్చి అయ్యో ఈరోజు రాధిక అక్క కొత్తగా ఎం వండలేదే అని ఆకలితో తిరిగి వెళ్లి పోతున్నాం.........
మా ఆకలి తీర్చరూ..........
Post a Comment