భావం భాషగ మారకముందే
మనసు మూగబోయింది
మోడు చిగురులు వేయక ముందే
వసంతం వెళ్ళిపోయింది కల కన్ను తెరవక ముందే కరిగి కన్నీరైపోయింది
నా దారి నిను చేరకముందే
గమ్యం మారిపోయింది నా పయనం ఆగిపోయింది
నీ పరిచయం పంచిన ఆనందం అనుభూతులుగా మార్ఛి
గుండెల్లో దొంతర్లుగా పేర్చి
నాతోపాటు తీసుకెళుతున్నాను
ఈ దూరం మన స్నేహాన్ని దూరం చెయ్యదు కదా?
ఈ కాలం మన అనుభూతులని మరుగుపరచదు కదా?
తిరిగొఛ్ఛిన నన్ను నీ స్నేహం నువ్వెవరని గేలి చేయదు కదా
కలలు కన్న తీరాన్ని చేరుతూ
ఇక్కడి అనుబంధాన్ని మరువనని
మాటిస్తున్నాను నేస్తం... మరి...నువ్వు???