
కనులు తెరవాలంటే భయం
కలలోనే నీ రూపం కనుమరుగయిపోతుందని
కనులు మూయాలంటే భయం
ఎదుటనిలిచిన నిను చూడలేనేమో అని
వాస్తవం లోకి చూడడం భయం
కలలోనే నువ్వు మిగిలిపోతావని
స్వప్నం లోనే వుండడం భయం
నిజం లో నిన్ను కోల్పోతానేమొ అని
నిను గూర్చి ప్రతీదీ భయమే...
కలుసుకోవాలంటే భయం
విడిపోతామేమోఅని
విడిపోవాలంటే భయం
ఇక కలుసుకోలేనేమొ అని
నిను మరచిపోదామంటే భయం
నే జీవించలేనేమో అని
పోని మరణిద్దామంటే భయం
ఇక నిను చూడలేను కదా అని
ఇలా... అన్నీ..భయం భయం భయం



4 comments:
mee kavithalu chala baga unnai, meeru rase prathi kavitha , na manasulo rasukunna kavithalla unnai, edi kalana nijama!
nanne na mundu nila bedutunnaru.
very good
రాధిక గారు, చాల బాగా రాసారండి. ఒక్కప్పుడు హిందీ లొ గజల్స్ వింటూ ఆ గజల్స్ లోని భావుకత కి జోహార్లు అనుకునేవాడిని. ఈ రోజు మీ కవిత చదివినాకా తిరిగి అదే అనుభూతి కలిగింది. ఇంత మంచి కవిత అందించినందుకు ధన్యవాదములు.
simply superb
cheppadaniki matlakuda ravadam ledu
Post a Comment