
నూరేళ్ళు నిలిచే స్నేహం కావాలి
కన్నుల్లో నను దాచే నేస్తం కావాలి
గుండెల్లో ఒదిగిపోయేందుకు ప్రియుడు కావాలి
ఒకరికి సొంతమయ్యేందుకు నేను కావాలి
.........................................................
ఏ స్నేహం నాకొద్దు
ఏబంధం వేయొద్దు
స్నేహం కాలంతో చేజారిపోతుంటే
బంధం దూరంతో ముడివీడిపోతుంటే
ఏ సంతోషమయినా విషాదంగా మిగిలిపోతుంది
చిన్ని ఆనందం సైతం ఎండమావిలా మారిపోతుంది
అందుకే ఏ స్నేహం నాకొద్దు
ఏ బంధం వేయొద్దు



2 comments:
ఈ కవిత చాలా బాగుంది అండి రాథిక గారు నేను ప్రింట్ ఔట్ చేసు కొని నా రూం లో వాల్ కి అంటించాను
ita really heart touching
Post a Comment