Tuesday, August 01, 2006

లాస్యం


అధర కాగితాలపై విరిసే
సుమధుర కవిత
మనసుల్ని దోచే
హిమ వీచిక
మృదు మధుర దరహాసిక
ఓ సుందర జ్ఞాపిక
కలతల్ని మరిపించి మురిపించే
అనిర్వచనీయ కానుక
మాట రాని మనసులకు పలుకు నేర్పే
లిపిలేని భావమిదే ఇక.

2 comments:

spandana said...

రాధిక గారూ,
కవిత చాలా బాగుంది. కానీ అదేంటి మళ్ళీ అక్షరం సున్నాకు బదులు అంకె సున్నా వాడేస్తున్నారు?
ఇంకా వీటిని సరిచేయండి. "మ్రుధు" కాదు "మృధు -mRdhu). "జ్ఞాపిక" --అని రాయాలి 'జ్నాపిక" -- దీన్ని ఎక్కడినుంచీ రాశారో గానీ నేను రద్దామన్నా లేఖిని రాయనివ్వటం లేదు. వీవెన్ అన్న గారినడగాలి ఇందులో చిక్కేంటో!

--ప్రసాద్
http://blog.charasala.com

రాధిక said...

క్షమించండి.అది పాత పోస్టే.అందుకే ఆ సున్నా కనిపిస్తుంది.నేను మార్పు చేయలేదు.ఎదో ఫొటో మారిస్తే మళ్ళా పబ్లిష్ అయినట్టుంది.సైటులో ఏ చిన్న మార్పు చేసినా కూడలి ఆ పోస్టుని చూపించేస్తుంది.